iDreamPost
android-app
ios-app

ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడా.. ఆ స్టేటస్ అర్థం అదేనా

  • Published May 17, 2024 | 11:13 AM Updated Updated May 17, 2024 | 11:20 AM

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ .. అదిరిపోయే న్యూస్ వెల్లడించాడు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఎనౌన్స్ మెంట్ చేయడం విశేషం.

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ .. అదిరిపోయే న్యూస్ వెల్లడించాడు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఎనౌన్స్ మెంట్ చేయడం విశేషం.

  • Published May 17, 2024 | 11:13 AMUpdated May 17, 2024 | 11:20 AM
ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడా.. ఆ స్టేటస్ అర్థం అదేనా

పాన్ ఇండియాను దాటి గ్లోబల్ రేంజ్‌కు చేరిన టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పెద్దనాన్న నుండి నటన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈశ్వర్ మూవీతో ఎంట్రీ ఇచ్చి.. బాహుబలి మూవీతో తెలుగు ఇండస్ట్రీలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు ఈ ఆరు అడుగుల కటౌట్. ఇంట్రోవర్ట్, ఈ సిగ్గరిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది అభిమానులు ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటారు. అమ్మాయిల కలల రాకుమారుడు అయిన ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అన్న సంగతి విదితమే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ వ్యక్తిగత విషయానికి వస్తే.. ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడు చర్చే. చాలా మంది అన్న.. వదిన వచ్చేది ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తూ ఉంటారు మేల్ ఫ్యాన్స్.

అయితే ఇప్పుడు స్వయంగా డార్లింగ్ ప్రభాస్ నుండి ఓ అప్డేట్ వచ్చింది. ఇది బహుశా పెళ్లికి సంబంధించిన సమాచారం కూడా కావొచ్చు. ప్రభాస్ సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వెల్లడించారు. అందులో ‘డార్లింగ్స్.. ఓ ప్రత్యేకమైన వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నారు.. వెయిట్ చేయండి’ అంటూ ఇన్‌స్టా‌గ్రామ్ వేదికగా ఓ స్టేటస్ పెట్టారు. ఇది చూడబోతే.. పెళ్లి గురించేమో అన్న అనుమానం కలుగుతుంది. కాస్త క్యూరియాసిటీని క్రియేట్ చేసినట్లు అయ్యింది. మొత్తానికి ప్రభాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడన్న వార్త మాత్రం హల్ చల్ చేస్తుంది. ప్రభాస్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ఒక్కసారిగా ఊహాగానాలు మొదలయ్యాయి.

ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 AD మూవీ కంప్లీట్ చేశాడు. ఈ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కాబోతుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రాబోతుంది. ఇందులో దీపికా పడుకునే హీరోయిన్. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.  దీనికి నాగ్ అశ్విన్ దర్శకుడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వస్తున్న రాజా సాబ్ షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు డార్లింగ్.  అలాగే కన్నప్పలో కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అదే కాకుండా సలార్ 2 షూటింగ్ కూడా ఈ నెలలోనే ప్రారంభం కానుంది. డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ కూడా ఈ ఏడాదే పట్టాలు ఎక్కనుంది. ఇవన్నీ లైన్లో ఉండగానే.. హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమాకు కూడా ఓకే చెప్పాడు ప్రభాస్.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet