iDreamPost
android-app
ios-app

Pushpa 2: టార్గెట్ 2000 కోట్లు! నిజంగా పెద్ద ప్లానే!

  • Published Nov 27, 2024 | 3:20 PM Updated Updated Nov 27, 2024 | 3:20 PM

Pushpa 2: పుష్ప 2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ కాస్త ఎర్లీ గానే స్టార్ట్ అయ్యాయి.

Pushpa 2: పుష్ప 2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ కాస్త ఎర్లీ గానే స్టార్ట్ అయ్యాయి.

Pushpa 2: టార్గెట్ 2000 కోట్లు! నిజంగా పెద్ద ప్లానే!

దేశవ్యాప్తంగా కూడా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘పుష్ప 2’ సినిమా డిసెంబర్‌ 5న విడుదల కాబోతుంది. ఈ సినిమాకి మేకర్స్‌ దేశవ్యాప్తంగా ఓ రేంజిలో ప్రమోషన్స్‌ చేస్తున్నారు. రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్‌ బిజినెస్ చేసిన పుష్ప 2 సంచలనంగా మారింది. దాంతో ఈ సినిమాని జనాల్లోకి మరింత స్పీడ్ గా తీసుకు వెళ్లాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా రకాలుగా హైప్ పెంచుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి యూఎస్‌తో పాటు పలు దేశాల్లో కూడా ప్రీ సేల్ మొదలు అయింది. యూఎస్‌లో ఇప్పటికే 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడు పోయాయని, ఇప్పటికే 3 మిలియన్‌ల డాలర్ల వసూళ్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్‌ కోసం దేశవ్యాప్తంగా ఉన్న పుష్ప ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్‌స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ కాస్త ముందుగానే వచ్చేసింది. డిసెంబర్‌ 1 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కాబోతున్నట్లు మేకర్స్ నుంచి సమాచారం తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల పెంపు విషయం, అదనపు షోల విషయమై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా టికెట్ల పెంపు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటన్నిటికి నవంబర్‌ చివరి లోపు క్లారిటీ వస్తుందని, దాంతో డిసెంబర్‌ 1 నుంచి అడ్వాన్స్‌ బుకింగ్‌ను స్టార్ట్ చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే డిసెంబర్ 5 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ త్వరగా స్టార్ట్ అవ్వడానికి ఒక ప్లాన్ ఉందని తెలుస్తుంది.

పుష్ప 2 సినిమాని అల్లు అర్జున్, సుకుమార్ తో సహా టీం అంతా కూడా చాలా ప్రెస్టేజీయస్ గా తీసుకున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి సాధారణ వసూళ్లు వస్తే సరిపోదు. ఈ సినిమాకి టీం అంతా పడిన కష్టానికి తగిన ప్రతి ఫలం రావాలంటే ఈ సినిమాకి 2000 కోట్ల దాకా వసూళ్లు రావాలి. ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి మూవీ టీం ఈ విధంగా ప్రమోషన్స్ చేస్తున్నట్లు అర్ధం అవుతుంది. కాబట్టి ఆ రేంజిలో వసూళ్లు రావాలంటే ముందు ఆ రేంజిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగాలి. అందుకే కాస్త ముందుగానే మూవీ టీం బుకింగ్స్ స్టార్ట్ చేసింది. మరి చూడాలి .. పుష్ప 2 విడుదల అయ్యాక 2000 కోట్ల భారీ వసూళ్లని నమోదు చేస్తుందో లేదో.. ఇక ఈ విషయం గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.