iDreamPost
android-app
ios-app

మహేష్, రాజమౌళి కాంబోలో విలన్ గా ఆ స్టార్ హీరో

  • Published Jul 03, 2024 | 11:14 AM Updated Updated Jul 03, 2024 | 11:14 AM

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్ లోని SSMB29 చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ప్రస్తుతం నటీ నటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు రాజమౌళి. ఈ క్రమంలోనే ఈ మూవీలో తాజాగా ఆ పాన్ ఇండియా హీరో విలన్ గా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇంతకి ఎవరంటే..

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్ లోని SSMB29 చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ప్రస్తుతం నటీ నటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు రాజమౌళి. ఈ క్రమంలోనే ఈ మూవీలో తాజాగా ఆ పాన్ ఇండియా హీరో విలన్ గా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇంతకి ఎవరంటే..

  • Published Jul 03, 2024 | 11:14 AMUpdated Jul 03, 2024 | 11:14 AM
మహేష్, రాజమౌళి కాంబోలో విలన్ గా ఆ స్టార్ హీరో

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి,మహేష్ బాబు కాంబినేషన్ లోని పాన్ ఇండియా రేంజ్ లో ‘SSMB29’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ మూవీ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి.అలాగే త్వరలోనే ఈ సినిమా సెట్స్ పై కి వెళ్లనుంది. ఇక భారీ బడ్జెట్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ గా జక్కన తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు కూడా చాలా కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే మహేశ్ తన లుక్ ను కూడా మార్చుకున్నారు.అంతేకాకుండా పాత్రకు తగ్గట్టుగా బాడీని బిల్డ్ చేసుకుంటున్నాడు. కాగా, ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయ్యింది. అయితే ప్రస్తుతం ఈ చిత్రంకు సంబంధించి రాజమౌళి నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే మహేష్ సినిమా గురించి రోజుకోక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మహేష్, రాజమౌళి సినిమాలో ఓ పాన్ ఇండియా హీరో విలన్ గా చేయనున్నారని టాక్ వినిపిస్తుంది.ఆ వివరాళ్లోకి వెళ్తే..

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు SSMB29 చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ప్రస్తుతం నటీ నటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు రాజమౌళి. ఇకపోతే ఈ చిత్రం కోసం రాజమౌళి ఏకంగా.. అంతర్జాతీయ నటీనటులను, టెక్నీషియన్లను తీసుకుంటున్నట్లు సమాచారం తెలుస్తోంది. అలాగే మహేశ్‌కు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్‌ నటిస్తున్నట్లు ఆ మధ్య ఓ రూమర్స్ వినిపించాయి. కానీ, దీనిపై ఇంక చిత్ర బృందం మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలోనే ఈ మూవీలో మరో పాన్ ఇండియ్ హీరో విలన్ గా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ముఖ్యంగా మహేశ్ ను ఢీ కొట్టే విలన్ పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని రాజమౌళి సీక్రెట్ గా ఉంచినప్పటికీ.. లీకుల వీరులు  ద్వారా బయటకు వచ్చేసిందనే టాక్ వినిపిస్తుంది. మరి, ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, పృథ్వీరాజ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి ఉండాలి. ఇదిలా ఉంటే..  డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పృథ్విరాజ్‌.. ‘సలార్‌’తో పాన్‌ ఇండియా నటుడయ్యాడు. ఆ చిత్రంలో పృథ్విరాజ్‌ ప్రభాస్‌తో పోటీ పడి నటించాడు. తన సినిమాలోని విలన్‌ పాత్రకు పృథ్వీరాజ్‌ బాగా సెట్‌ అవుతాడని జక్కన్న అతనిని ఎంపిక చేసినట్లు సమాచారం.  ఇక రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవరు వదులుకోరు కాబట్టి, పృథ్విరాజ్‌ వెంటనే ఓకే చెప్పేశారనే టాక్ వినిపిస్తుంది. మరి, మహేష్ రాజమౌళి కాంబోలో పృథ్విరాజ్ నటిస్తున్నరనే టాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetcell girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel