Supritha: గ్లామర్ లో స్టార్ హీరోయిన్స్ ని మరిపిస్తున్న సురేఖవాణి కూతురు!

గ్లామర్ లో స్టార్ హీరోయిన్స్ ని మరిపిస్తున్న సురేఖవాణి కూతురు!

  • Author ajaykrishna Updated - 02:25 PM, Tue - 5 September 23
  • Author ajaykrishna Updated - 02:25 PM, Tue - 5 September 23
గ్లామర్ లో స్టార్ హీరోయిన్స్ ని మరిపిస్తున్న సురేఖవాణి కూతురు!

ఇండస్ట్రీలో అందంగా ఉన్న ముద్దుగుమ్మలు చాలా మంది వస్తుంటారు పోతుంటారు. కొంతమంది మాత్రమే ప్రేక్షకులలో ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారు. కానీ.. ఈ మధ్యకాలంలో సినిమాలతో సంబంధం లేకపోయినా.. ఒక్క సినిమాలో కూడా కనిపించకుండానే సోషల్ మీడియా ద్వారా సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అలా ఒక్క సినిమా కూడా చేయకుండా.. హీరోయిన్స్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సుప్రిత. ఈ బ్యూటీ గురించి యూత్ కి, సోషల్ మీడియా యూజర్లకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. పాపులర్ సినీ నటి సురేఖవాణి కూతురే సుప్రిత అని అందరికి తెలుసు.

అదేంటి.. సురేఖవాణి కూతురికి సినిమాల్లోకి వెళ్లేందుకు ఈజీగానే లైన్ దొరుకుతుంది కదా! ఎలాగో అందం, గ్లామర్ అన్ని మెయింటైన్ చేస్తోంది. హీరోయిన్ అవ్వడానికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ సుప్రితలో పుష్కలంగా ఉన్నాయి. ఎందుకని సినిమాల్లోకి రావడానికి ఆలస్యం చేస్తోంది? అని అనిపించవచ్చు. అయితే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖవాణికి ఇండస్ట్రీలో ఎంత మంచి పేరుందో తెలిసిందే. ఆమె తలచుకుంటే కూతురిని ఇంట్రడ్యూస్ చేయడం పెద్ద ప్రాసెస్ కాదు. కానీ.. అన్నిటికంటే ముందు ఆమె ఓ మోడరన్ మదర్. సింగిల్ పేరెంట్ గా తన కూతురిని ఈ సొసైటీని ఎలా ఫేస్ చేయాలో చెబుతూ పెంచి పెద్ద చేసింది.

ఏ విషయంలోనైనా ఇదివరకటికి.. ఇప్పటికి రోజుల్లో మార్పులు వచ్చేశాయి. ఇప్పుడు పేరెంట్స్ ఎవరైనా తమ పిల్లలకు ఇదే మార్గంలో వెళ్లు అని సజెస్ట్ చేయగలరేమో గానీ బలవంతంగా తోసేయలేరు. బట్.. మేం ఆల్రెడీ ఓ మార్గం వేశాము.. కాబట్టి రిస్క్ వద్దనుకుంటే అదే మార్గంలో వెళ్లొచ్చు అని చెప్తుంటారు. ప్రస్తుతం సురేఖవాణి కూడా తన కూతురికి.. ఇండస్ట్రీ వైపు అలాంటి మార్గమే వేసింది. రావడం రాకపోవడం అనేది సుప్రిత చేతిలో ఉంది. కానీ.. సుప్రిత డెబ్యూకి ఆల్రెడీ ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సుప్రిత తన తల్లితో కలిసి సోషల్ మీడియాలో ఎలాంటి రచ్చ చేస్తుందో విదితమే. ఎప్పటికప్పుడు గ్లామరస్ పిక్స్ తో పాటు రీల్స్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కి కనువిందు చేస్తుంటుంది. తాజాగా ఇదివరకు ఎన్నడూ చూడని రేంజ్ లో గ్లామరస్ పిక్ పెట్టింది. ప్రస్తుతం ఆ ఫోటోని నెటిజన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. మరి సుప్రిత గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments