iDreamPost
android-app
ios-app

ఈ పాప ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్! మరో సాయిపల్లవి అంటున్నారు!

  • Published Mar 14, 2024 | 6:50 PM Updated Updated Mar 14, 2024 | 6:50 PM

ఈ పిక్ లో ఉన్న పాప.. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్. ప్రస్తుతం ఈమె పేరు నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది. కుర్రాళ్ల గుండెల్లో గూడుకట్టుకున్న ఈ చిన్నది ఎవరంటే..?

ఈ పిక్ లో ఉన్న పాప.. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్. ప్రస్తుతం ఈమె పేరు నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది. కుర్రాళ్ల గుండెల్లో గూడుకట్టుకున్న ఈ చిన్నది ఎవరంటే..?

  • Published Mar 14, 2024 | 6:50 PMUpdated Mar 14, 2024 | 6:50 PM
ఈ పాప ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్! మరో సాయిపల్లవి అంటున్నారు!

ఒకే ఒక్క సినిమా హీరోయిన్ జీవితాన్ని మార్చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. స్టార్ నటిని చేయడమే కాదు.. కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టేసుకుంటుంది. కలల యువరాణిగా మారిపోతుంది. ఇటీవల కాలంలో కేవలం తెలుగు బ్యూటీస్సే కాదూ.. బహు భాషా నటీమణులు కూడా హార్ట్ థ్రోబ్ చేసేస్తున్నారు. కన్నుగీటి.. ప్రియా ప్రకాష్ వారియర్ ఓవర్ నైట్ బ్యూటీ అయ్యింది. రష్మిక మందన్న.. పుష్పతో ఆల్ ఇండియా వైడ్‌గా నేషనల్ క్రష్ అని ముద్ర వేయించుకుంది. అలాగే.. మృణాల్ ఠాకూర్.. సీతగా తెలుగు హృదయాల్లో నిలిచిపోతుంది. వీరే కాదూ..సప్త సాగరాలు దాటి చిత్రంతో రుక్మిణీ వసంత్, గుడ్ నైట్ మూవీతో మేఘా రఘునాథ్, ట్రూ లవర్ తో శ్రీ గౌరీ ప్రియ.. ఇలా చెప్పుకుంటే పోతే లిస్ట్ కాస్త పెద్దగానే ఉంటుంది.

ఇప్పుడు మరో నటి.. యూత్ హార్ట్స్ మెలిపెట్టడమే కాదూ.. గిలిగింతలు పెట్టేస్తుంది. ఇదిగో ఈ ఫోటోలోని చిన్నారి గురించే ఇప్పుడు చెప్పుకోబోయేది. ఈ పాప ఎవరో గుర్తు పట్టారా..? ఇప్పుడు తెలుగు కుర్రాళ్ల హార్ట్ దోచేస్తోంది. మలయాళ బ్యూటీ అయినప్పటికీ.. తెలుగులో సినిమా చేయనప్పటికీ.. ఆమె పేరు ప్రస్తుతం టీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఆమె నటనకు ప్రముఖ దర్శకుడు కూడా ఫిదా అయిపోయి.. ఆమె మరో సాయి పల్లవి అంటూ పొగిడేశారు కూడా. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే, ప్రేమలు హీరోయిన్ మమిత బిజు. స్వయంగా దర్శక ధీరుడు జక్కన్నే గీతాంజలిలో గిరిజలా, ఓ సాయి పల్లవిలా అంటూ ఆమెను పొగడ్తలతో ముంచేసి.. కుర్రాళ్లను రెచ్చగొట్టేశారు.

కేరళలో పుట్టిన ఈ బ్యూటీ.. 2017లో మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. హనీ బీ, డాకినీ, స్కూల్ డైరీ, వికృతి వంటి చిత్రాల్లో నటించింది. ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలే చేసిన అమ్మడికి ఒక్కసారిగా పేరు తెచ్చిన చిత్రం.. ప్రేమలు. ఇందులో ఆమె చాలా మెచ్యూర్డ్ లెవల్ యాక్టింగ్‌తో ఇరగ దీసింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీని అద్బుతంగా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు గిరిష్. ఈ సినిమాకు మలయాళంలో మంచి రెస్పాన్స్ రావడంతో.. తెలుగులోకి డబ్ చేశారు రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ. ఇక్కడ మంచి రెస్పాన్స్ రావడంతో మమిత బిజుకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. జక్కన్న పొగడ్తలతో తెలుగులో వరుసగా ఆఫర్లు క్యూ కట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో రెబల్ అనే తమిళ చిత్రం మాత్రమే ఉంది.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetgray girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom