iDreamPost
android-app
ios-app

Puri Jagannadh: విజయేంద్రప్రసాద్ ఫోన్ కాల్ తో ఎమోషనల్ అయ్యాను.. పూరీ జగన్నాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Aug 12, 2024 | 9:43 AM Updated Updated Aug 12, 2024 | 9:43 AM

టాలీవుడ్ దిగ్గజ రైటర్ విజయేంద్రప్రసాద్ ఫోన్ కాల్ తో ఎమోషనల్ అయ్యాను అంటూ డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.

టాలీవుడ్ దిగ్గజ రైటర్ విజయేంద్రప్రసాద్ ఫోన్ కాల్ తో ఎమోషనల్ అయ్యాను అంటూ డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.

  • Published Aug 12, 2024 | 9:43 AMUpdated Aug 12, 2024 | 9:43 AM
Puri Jagannadh: విజయేంద్రప్రసాద్ ఫోన్ కాల్ తో ఎమోషనల్ అయ్యాను.. పూరీ జగన్నాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించగా.. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. ఆగస్ట్ 15న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో హన్మకొండలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకలో డైరెక్టర్ పూరీ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. రాజమౌళి తండ్రి స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ ఫోన్ కాల్ తో ఎమోషనల్ అయ్యానని తెలిపాడు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

“నా మూవీ ఒకటి ఫ్లాప్ అయినప్పుడు నాకో ఫోన్ కాల్ వచ్చింది. అది చేసింది ఎవరో కాదు.. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్. సర్ నాకు చిన్న హెల్ప్ చేస్తారా? అని నన్ను అడిగారు. అయన కొడుకే స్టార్ డైరెక్టర్, ఆయనకు నేను చేసే హెల్ప్ ఏంటి అనుకున్నా. ఆ తర్వాత మీరు నెక్ట్స్ చేసే సినిమా కథ నాకు చెబుతారా? ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటే సూచిస్తాను. ఎందుకంటే? మీలాంటి డైరెక్టర్స్ ఫెయిల్యూర్ అయితే నేను చూడలేను అన్నారు. ఆ క్షణం నేను ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. అయితే డబుల్ ఇస్మార్ట్ కథ ఆయనకు చెప్పలేదు. కానీ ఈ మూవీని ఒళ్లు దగ్గరపెట్టుకుని తీశాను. మా టీమ్ కు ప్రస్తుతం ఓ బ్లాక్ బస్టర్ కావాలి. ఈ చిత్రం ద్వారా అది నెరవేరుతుందని అనుకుంటున్నాను” అని ఈ వేడుకలో పూరీ జగన్నాథ్ మాట్లాడాడు.

puri jaganadh emotional speech

కాగా.. డబుల్ ఇస్మార్ట్ నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో భారీ హైప్ ను తెచ్చిపెట్టాయి. మరీ ముఖ్యంగా మణిశర్మ అందించిన సాంగ్స్ మాస్ ఆడియెన్స్ అటెన్షన్ ను డ్రా చేశాయి. ట్రైలర్ కూడా అంచనాలకు మించి ఉంది. ఇక ఈ మూవీలో రామ్ డబుల్ ఎనర్జీతో నటించాడని పూరీ జగన్నాథ్ తెలిపాడు. మరి భారీ హైప్ మధ్య ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో వేచి చూడాలి. ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ కావడంతో.. సినిమాకు మరింత బజ్ వచ్చింది. మరి విజయేంద్రప్రసాద్ ఫోన్ కాల్ తో ఎమోషనల్ అయ్యాను అన్న పూరీ జగన్నాథ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş