Tirupathi Rao
Priyamani Gift To A Temple: హీరోయిన్ ప్రియమణి తన మంచి మనసు చాటుకుంది. ఒక ఆలయానికి ఎవరూ ఊహించలేని, ఎవరు ఇవ్వని ఒక కానుకను బహూకరించింది.
Priyamani Gift To A Temple: హీరోయిన్ ప్రియమణి తన మంచి మనసు చాటుకుంది. ఒక ఆలయానికి ఎవరూ ఊహించలేని, ఎవరు ఇవ్వని ఒక కానుకను బహూకరించింది.
Tirupathi Rao
స్టార్ హీరోయిన్ ప్రియమణికి పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లో పాన్ ఇండియా రేంజ్ వెబ్ సిరీస్లతో తన సత్తా చాటుతోంది. తాజాగా భామాకలాపం 2తో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో పాన్ ఇండియా లెవల్లో ఉన్న ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అటు నటిగా మాత్రమే కాకుండా ప్రియమణి తన వ్యక్తిత్వంతో కూడా ప్రజల అభిమానం పొందుతోంది. తాజాగా ఈ స్టార్ హీరోయిన్ కేరళలోని ఓ ఆలయానికి అద్భుతమైన కానుకను బహూకరించింది. నిజంగా అలాంటి ఒక కానుక గురించి ఇప్పటివరకు ఎవరూ విని ఉండరు.
ప్రియమణి కేరళలోని త్రిసూర్ దగ్గర్లో ఉన్న కొచ్చిలోని త్రిక్కయిల్ మహాదేవ్ ఆలయానికి ఒక అపురూపమైన బహుమతిని ఇచ్చింది. ఆ బహుమతి గురించి తెలుసుకున్న తర్వాత ప్రియమణి మంచి మనసును అభిమానులు, నెటిజన్స్ పొగిడేస్తున్నారు. ఇంతకీ ప్రియమణి ఇచ్చిన కానుక ఏంటంటే.. ఒక రొబోటిక్ ఏనుగు. అవును మీరు చదివింది కరెక్టే ఒక రోబోటిక్ ఏనుగును ఈ హీరోయిన్ గుడికి బహుమతిగా ఇచ్చింది. ఇలా ఇవ్వడం వెనుక చాలా పెద్ద కారణమే ఉంది. సాధారణంగా కేరళవైపు గుళ్లలో స్వామివారి సేవల కోసం ఏనుగులను కచ్చితంగా పెంచుతూ ఉంటారు. ఏనుగు అంబారీ మీద స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారు. అలాగే వచ్చిన భక్తులకు కూడా ఏనుగులతో ఆశ్వీర్వాదం ఇప్పిస్తూ ఉంటారు.
ఇలాంటి కల్చర్ తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా ఉండచ్చు. కానీ, తమిళనాడు- కేరళలో మాత్రం అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల ముఖ్యంగా భక్తుల ప్రాణాలకు కూడా ప్రమాదం అని అందరికీ తెలిసిందే. ఎప్పుడూ బందీలుగా ఉండే ఏనుగులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు. ఒక్కోసారి శిక్షణ ఇచ్చిన మావటిని కూడా చంపేసిన ఘటనలు చూశాం. కేరళ రాష్ట్రంలో ఏనుగుల దాడిలో 15 ఏళ్లకాలంలో 526 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులే చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఆలయాల పూజారులు రోబోటిక్ ఏనుగులను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కానీ, అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని ప్రభుత్వాలు కూడా స్పందించడం లేదు. తాజాగా పేటా అనే సంస్థ ఇలాంటి పనులకు సహాయం చేస్తోంది.
ఇప్పటికే గతేడాది ఇరింజలకుడ శ్రీకృష్ణ ఆలయానికి ఓ ఏనుగు అందించారు. ఇప్పుడు ప్రియమణి కూడా ఈ సంస్థ ద్వారా ఒక రోబోటిక్ ఏనుగును అందించారు. ప్రస్తుతం ఆ ఏనుగుకు మహదేవన్ అనే పేరు పెట్టి ఆలయంలో ఏర్పాటు చేశారు. ఈ విషయంపై ప్రియమణి స్పందిస్తూ.. “రోబోటిక్ ఏనుగును బహూకరించడం చాలా సంతోషంగా ఉంది. పెళ్లిళ్లలో అలంకారం కోసం మాత్రమే ఉండే ఈ ఏనుగులను ఇలా గుళ్లలో పెట్టడం వల్ల ప్రాణాలతో ఉన్న ఏనుగలకు ఇబ్బందులు తప్పుతాయి. అలాగే ఎలాంటి ప్రాణనష్టం కూడా వాటిల్లదు” అంటూ వ్యాఖ్యానించింది. మహదేవన్ వివరాల విషయానికి వస్తే.. 10.5 అడుగుల ఎత్తు, 800 కిలోల బరువు ఉంటుంది. ఈ యాంత్రిక ఏనుగు నలుగురిని తీసుకెళ్లగలదు. ఈ ఏనుగు చూడటానికి రియలిస్టిక్ గా ఉండేలా చెవులు, తల, తొండం, తోక అన్నీ యాంత్రికంగా కదులుతూ ఉంటాయి. మరి.. ఆలయానికి ప్రియమణి ఏనుగును బహూకరించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.