iDreamPost
android-app
ios-app

Pushpa 2: కేశవ బెయిల్ కోసం పుష్ప నిర్మాతల కష్టాలు! ఏకంగా 15 లక్షలు ఖర్చు?

  • Published Dec 15, 2023 | 5:41 PM Updated Updated Dec 15, 2023 | 5:41 PM

బ్లాక్​ బస్టర్ మూవీ ‘పుష్ప’లో కేశవ క్యారెక్టర్​లో నటించి మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు జగదీష్ బండారీ. అయితే ఓ కేసులో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

బ్లాక్​ బస్టర్ మూవీ ‘పుష్ప’లో కేశవ క్యారెక్టర్​లో నటించి మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు జగదీష్ బండారీ. అయితే ఓ కేసులో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

  • Published Dec 15, 2023 | 5:41 PMUpdated Dec 15, 2023 | 5:41 PM
Pushpa 2: కేశవ బెయిల్ కోసం పుష్ప నిర్మాతల కష్టాలు! ఏకంగా 15 లక్షలు ఖర్చు?

ఇండియన్ ఫిల్మ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి ‘పుష్ప 2’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ఫిల్మ్ ఎంత పెద్ద హిట్టయిందో స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. అందులో హీరో క్యారెక్టరైజేషన్, బన్నీ యాక్టింగ్, చిత్తూరు యాస, దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ హైలైట్​గా నిలిచాయి. ఫారెస్ట్ బ్యాక్​డ్రాప్​లో నడిచే కథను తన స్టైల్ ఆఫ్ స్క్రీన్​ప్లే, మేకింగ్​తో అందర్నీ ఆకట్టుకునేలా తీశారు సుకుమార్. ఈ సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్టయిందో హిందీలో అంతకంటే బిగ్ హిట్టవడం స్పెషల్ అనే చెప్పాలి. ఇంత భారీ విజయం సాధించిన ‘పుష్ప’కు కొత్త కష్టం వచ్చి పడింది. ఆ మూవీలో కేశవ పాత్రలో నటించి మంచి పాపులారిటీ తెచ్చుకున్న జగదీష్ బండారీ ప్రతాప్​ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒక మహిళా నటి సూసైడ్ కేసులో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

బాధితురాలి ఫొటోలు తీసుకొని ఆమెను బెదిరించాడని జగదీష్​ ప్రతాప్ మీద ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడ్ని పట్టుకున్న పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్​కు తరలించారు. జగదీష్ అరెస్ట్ అయ్యాడనే న్యూస్ ‘పుష్ప 2’ టీమ్ మనోస్థైర్యాన్ని దెబ్బతీసిందని సమాచారం. అతడు లేకున్నా షూటింగ్ ఆగొద్దనే ఉద్దేశంతో డూప్​ను పెట్టి మిగతా సీన్లను తీసే ప్రయత్నం చేశారట. కానీ వర్కౌట్ కాకపోవడంతో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావొద్దని డైరెక్టర్ సుకుమార్, ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ అనుకుంటున్నారట. అందుకే జగదీష్​ను బెయిల్ మీద బయటకు తీసుకురావాలని డిసైట్ అయ్యారని టాలీవుడ్ టాక్. అందుకోసం ఏకంగా రూ.15 లక్షలు ఖర్చు పెట్టి బెయిల్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఒక ఆర్టిస్ట్ బెయిల్ కోసం మూవీ మేకర్స్ ఇలా డబ్బులు ఖర్చు పెట్టి రిస్క్ తీసుకోవడం టాలీవుడ్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్ అని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

ఇక, ‘పుష్ప’కు సీక్వెల్ ఉంటుందని ముందే ప్రకటించారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ బ్లాక్​బస్టర్ కావడంతో రెండో పార్ట్ రిలీజ్ కోసం బన్నీ ఫ్యాన్స్​తో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు, మూవీ గోయర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఫిల్మ్ నుంచి కొన్ని అప్​డేట్స్ కూడా వచ్చాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘పుష్ప 2’ నెక్స్ట్ ఇయర్ సెకండాఫ్​లో రిలీజ్ కానుంది. 2024, ఆగస్టు 15న ‘పుష్ప 2’ ది రూల్​ను రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదల కానున్న ఈ మూవీ మీద పాన్ ఇండియా రేంజ్​లో భారీ బజ్ నెలకొంది. ముఖ్యంగా హిందీ బెల్ట్​లో ఒక రేంజ్​లో ఎక్స్​పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఏరియాలో బిజినెస్ కూడా బాలీవుడ్ స్టార్స్ ఫిల్మ్స్​కు ఉండే స్థాయిలో జరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. కాగా, సినిమాలో జగదీష్ పాత్ర కీలకం కాబట్టి ఎలాగైనా అతడ్ని బెయిల్ మీద బయటకు తీసుకురావాలని మేకర్స్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. కనీసం అతడి క్యారెక్టర్​కు సంబంధించిన షూట్ పూర్తయ్యే వరకైనా అనుమతి తెచ్చుకోవాలని చూస్తున్నారని టాక్. మరి.. జగదీష్ బెయిల్ కోసం ‘పుష్ప 2’ టీమ్ ప్రయత్నిస్తోందటూ వస్తున్న వార్తలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Mirapakay Movie Sequel: సీక్వెల్‌ గా ‘మిరపకాయ్‌’ మరింత ఘాటుగా రానుందా?

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom