iDreamPost
android-app
ios-app

రిలీజ్ విషయంలో తగ్గేదేలే .. పుష్ప 2 రూమర్స్ కు చెక్

  • Published Oct 18, 2024 | 12:51 PM Updated Updated Oct 18, 2024 | 12:51 PM

పుష్ప 2 తగ్గేదేలే రిలీజ్ డేట్ మారేదేలే అంటూ.. ఈ డేట్ ను మరోసారి కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ ను రివీల్ చేశారు టీం. అటు ప్రీ రిలీజ్ బిజినెస్ లు కూడా బాగానే జరుగుతున్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పుష్ప 2 తగ్గేదేలే రిలీజ్ డేట్ మారేదేలే అంటూ.. ఈ డేట్ ను మరోసారి కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ ను రివీల్ చేశారు టీం. అటు ప్రీ రిలీజ్ బిజినెస్ లు కూడా బాగానే జరుగుతున్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Oct 18, 2024 | 12:51 PMUpdated Oct 18, 2024 | 12:51 PM
రిలీజ్ విషయంలో తగ్గేదేలే .. పుష్ప 2 రూమర్స్ కు చెక్

పుష్ప రాజ్ బాక్స్ ఆఫీస్ ను ఏలడానికి రెడీ అవుతున్నాడు. నిజానికి అనుకున్న టైమ్ కు ఈ సినిమా రిలీజ్ అయితే మాత్రం.. ఈపాటికే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ మోత మోగిపోయేది. కానీ కొన్ని కారణాల వలన మూవీ రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేశారు. డిసెంబర్ 6 న మూవీ రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఆల్రెడీ ఓసారి మూవీ పోస్ట్ పోన్ అవ్వడంతో.. ఈసారైనా చెప్పిన టైమ్ కు వస్తుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. అలాగే మూవీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అంటూ కొన్ని రూమర్స్ కూడా వినిపించాయి. దీనితో వీటి అన్నిటికి చెక్ పెట్టేలా.. తగ్గేదేలే.. రిలీజ్ డేట్ మారేదే లే అంటూ అదే డేట్ ను కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ ను రివీల్ చేసింది. ఈసారి రూలింగ్ నాది అనే రేంజ్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు అల్లు అర్జున్. ప్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా అదే రేంజ్ లో రూల్ చేస్తున్నారు.

ఇంకా 50 రోజుల్లో థియేటర్స్ లోకి రానున్న ఈ సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. అటు ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా తగ్గేదేలే అంటూ దూసుకుపోతుంది. మొత్తానికి 900 కోట్లకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తుంది. దాదాపు 1000 కోట్ల దగ్గరలో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి  ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ప్రూవ్ చేస్తుంది. 500 కోట్ల బడ్జెట్ తో భారీగా తెరకెక్కనున్న ఈ సినిమా.. డిజిటల్ , శాటిలైట్ రైట్స్ 900 కోట్లకు , థియేట్రికల్ రైట్స్ 650 కోట్లకు జరిగినట్లుగా సమాచారం. ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే ఈ మూవీ రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుంది. పైగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా .. క్వాలిటీ కంటెంట్ తో సినిమాను రూపొందిస్తున్నారు. సో పాన్ ఇండియా లెవెల్లో భారీ ఓపెనింగ్స్ కు ప్లాన్ చేస్తున్నారు. అటు క్యాస్టింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

దాదాపు షూటింగ్ పనులు కంప్లీట్ అయినట్లే. దీపావళి నుంచి వరుస అప్డేట్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద చాలా అంచనాలు నెలకొన్నాయి. మరి రాబోయే అప్డేట్స్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెంచుతాయో చూడాలి. అంతే కాకుండా ఈ ఏడాది రిలీజ్ కాబోయే ఆఖరి భారీ బడ్జెట్ సినిమా. దీనితో సినిమాపై మరింత ఫోకస్ పెరిగింది. భారమంతా బన్నీ పైనే పడింది. మూవీ ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందా.. ముందున్న టార్గెట్ ను అందుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ మధ్య కమర్షియల్ సినిమాలకు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి కాబట్టి ఈ సినిమా.. వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక సినిమా రిలీజ్ అయితే కానీ అసలు లెక్కలు తేలవు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetist