iDreamPost
android-app
ios-app

సెంథిల్ భార్య మరణంపై ప్రభాస్ ఎమోషనల్ వీడియో!

  • Published Feb 16, 2024 | 4:35 PM Updated Updated Feb 16, 2024 | 4:49 PM

Prabhas Taking About Roohi: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ భార్య రూహీ అనారోగ్యోంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె మరణంపై పలువురు సినీ తారలు సంతాపం తెలియజేశారు. అలానే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఆమె గురించి మాట్లాడుతూ.. ఎమోషనలయ్యారు.

Prabhas Taking About Roohi: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ భార్య రూహీ అనారోగ్యోంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె మరణంపై పలువురు సినీ తారలు సంతాపం తెలియజేశారు. అలానే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఆమె గురించి మాట్లాడుతూ.. ఎమోషనలయ్యారు.

  • Published Feb 16, 2024 | 4:35 PMUpdated Feb 16, 2024 | 4:49 PM
సెంథిల్ భార్య మరణంపై ప్రభాస్ ఎమోషనల్ వీడియో!

టాలీవుడ్ ప్రముఖ సినిమాటో గ్రాఫర్ కెకె సెంథిల్  కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గురువారం సాయంత్రం ఆయన భార్య రూహీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల నుంచి ఆమె ఆరోగ్యం పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలోనే గురువారం సాయంత్రం ఆమె కన్నుమూశారు. హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక రూహీ మరణ వార్త విన్న టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలిపారు.  ఆమె మరణంపై ఎమోషనల్ అవుతూ ప్రభాస్ ఓ వీడియో  పోస్ట్ చేశారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్  మీడియాలో వైరల్ అవుతోంది.

రూహీ గురించి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పలు విషయాలను చెప్పుకొచ్చాడు. రూహీ యోగా ట్రైనర్ కావడంతో ఆమె సలహాలను పాటించే వాడినని తెలిపారు. షూటింగ్  తరువాత అలసటగా ఉన్న సమయంలో యోగ టిప్స్ పాటిస్తూ రిలాక్స్ అయ్యే వాడినని ప్రభాస్ తెలిపారు. ఆమె తనకు మంచి స్నేహితురాలని, యోగాతో తాను యాక్టివ్ గా ఉండేందుకు తోడ్పడుతుందని ప్రభాస్ అన్నారు. బాహుబలి-2 మూవీ షూటింగ్ టైంలో ఆమె ఇచ్చిన సలహాలు చాలా హెల్ప్ అయ్యాయని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

తాజాగా రూహీ మరణంపై ప్రభాస్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాహుబలి సినిమా సమయంలో అనుష్క, ప్రభాస్ కు రూహీ యోగా ట్రైనర్ గా పని చేశారు. అంతేకాకుండా గోవా బ్యూటీ ఇలియానాకు కూడా యోగా శిక్షణ ఇచ్చారు. సెంథిల్ కుమార్, రూహీ 2009 వివాహం చేసుకున్నారు. సెంథిల్ కుమార్ దర్శకధీరుడు రాజమౌళి నిర్మించిన బ్లాక్ బస్టర్ చిత్రాలకు సినిమాటోగ్రఫర్ గా సేవలందించారు. మగధీర, యమదొంగ, ఛత్రపతి, ఈగ, సై, బాహుబలి, బాహుబలి-2 వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఇక రూహీ అంత్యక్రియలు జూబ్లిహిల్స్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetCasibomCasibomCasibomjojobetbetwooncasibomcasibombetcio girişiptv satın al