Swetha
రాజాసాబ్ సినిమా గురించి ఈ మధ్య చాలా చర్చలు నడుస్తున్నాయి. ప్రభాస్ అభిమానులు కూడా సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసి చూసి అలసిపోయారు. సరే సినిమా వచ్చినప్పుడే చూద్దాంలే అనే స్టేజ్ కి వచ్చేశారు. ఎందుకంటే ఇప్పటికే సినిమా చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది.
రాజాసాబ్ సినిమా గురించి ఈ మధ్య చాలా చర్చలు నడుస్తున్నాయి. ప్రభాస్ అభిమానులు కూడా సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసి చూసి అలసిపోయారు. సరే సినిమా వచ్చినప్పుడే చూద్దాంలే అనే స్టేజ్ కి వచ్చేశారు. ఎందుకంటే ఇప్పటికే సినిమా చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది.
Swetha
రాజాసాబ్ సినిమా గురించి ఈ మధ్య చాలా చర్చలు నడుస్తున్నాయి. ప్రభాస్ అభిమానులు కూడా సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసి చూసి అలసిపోయారు. సరే సినిమా వచ్చినప్పుడే చూద్దాంలే అనే స్టేజ్ కి వచ్చేశారు. ఎందుకంటే ఇప్పటికే సినిమా చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది. ఇక ఫైనల్ గా జనవరి 9 డేట్ ను లాక్ చేశారు మూవీ టీమ్. ఈసారైతే గ్యారెంటీ అని అంటున్నారు. కానీ ఏమౌతుందో చూడాలి. అయితే ఇప్పుడు సినిమా డేట్ లాక్ అయింది కాబట్టి.. ఇప్పుడు మూవీ ట్రైలర్ రిలీజ్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి.
ట్రైలర్ రిలీజ్ ను కూడా అనౌన్స్ చేశారు. ఎప్పుడంటే ‘కాంతారా: చాప్టర్ 1’ తో పాటు.. రాజాసాబ్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. కాంతారా చాప్టర్ 1 మూవీ అక్టోబర్ 2 న రిలీజ్ చేయనున్నారు. సో ఈ సినిమాతో పాటు థియేటర్స్ లో రాజాసాబ్ ట్రైలర్ ను చూడొచ్చు. సో దీనికి సంబందించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కూడా ఆ రెండు రోజుల ముందు ఎప్పుడైనా ఉండొచ్చు. అయితే సినిమా సంక్రాంతికైతే ట్రైలర్ ఇప్పుడు వదలడం ఏంటో.. దాని వెనుక ఉన్న కారణాలేంటో వారికే తెలియాలి. అలాగే అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే ఉంది కాబట్టి ఆరోజున సినిమాకు సంబందించిన ఏదైనా సాంగ్ ను రిలీజ్ చేసే అవకాశం ఉందట.
ఈ విషయాలన్నీ నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఏ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలాగే తమ బ్యానర్ లో రూపొందుతున్న మిగిలిన సినిమాల గురించి కూడా చెప్పారు. ప్రస్తుతం ఆ బ్యానర్ లో 12 సినిమాలు రెడీ అవుతున్నాయి అంట. సిద్ధూ జొన్నలగడ్డ రాశి ఖన్నా కాంబినేషన్ లో వస్తున్న తెలుసు కదా మూవీ అక్టోబర్ లో రిలీజ్ కానుంది. ఆ తర్వాత రోషన్ మోగ్లీ మూవీ రానుంది. ఇవి కాకుండా అడవి శేష్ ‘జీ2’ , ఆనంది ‘గరివిడి లక్ష్మి’ , లావణ్య త్రిపాఠి, సునీల్ సినిమాలు కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయట. ఇలా మొత్తంగా 2026,2027 వరకు మొత్తంగా ఈ బ్యానర్ నుంచి 12 సినిమాలు రానున్నాయి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.