iDreamPost
android-app
ios-app

Prabhas Maruthi Movie 50 రోజుల్లో ప్రభాస్ సినిమా

Prabhas Maruthi Movie 50 రోజుల్లో ప్రభాస్ సినిమా

బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా లెవెల్ లో వందల కోట్ల మార్కెట్ సంపాదించుకున్న డార్లింగ్ ప్రభాస్ కు అర్జెంట్ గా ఇప్పుడో బ్లాక్ బస్టర్ కావాలి. సాహో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడం, రాధే శ్యామ్ అన్ని భాషల్లోనూ డిజాస్టర్ కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాలీవుడ్ మేకర్స్ మాయలో పడి తనను సరిగా వాడుకోవడం లేదని వాళ్ళ ఆవేదన. అందులో నిజం లేకపోలేదు. నార్త్ ఆడియన్స్ ని మెప్పించాలనే ఉద్దేశంతో సబ్జెక్టులకు హిందీ స్టైల్ లో ట్రీట్మెంట్ ఇవ్వడం ఫ్లాపులకు దారి తీస్తోంది. అందుకే ప్రభాస్ మారుతీతో ఓ ప్రాజెక్ట్ ఓకే చేసిన సంగతి తెలిసిందే. నిర్మాతగా డివివి దానయ్య వ్యవహరించబోతున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన అప్ డేట్స్ ఫ్యాన్స్ కి హుషారునిచ్చేలా ఉన్నాయి. ఇది కేవలం 50 రోజుల ప్రభాస్ కాల్ షీట్స్ తో షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఆ మేరకు మారుతీ పక్కా ప్లానింగ్ తో స్క్రిప్ట్ ని, షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నాడు. తమన్ సంగీతం సమకూర్చబోతున్నాడు. హారర్ కామెడీలోనే డిఫరెంట్ గా ట్రై చేయబోతున్న జానర్ ఇది. అందుకే రీ రికార్డింగ్ కి చాలా ప్రత్యేకత ఉంటుంది. తమన్ తప్ప ఇంకెవరు న్యాయం చేయలేరని గుర్తించి తననే లాక్ చేసినట్టు సమాచారం. దీనికి రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది కానీ ఇప్పుడు దాన్ని మార్చాలనే ఆలోచనలో మారుతీ ఉన్నారట.

మొత్తానికి ఇంత వేగంగా ఒక సినిమా పూర్తయితే అంతకన్నా ప్రభాస్ కు కావాల్సింది ఏముంటుంది. ప్రస్తుతం బ్రేక్ తీసుకున్న డార్లింగ్ రెస్ట్ పూర్తి కాగానే సలార్ లో రీ జాయిన్ అవుతాడు. దీనికోసమే ప్రత్యేకంగా కొంత బరువు తగ్గే పని మొదలుపెట్టాడట. మారుతీ మూవీకి సైతం ఫిట్ బాడీ అవసరం కావడంతో దానికి అనుగుణంగానే రెడీ అవుతున్నట్టు తెలిసింది. జూలైలో షూటింగ్ మొదలుపెట్టబోతున్న ఈ ఎంటర్ టైనర్ అన్ని భాషల్లో విడుదల చేయకపోవచ్చు. కేవలం తెలుగుకే పరిమితమవ్వాలని చూస్తున్నారు కానీ అప్పటి పరిస్థితులను బట్టి ఈ నిర్ణయంలో మార్పులు ఉండొచ్చు. హీరోయిన్ ఇతర క్యాస్టింగ్ పనులను చూసే పనిలో మారుతీ బిజీగా ఉన్నాడు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి