iDreamPost
android-app
ios-app

ప్రేమిస్తే, 10th క్లాస్ మూవీ హీరోయిన్.. ఆమెలో అంత ఛేంజ్ ఆ…

  • Published Jun 05, 2024 | 4:35 PM Updated Updated Jun 05, 2024 | 4:35 PM

కొంత మంది హీరోయిన్లు.. ఐదేళ్లు, పదేళ్లు ఇండస్ట్రీలో సత్తా చాటి. .ఒక్కసారే కనుమరుగు అవుతూ ఉంటారు. వారిలో ఒకరు టెన్త్ క్లాస్ మూవీ హీరోయిన్. ఆమె ప్రేమిస్తే సినిమాలో కూడా సంధ్య ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపిస్తుంది. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే.??

కొంత మంది హీరోయిన్లు.. ఐదేళ్లు, పదేళ్లు ఇండస్ట్రీలో సత్తా చాటి. .ఒక్కసారే కనుమరుగు అవుతూ ఉంటారు. వారిలో ఒకరు టెన్త్ క్లాస్ మూవీ హీరోయిన్. ఆమె ప్రేమిస్తే సినిమాలో కూడా సంధ్య ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపిస్తుంది. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే.??

  • Published Jun 05, 2024 | 4:35 PMUpdated Jun 05, 2024 | 4:35 PM
ప్రేమిస్తే, 10th క్లాస్ మూవీ హీరోయిన్.. ఆమెలో అంత ఛేంజ్ ఆ…

ఒకప్పుడు నిబ్బా.. నిబ్బా ప్రేమ కథల్ని బాగా ఆదరించారు సినీ ప్రేక్షకులు. స్కూల్ అండ్ ఇంటర్, డిగ్రీలో అప్పుడే అడుగుపెట్టిన స్టూడెంట్స్ ప్రేమలో పడే కథలతో లవ్ స్టోరీస్‌ సినిమాలు తెరకెక్కేవి. టీనేజ్ అమ్మాయి, అమ్మాయి ప్రేమలో పడి.. తమ లవ్ సక్సెస్ అయ్యేందుకు తల్లిదండ్రులతో పోరాటమే చేస్తుంటారు. కాదంటే ఇంట్లో నుండి వెళ్లిపోవడం.. చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకోవడం, రౌడీలతో ఛేజింగ్.. అబ్బో ఎన్నో మలుపులు ఉంటాయి. చిత్రం, నువ్వు నేను, జయం, గంగోత్రి, జూనియర్స్, నోట్ బుక్, ప్రేమిస్తే.. ఇటీవల బేబి మూవీ వరకు ఇలాంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ ఆకట్టుకున్నాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి 10th క్లాస్.

ఇప్పటి తరానికి ఈ సినిమా గురించి పెద్దగా తెలియదు కానీ.. 2006లో మంచి హిట్ అందుకుంది ఈ మూవీ. ఇందులో పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో భరత్ హీరో. ప్రేమిస్తే సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించిన శరణ్య నాగ్ ఇందులో మెయిన్ హీరోయిన్. అలాగే ఇప్పుడు ఇన్ స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ హీరోయిన్.. సునైనా సెకండ్ లీడ్ చేయడం గమనార్హం. ఈ సినిమాకు మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందించడం విశేషం. ఈ 10th క్లాస్ మూవీ అప్పట్లో సినీ ప్రియులను అలరించింది. ప్రేమిస్తేలో సంధ్య ఫ్రెండ్ పాత్రలో మెరిసిన శరణ్య ఇప్పుడెలా ఉందో తెలుసా..? చాలా ఛేంజ్ అయ్యింది. తమిళ పొన్ను అయిన ఈ బ్యూటీ.. చైల్డ్ ఆర్టిస్టు నుండి సినిమాలు చేస్తూ.. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తుంది.

తమిళనాడులో పుట్టి పెరిగిన శరణ్య.. చైల్డ్ ఆర్టిస్టుగా రెండు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత బైలింగ్వల్ మూవీ నీ మనసు నాకు తెలుసు చిత్రంలో కాలేజీ స్టూడెంట్ పాత్రలో మెరిసింది. ఆ తర్వాత ప్రేమిస్తేలో ఆమెకు ఛాన్స్ వచ్చింది. అందులో ఫ్రెండ్ ప్రేమకు సాయం చేస్తుంది. ఆ తర్వాత ఆమెకు 10th క్లాస్ సినిమాలో మెయిన్ హీరోయిన్ ఆఫర్ వచ్చింది. అటు వరుసగా తమిళ సినిమాలు చేస్తూ వచ్చింది. ప్రేమ ఒక మైకం, దూసుకెళ్తా వంటి చిత్రాల్లో కూడా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఓ సంస్థను స్థాపించినట్లు తెలుస్తోంది. పుష్కర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ హబ్ పేరుతో బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో యాక్టివ్‪గా ఉంటే శరణ్య.. ఇప్పుడు చాలా బొద్దుగా మారిపోయింది. అయినప్పటికీ.. తన కట్టుబొట్టుతో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఎటువంటి సినిమాలు చేయడం లేదని తెలుస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet