iDreamPost
android-app
ios-app

గేమ్ ఛేంజర్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన దిల్ రాజు!

  • Published Jul 22, 2024 | 7:54 AM Updated Updated Jul 22, 2024 | 7:54 AM

Dil Raju On Game Changer Release Date: శంకర్- రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ రిలీజ్ కి సంబంధించే ఎలాంటి క్లారిటీ లేదు. అయితే తాజాగా నిర్మాత దిల్ రాజు ఆ క్లారిటీ ఇచ్చేశారు.

Dil Raju On Game Changer Release Date: శంకర్- రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ రిలీజ్ కి సంబంధించే ఎలాంటి క్లారిటీ లేదు. అయితే తాజాగా నిర్మాత దిల్ రాజు ఆ క్లారిటీ ఇచ్చేశారు.

  • Published Jul 22, 2024 | 7:54 AMUpdated Jul 22, 2024 | 7:54 AM
గేమ్ ఛేంజర్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన దిల్ రాజు!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో బాగా ఎదురుచూస్తున్న సినిమాల్లో శంకర్- రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ కూడా ఉంటుంది. భారతీయుడు 2 వల్ల గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చిన విషయం తెలిసిందే. శంకర్ రెండు సినిమాలను ఒకేసారి తీస్తూ వచ్చారి. భారతీయుడు 2 రిలీజ్ కూడా అయిపోయింది. అయితే ప్రేక్షకులను మెప్పించడంలో సేనాపతి సక్సెస్ కాలేకపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు శంకర్ తన స్టామినా నిరూపించుకోవడానికి.. గేమ్ ఛేంజర్ సరైన అవకాశం అని చెప్పాలి. అందుకే ఈ మూవీపై గట్టిగానే కాన్సన్ ట్రేట్ చేశాడు అంటున్నారు. అయితే రిలీజ్ గురించి ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. కానీ, అధికారిక ప్రకటన లేదు. కానీ, ఇప్పుడు స్వయంగా నిర్మాత దిల్ రాజు గేమ్ ఛేంజర్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చేశారు.

గేమ్ ఛేంజర్ సినిమా అప్ డేట్స్, రిలీజ్ గురించి అభిమానుల్లో మొదటి నుంచి కాస్త అసంతృప్తి ఉంది. అయితే ఇటీవల డిసెంబర్ లో గేమ్ ఛేంజర్ రాబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. పుష్ప 2 రిలీజ్ డేట్ మీద ఆధారపడి గేమ్ ఛేంజర్ ఉంటుంది అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దిల్ రాజు ఆ ఊహాగానాలకు తెర దింపారు. రాయన్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకల్లో దిల్ రాజు పాల్గొన్నారు. అయితే అక్కడ రామ్ చరణ్ అభిమానులు గేమ్ ఛేంజర్ రిలీజ్ కి సంబంధించి ప్రశ్నించగా.. ఆయన రియాక్ట్ అయ్యారు. క్రిస్మస్ కి కలుద్దాం అంటూ శుభవార్తను చెప్పేశారు.

అంటే ఈ క్రిస్మస్ కి మూవీ రిలీజ్ కాబోతోంది అని చెప్పకనే చెప్పేశారు. అయితే ఇది అధికారికమా అంటే.. దిల్ రాజు లీకుల కింద కన్సిడర్ చేసి.. అధికారికంగా భావించడమే. నిర్మాతే క్రిస్మస్ కి కలుద్దాం అంటే అందులో ఇంక తిరుగేముంది. ఇంక మూవీకి సంబంధించి రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అంటున్నారు. అంటే దాదాపుగా షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది. ఇంక తర్వాత శంకర్ ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న గేమ్ ఛేంజర్ పై అభిమానుల్లో చాలానే అంచనాలు ఉన్నాయి.

రామ్ చరణ్ బుచ్చిబాబు మూవీ కోసం రెడీ అయిపోతున్నాడు. త్వరలోనే ఆర్సీ 16 రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. గేమ్ ఛేంజర్ డిసెంబర్ లో అంటే ప్రమోషన్స్ చేయడానికి కూడా చాలా సమయం ఉంది. ఈలోపు బుచ్చిబాబు తన మూవీ సగం అయినా షూట్ కంప్లీట్ చేసుకునేందుకు సమయం దొరుకుతుంది. తాజాగా దిల్ రాజు ఇచ్చిన అప్ డేట్ తో మెగా ఫ్యాన్స్ లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే ఒకానొక సమయంలో గేమ్ ఛేంజర్ ఈ ఏడాది రాదు అనే వార్తలు కూడా వచ్చాయి. మరి.. గేమ్ ఛేంజర్ క్రిస్మస్ కి వస్తోంది అంటూ దిల్ రాజు ఇచ్చిన అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom