iDreamPost
android-app
ios-app

వీడియో: ఆన్​స్క్రీన్​లో అన్నయ్య.. ఆఫ్​స్క్రీన్​లో ప్రభాస్​ను రేప్ చేస్తా: నటి!

  • Author singhj Published - 06:27 PM, Sun - 6 August 23
  • Author singhj Published - 06:27 PM, Sun - 6 August 23
వీడియో: ఆన్​స్క్రీన్​లో అన్నయ్య.. ఆఫ్​స్క్రీన్​లో ప్రభాస్​ను రేప్ చేస్తా: నటి!

టాలీవుడ్ హీరోల్లో రెబల్ స్టార్ ప్రభాస్​ కాస్త వైవిధ్యమనే చెప్పాలి. ఒక్కో సినిమాతో స్టార్​గా ఎదిగిన ప్రభాస్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారారు. ‘బాహుబలి’ సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా ఆయన క్రేజ్ ఒక్కసారిగా భారీగా పెరిగిపోయింది. ప్రభాస్ అంటే అందరికీ ముందుగా ఆయన కటౌటే మదిలో మెదులుతుంది. ఆరడుగులకు పైగా ఎత్తు, భారీ దేహంతో ఉంటాడు కాబట్టే ప్రభాస్​తో మేకర్స్ ఎక్కువగా యాక్షన్ మూవీస్ ప్లాన్ చేస్తుంటారు. ‘బాహుబలి’తో పాటు ఆ తర్వాత వచ్చిన ‘సాహో’, త్వరలో రాబోతున్న ‘సలార్’, ‘కల్కీ 2898 ఏడీ’ కూడా అలాంటి చిత్రాలే.

ఇప్పుడు ఎక్కువగా యాక్షన్ మూవీస్ చేస్తున్నాడు ప్రభాస్. కానీ ఆయనకు ఫ్యామిలీ ఆడియెన్స్​, ఫిమేల్ ఆడియెన్స్​లో క్రేజ్ పెంచినవి క్లాస్ మూవీస్ కావడం గమనార్హం. ‘వర్షం’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్​ఫెక్ట్’, ‘మిర్చి’ చిత్రాలు ప్రభాస్​ను అన్ని వర్గాల ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. పై సినిమాల్లో యాక్షన్, ఫైట్ సీక్వెన్స్​లు ఉన్నప్పటికీ వాటి కంటే కూడా అందులో హీరోయిన్లతో ప్రభాస్ కెమిస్ట్రీ, లవ్ సీన్స్ అందర్నీ కట్టిపడేశాయి. దీంతో ప్రభాస్ మరో కూల్ లవ్ స్టోరీలో నటిస్తే చూడాలని ఉందని చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ‘రాధేశ్యామ్’ రూపంలో మరో లవ్ స్టోరీతో ప్రభాస్ ఆడియెన్స్ ముందుకు వచ్చారు. కానీ ఆ సినిమా చాలా మందికి కనెక్ట్ కాలేదు.

ఫ్యూచర్​లో ఏవైనా ప్రేమ కథా చిత్రాల్లో ప్రభాస్ నటిస్తారో లేదో చూడాలి. అలాంటి యంగ్ రెబల్ స్టార్​ గురించి ప్రముఖ నటి ఇందు మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘రాజ రాజ చోర’, ‘గాలివాన’ వెబ్ సిరీస్​తో పాటు పలు ప్రాజెక్టుల్లో ఈమె నటించారు. ప్రస్తుతానికి చిన్న చిన్న పాత్రల్లో ఆమె ఎక్కువగా యాక్ట్ చేస్తున్నారు. ప్రభాస్​కు చెల్లిగా నటిస్తారా అని ఒక ఇంటర్వ్యూలో యాంకర్ ఇందును అడిగారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘ఆన్​స్క్రీన్​లో చెల్లిగా చేస్తా. ఆఫ్​స్క్రీన్​లో ప్రభాస్​ను రేప్ చేస్తా’ అని రిప్లయ్ ఇచ్చారు. దీంతో యాంకర్ నోరెళ్లబెట్టారు. అయితే ఇది పాత వీడియో అని తెలుస్తోంది.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet