iDreamPost
android-app
ios-app

బాయ్​ ఫ్రెండ్ గురించి ఓపెన్ అయిన రాశీఖన్నా.. దానికి అతడే కారణమంటూ..!

  • Author singhj Published - 09:53 PM, Tue - 1 August 23
  • Author singhj Published - 09:53 PM, Tue - 1 August 23
బాయ్​ ఫ్రెండ్ గురించి ఓపెన్ అయిన రాశీఖన్నా.. దానికి అతడే కారణమంటూ..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో రాశిఖన్నా ఒకరు. అందం, అభినయమే కాదు.. మంచి మనసుతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను ఆమె గెల్చుకున్నారు. ‘మద్రాస్ కేఫ్’ అనే హిందీ చిత్రంతో తెరంగేట్రం చేసినప్పటికీ ఆమెకు సరైన బ్రేక్​ను ఇచ్చింది మాత్రం టాలీవుడే. యంగ్ హీరో నాగశౌర్య సరసన నటించిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో యూత్ ఆడియెన్స్​కు ఆమె బాగా దగ్గరయ్యారామె. ఈ ఫిల్మ్​లో హీరో నాగశౌర్యతో ఆమె కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఈ మూవీ తర్వాత ‘సుప్రీం’, ‘జై లవ కుశ’, ‘తొలిప్రేమ’ రూపంలో వరుస విజయాలను అందుకోడంతో.. రాశి కెరీర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది.

వరుస సక్సెస్​ల తర్వాత పరాజయాలు కూడా రాశీఖన్నాను వరుసగా పలకరించాయి. అదే టైమ్​లో ఆమె కాస్త బరువు కూడా పెరిగారు. దీంతో ఈ బబ్లీ బ్యూటీ ఫేడవుట్ అవుతారని అందరూ భావించారు. కానీ గోడకు కొట్టిన బంతిలా స్ట్రాంగ్​గా బౌన్స్ బ్యాక్ అయ్యారు రాశి. ‘ప్రతి రోజు పండుగే’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టారామె. గతేడాది ‘తిరుచిత్రాంబలం’, ‘సర్దార్’ రూపంలో మరో రెండు హిట్స్​ను తన ఖాతాలో వేసుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సరసన చేసిన ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ కూడా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో రాశి నటనకు మంచి అప్లాజ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలు, వెబ్ సిరీస్​లు చేస్తూ బిజీగా గడుపుతున్నారు.

కెరీర్​లో ఫుల్ బిజీగా ఉన్న రాశీఖన్నా లవ్​లో పడిందా? అంటే అవును అనే చెప్పాలి. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే చెప్పారు. తనకో బాయ్​ఫ్రెండ్ ఉన్నాడని ఒక ఇంటర్వ్యూలో రాశి రివీల్ చేశారు. అప్పట్లో ఒక వ్యక్తితో బ్రేకప్ అయ్యాక తాను బరువు పెరిగానన్నారు. వర్కౌట్స్ చేసినా వెయిట్ తగ్గలేదన్నారు. ఆ టైమ్​లో తనను అర్థం చేసుకునే ఓ వ్యక్తి దొరికాడన్నారు. ఆ వ్యక్తితో డేటింగ్ మొదలుపెట్టిన తర్వాత బాగా బరువు తగ్గానని.. స్లిమ్​గా అయ్యానని రాశీఖన్నా చెప్పుకొచ్చారు. తాను ఎలా మారాలని అనుకున్నానో ఇప్పుడు అలా మారానని పేర్కొన్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం రాశి బయటపెట్టలేదు. తన బాయ్ ​ఫ్రెండ్ ఎవరో ఆమె త్వరలో చెబుతారేమో చూడాలి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap