iDreamPost
android-app
ios-app

విజయ్ దేవరకొండ మూవీ #VD12..నాగవంశీ క్లారిటీ!

  • Published Jan 29, 2024 | 4:11 PM Updated Updated Jan 29, 2024 | 4:11 PM

Vijay Devarakonda: ఇటీవల ఖుషీ సినిమాతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రేక్షకులను పలకరించాడు. ఇక తన 12వ చిత్రం సితారా ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ రాకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.

Vijay Devarakonda: ఇటీవల ఖుషీ సినిమాతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రేక్షకులను పలకరించాడు. ఇక తన 12వ చిత్రం సితారా ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ రాకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.

  • Published Jan 29, 2024 | 4:11 PMUpdated Jan 29, 2024 | 4:11 PM
విజయ్ దేవరకొండ మూవీ #VD12..నాగవంశీ క్లారిటీ!

ప్రపంచంలోని వార్తలను తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన విషయాల కోసం మాత్రం ఆ ఆసక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అభిమానులు..తమ హీరో సినిమాలకు సంబంధించిన అప్ డేట్  కోసం ఎంతగానే ఎదురు చూస్తుంటారు. ఇక తమ హీరో మూవీ అప్ డేట్స్ రాకుంటే.. వాటి కోసం సోషల్ మీడియాలో ఫుల్ రచ్చ చేసిన ఘటనలు ఉన్నాయి. మరోవైపు కొన్ని సినిమాలు గురించి అప్ డేట్ ఉండదు. దీంతో చాలా మందిలో అనుమానలు వ్యక్తమవుతుంటే.. మేకర్స్ క్లారిటీ ఇస్తుంటారు. అలానే తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న #VD12 సినిమాపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ డమ్ సంపాదించి..టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఆ తరువాత వచ్చిన గీతాగోవిందం సినిమాతో మరో ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేశాడు. ఆ తరువాత కూడా పలు సినిమాతో విజయ్ దూసుకెళ్లాడు. అయితే ఇటీవలే ఈ రౌడీ హీరో హడావుడి ఈ మధ్య కాస్త తగ్గింది. అందుకు కారణం లైగర్ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడమే అనే టాక్ ఉంది. అయితే, ‘లైగర్’ పరాజయాన్ని మరిచిపోయి ప్రస్తుతం ఆయన సమంతతో కలిసి ‘ఖుషి’ అనే సినిమ చేశారు.

ఖుషి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాకే సొంతం చేసుకుంది. తాజాగా సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో విజయ్ దేవరకొండ చేస్తున్న కొత్త సినిమా చేస్తున్నారు. ఇది విజయ్ దేవరకొండ నటించనున్న 12వ చిత్రం. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించనుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. ఇప్పటి వరకు VD12కి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో

అయితే… ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాపై అప్ డేట్ లేదు. దాంతో ఈ సినిమా ఉంటుందా, ఉండ‌దా? అనే విష‌యంపై చాలా అనుమానాలు మొద‌లైపోయాయి.  ఈక్రమంలోనే చివ‌రికి నిర్మాత నాగ‌వంశీ ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చారు. ఫ్యామిలీ స్టార్ షూటింగ్ పూర్త‌వ‌గానే విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈలోగా ఇదే బ్యాన‌ర్‌లో గౌత‌మ్ తిన్ననూరి..మ్యాజిక్ అనే ఓ చిన్న చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ సినిమా గురించి కూడా నాగవంశీ వివరించారు. ఇక మ్యాజిక్ సినిమా విషయానికి వస్తే.. ఇది న‌లుగురు టీనేజ‌ర్ల చుట్టూ తిరిగే క‌థ. ఈ సినిమా మొత్తం కాలేజీ నేప‌థ్యంలో సాగుతుంది. కాలేజీ ఫెస్ట్ కోసం ఓ ఆల్బ‌మ్ ని త‌యారు చేయ‌డానికి న‌లుగురు ఫ్రెండ్స్ ఏం చేశార‌న్న‌దే ఈ సినిమా. ఇక ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. ఈ ఏడాది వేస‌విలో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఇక విజయ్ దేవర కొండ 12వ చిత్రంపై నిర్మాత నాగవంశీ ఇచ్చిన క్లారిటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişmeritbet girişgrandpashabet