iDreamPost
android-app
ios-app

తారక్ కోసం ప్రశాంత్ నీల్ ప్లాన్ ఛేంజ్..!

  • Published Oct 30, 2024 | 4:05 PM Updated Updated Oct 30, 2024 | 4:05 PM

NTR 31 Updates: మొన్నటివరకు దేవర దేవర అంటూ తారక్ అభిమానులంతా ఊగిపోయారు. ఇక ఇప్పుడు వారి ఎదురుచూపులన్నీ వార్ 2 కోసమే.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో మూవీ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

NTR 31 Updates: మొన్నటివరకు దేవర దేవర అంటూ తారక్ అభిమానులంతా ఊగిపోయారు. ఇక ఇప్పుడు వారి ఎదురుచూపులన్నీ వార్ 2 కోసమే.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో మూవీ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

  • Published Oct 30, 2024 | 4:05 PMUpdated Oct 30, 2024 | 4:05 PM
తారక్ కోసం ప్రశాంత్ నీల్ ప్లాన్ ఛేంజ్..!

మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోలలో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ తో తారక్ స్థాయి మారిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు దేవరతో ఆ ఇంపాక్ట్ డబుల్ అయ్యింది. దాదాపు అందరి డైరెక్టర్స్ కు తారక్ వరంగా మారాడు. కానీ ప్రశాంత్ నీల్ తో మూవీ విషయంలో మాత్రం తారక్ చాలా లక్కీ. హీరోలలో ఎన్టీఆర్ లానే.. ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ప్రశాంత్ నీల్ ఒకరు. తీసింది నాలుగు సినిమాలే.. ఆ నాలుగు సినిమాలలో KGF మూవీ రెండు పార్ట్స్ గా వచ్చింది. అది కాకుండా సలార్ మూవీ ఒకటి . మొదటి మూవీ ఉగ్రం పక్కన పెట్టేస్తే.. మిగిలిన మూడు సినిమాలు కూడా ఒకే పాట్రన్ లో ఉంటాయి. సినిమా పోస్టర్ దగ్గర నుంచి ఎండ్ టైటిల్ వరకు.. బొగ్గు పులిమినట్లు అలాంటి విజువల్స్ ఏ కనిపిస్తాయి. ఇలాంటి థీమ్ లో మొదటి సారి KGF మూవీ చూసినప్పుడు అందరికి కాస్త కొత్తగా అనిపించింది. కానీ సలార్ వచ్చే టైం కి.. ప్రేక్షకులకు ఎక్కడో కాస్త ఓవర్ డోస్ ఫీలింగ్ కలిగింది.

అది కాకుండా ప్రశాంత్ నీల్ మాటలు , మేకింగ్ , ఎడిటింగ్ అన్నీ కూడా ఒకటే స్టైల్లో జరుగుతూ ఉంటాయి. సో దీని వలన ప్రశాంత్ నీల్ మూవీస్ అన్నీ కూడా ఇదే పాట్రన్ లో నడుస్తాయనే ఒక ఫీలింగ్ ఉండిపోయింది. దీనితో ఇప్పుడు ప్రశాంత్ నీల్ తన ప్లాన్ ను చేంజ్ చేయబోతున్నాడట. అంతే కాకుండా విజువల్ గా కూడా ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుందనే టాక్ నడుస్తుంది. ఎన్టీఆర్ ను డిఫరెంట్ గా చూపించడమే కాకుండా తనని తానూ కొత్తగా చూపించబోతున్నాడట ప్రశాంత్ నీల్. అయితే ఇంతకుముందు ఫస్ట్ లుక్ లో రివీల్ చేసిన బ్లాక్ థీమ్ సినిమాలో ఉండదని సమాచారం. ఎన్టీఆర్ ఎలా అయితే తెరపై తన స్టాండర్డ్ ను మైంటైన్ చేస్తున్నాడో.. దర్శకులు కూడా అదే స్టాండర్డ్ ను మైంటైన్ చేస్తూ..  ఎన్టీఆర్ కోసం  కథలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ చేసిది కూడా అదే. ఆల్రెడీ సినిమా స్టోరీ లైన్ పై కొంత బజ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు అసలు బ్లాక్ థీమ్ ఉండదని చెప్పడంతో సినిమాపై ఇంట్రెస్ట్ మరింత పెరిగింది.

ప్రశాంత్ నీల్ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ను ఏ రేంజ్ లో చూపిస్తాడా.. ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తాడా అని అందరికి క్యూరియాసిటీ పెరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 మూవీ తో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ దెబ్బతో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఎన్టీఆర్ అంటే ఏంటో ప్రూవ్ అవుతుంది. ఇక ఆ సినిమా అయిన వెంటనే తారక్ ప్రశాంత్ నీల్ మూవీ షూట్ లో జాయిన్ అవుతాడు. అయితే ఈ సినిమాను నవంబర్ నెలాఖరుకు మొదలు పెట్టొచ్చని సమాచారం. ఈ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ ఉండొచ్చని అంచనా. రిలీజ్ సంగతి పక్కన పెడితే సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఎలాంటి అప్డేట్స్ వస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom