iDreamPost
android-app
ios-app

ఖుషి.. కలెక్షన్స్ కి ఆ ఒక్కటీ కలిసి రావడం లేదా..?

  • Author ajaykrishna Updated - 03:41 PM, Tue - 5 September 23
  • Author ajaykrishna Updated - 03:41 PM, Tue - 5 September 23
ఖుషి.. కలెక్షన్స్ కి ఆ ఒక్కటీ కలిసి రావడం లేదా..?

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఖుషి’. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమాని మైత్రి మూవీస్ వారు నిర్మించారు. రిలీజ్ కి ముందే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఖుషి.. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. మొదటి రోజు నుండి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ సినిమాకు.. కలెక్షన్స్ పరంగా మొదటి మూడు రోజులు తిరుగులేదు అనిపించుకుంది. విజయ్, సమంతల కెమిస్ట్రీకి తోడు మంచి మ్యూజిక్ కుదిరేసరికి అన్ని భాషలలో ఖుషికి మంచి రెస్పాన్స్ లభించింది. కానీ.. నాలుగో రోజుకు వచ్చేసరికి ఒకే ఒక్క ఎఫెక్ట్ తో కలెక్షన్స్ అన్ని తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా డ్రాప్ అయిపోవడం గమనార్హం.

మొదటి మూడు రోజులు మంచి కలెక్షన్స్ రాబట్టిన ఖుషి.. సోమవారం బిగ్ డ్రాప్ చూసింది. దీంతో ఇప్పుడు ఖుషి వసూళ్ల పరంగా ఆందోళన మొదలైందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి అసలు ఏమైంది అనే వివరాల్లోకి వెళ్తే.. తెలుగు రాష్ట్రాలలో సోమవారం కోటి షేర్ అందుకోవడమే కష్టంగా మారిందని వినికిడి. పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాకు నాలుగో రోజు పెద్ద మొత్తంలో కలెక్షన్స్ డ్రాప్ కనిపించడం ఏంటని అనిపించవచ్చు. అందుకు ప్రధాన కారణం.. రాష్ట్రాలలో చాలా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనాలు కనీసం ఇంటి నుండి అడుగు బయట పెట్టే పరిస్థితి కూడా లేకుండా పోయింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంట్లో నుండి బయటికి రావొద్దని హెచ్చరిస్తున్నాయి.

ఓవైపు వర్షం నుండి బయటపడే ఆలోచన ఉండగా.. జనాలకు థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూసే మూడ్ ఎక్కడ ఉంటుంది? అనేది ప్రధాన కారణంగా వినిపిస్తుంది. ఇక ఖుషిని నైజాం ఏరియాలో ఓన్ చేసుకున్నంతగా వేరే ఎక్కడకూడా అంతగా జనాలు పట్టించుకోవట్లేదు అని టాక్ నడుస్తోంది. అయితే.. ఓవర్సీస్ లో మాత్రం ఖుషి పరుగులు పెడుతోందట. ఇప్పటికి రూ. 65 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ వసూల్ చేసిన ఖుషి.. రూ. 34 కోట్ల వరకు షేర్ రాబట్టిందట. ఈ లెక్కన ఇంకా సుమారు రూ. 19 కోట్ల వరకు షేర్ రాబట్టాల్సి ఉందని సమాచారం. అదిగాక ఒకవైపు షారుఖ్ ఖాన్ జవాన్ ఊపు కనిపిస్తుంది. జవాన్ తో పాటు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా కూడా వస్తోంది. ఇన్ని టాస్క్ ల మధ్య ఖుషి బ్రేక్ ఈవెన్ అయి.. లాభాలు తేవడం అనేది కత్తిమీద సాము లాంటిదే. చూడాలి మరి ఏం జరగుతుందో. ఖుషి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet