iDreamPost
android-app
ios-app

‘సలార్’ స్టోరీ లీక్! వాళ్లిద్దరి కోసం యుద్ధం చేస్తున్న ప్రభాస్?

  • Author singhj Published - 10:01 PM, Fri - 28 July 23
  • Author singhj Published - 10:01 PM, Fri - 28 July 23
‘సలార్’ స్టోరీ లీక్! వాళ్లిద్దరి కోసం యుద్ధం చేస్తున్న ప్రభాస్?

రెబల్ స్టార్ ప్రభాస్​కు పాన్ ఇండియా రేంజ్​లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ‘బాహుబలి’ సిరీస్​తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించాడీ టాలీవుడ్ హీరో. ఆ తర్వాత వచ్చిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు నిరాశపర్చినప్పటికీ డార్లింగ్​ ఇమేజ్​ చెక్కుచెదరలేదు. అందుకు ఉదాహరణగా ‘ఆదిపురుష్’ మూవీని చెప్పొచ్చు. కాంట్రవర్సీలు, నెగెటివిటీ ఈ సినిమాను చుట్టుముట్టినా కేవలం ప్రభాస్ ఇమేజ్ వల్లే భారీ ఓపెనింగ్స్ రాబట్టి బయటపడిందీ చిత్రం. ఇప్పుడు ‘సలార్’, ‘కల్కీ 2898 ఏడీ’ సినిమాలపై డార్లింగ్ ఫోకస్ పెడుతున్నారు. ఇందులో ‘సలార్’ త్వరలోనే రిలీజ్ కానుంది. ‘కేజీఎఫ్’ సిరీస్​తో ఆడియెన్స్​ను ఎంతగానో అలరించిన మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘సలార్’ను తెరకెక్కిస్తున్నారు.

‘సలార్’ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్​గా యాక్ట్ చేస్తున్నారు. టీజర్​తో సెన్సేషనల్ హైప్​ను అందుకుందీ మూవీ. ఇకపై ఈ ఫిల్మ్ నుంచి మరిన్ని అప్​డేట్స్ రానున్నాయి. త్వరలో ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్​ను రిలీజ్ చేస్తారని వినిపిస్తోంది. సంగీత దర్శకుడు రవి బస్రూర్ అండ్ టీమ్ ఆ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఏ క్షణమైనా అప్​డేట్ రావొచ్చని సమాచారం. ఇదిలా ఉంటే.. ‘సలార్’ స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ మూవీలో ఇద్దరు వ్యక్తుల కోసం ప్రభాస్ యుద్ధం చేస్తారట. ‘సలార్’లో హీరో గత జీవితం హింసతో కూడినదై ఉంటుందట. పాస్ట్ లైఫ్​తో పాటు హీరో ప్రెజెంట్ లైఫ్​ను ఒక యుద్ధ నగరంలో ప్లాన్ చేశారట డైరెక్టర్​ ప్రశాంత్ నీల్.

‘సలార్’లో తన తల్లికి ఇచ్చిన మాట కోసం పరితపించే పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారట. అదే విధంగా ప్రాణమిత్రుడికి విధేయతగా ఉండటం ఆయన క్యారెక్టర్ ఉద్దేశమని నెట్టింట జోరుగా వినిపిస్తోంది. ‘సలార్’ అంటే సైన్యాధ్యక్షుడని.. రాజు సేనను నడిపించడమే ఆయన పని అని నెటిజన్స్ అంటున్నారు. మొత్తంగా చెప్పాలంటే ‘సలార్’ స్టోరీ పూర్తిగా బంధాలపై ఆధారపడి నడుస్తుందట. రిలేషన్​షిప్స్​కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే హీరో పాత్ర వాటిని నిలబెట్టుకునేందుకు ఎంత హింస చేయడానికైనా వెనుకాడడని టాక్. ఈ సినిమా ఆద్యంతం ఎమోషన్స్​తో కట్టిపడేస్తుందని సమాచారం. అయితే ‘సలార్’ స్టోరీ ఇదేనంటూ వైరల్ అవుతున్న పోస్టులో ఎంత నిజం ఉందనేది సినిమా రిలీజ్ అయ్యే వరకు చెప్పలేం.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş