iDreamPost
android-app
ios-app

ఇమాన్వి విషయంలో సుడిగాలి సుధీర్ కు గట్టి షాక్ ఇచ్చిన ప్రభాస్..!

  • Published Nov 11, 2024 | 2:30 PM Updated Updated Nov 11, 2024 | 2:30 PM

ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు . ఇక ఆ తర్వాత ప్రభాస్ ఫౌజీ సినిమాను స్టార్ట్ చేయనున్నట్లు తెలిసిందే. అయితే ఆ సినిమా అనౌన్స్ చేసిన సమయంలో.. ఫౌజీ హీరోయిన్ గురించి తెగ ముచ్చట్లు చెప్పుకున్నారు ప్రేక్షకులు. రీసెంట్ గా ఈ అమ్మడి గురించి మరో ఇంట్రెస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు . ఇక ఆ తర్వాత ప్రభాస్ ఫౌజీ సినిమాను స్టార్ట్ చేయనున్నట్లు తెలిసిందే. అయితే ఆ సినిమా అనౌన్స్ చేసిన సమయంలో.. ఫౌజీ హీరోయిన్ గురించి తెగ ముచ్చట్లు చెప్పుకున్నారు ప్రేక్షకులు. రీసెంట్ గా ఈ అమ్మడి గురించి మరో ఇంట్రెస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

  • Published Nov 11, 2024 | 2:30 PMUpdated Nov 11, 2024 | 2:30 PM
ఇమాన్వి విషయంలో సుడిగాలి సుధీర్ కు గట్టి షాక్ ఇచ్చిన ప్రభాస్..!

రాజాసాబ్ , ఫౌజీ , స్పిరిట్ , సలార్ 2 , కల్కి 2 లకే ఫ్యాన్స్ ఆశ్చర్యపోతుంటే.. మరిన్ని సినిమాలను లైన్ లో పెడుతూ.. షాక్ లు మీద షాక్ లు ఇస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ ను చక చకా లాగించేసే పనిలో ఉన్నాడు. ఇది అయినా వెంటనే ఫౌజీ పట్టాలెక్కేస్తుంది. ఈ మూవీ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా మెయిన్ గా అందరికి స్పెషల్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసేది ఎవరంటే.. ఈ మూవీ హీరోయిన్. జస్ట్ ఒక్కసారి మూవీ అనౌన్సుమెంట్ టైం లో కనిపించింది అంతే.. సోషల్ మీడియా లో పాపులర్ అయిపోయింది ఇమాన్వి. ఈ అమ్మడి కోసం నెటిజన్లు చేసిన రీసెర్చ్ అంతా ఇంతా కాదు. ఎదో ఒకటి చేసి ఈ అమ్మడి ఇన్స్టా హ్యాండిల్ ను కనుగొన్నారు. మొదటి సినిమానే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో చేస్తుందంటే.. అదృష్టం గట్టిగా ఉన్నట్లుంది అంటూ కామెంట్స్ చేశారు నెటిజన్లు. ఇదంతా అందరికి తెలిసిన విషయమే.

అయితే ఇప్పుడు ఇమాన్వికి సంబంధించిన మరో వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ హీరోయిన్ ను సెలెక్ట్ చేసుకుని డార్లింగ్ ప్రభాస్ సుడిగాలి సుధీర్ కి పెద్ద షాక్ ఇచ్చాడు. అసలు ఇప్పుడు ఈ సినిమా విషయంలో సుడిగాలి సుధీర్ ప్రస్తావన ఎందుకు వచ్చిందా అనుకుంటున్నారా.. దానికి కారణం లేకపోలేదు. సుడిగాలి సుధీర్ కూడా ప్రస్తుతం వెండి తెరపై మ్యాజిక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుధీర్ గోట్ అనే ఓ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా ఇమాన్వి ని తీసుకుందాం అనుకున్నారట. ఆమెను కాంటాక్ట్ చేయడానికి కూడా చాలా ట్రై చేశారట. కానీ కొన్ని కారణాల వలన అది జరగలేదట. కట్ చేస్తే ఆమె ప్రభాస్ పక్కన హీరోయిన్ గా కనిపించడంతో సుధీర్ షాక్ అయ్యాడట. సో ఇలా సుధీర్ ఆ అమ్మాయిని తన సినిమాలో హీరోయిన్ గా మిస్ అయ్యాడట. ప్రస్తుతం ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తానికి అసలు సినిమా స్టార్ట్ కాకా ముందే ఈ అమ్మడు తెగ వైరల్ అవుతుంది. తర్వాత ఏమౌతుందో చూడాలి.

ఇక సుధీర్ కూడా తన సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. అటు బుల్లి తెర మీద సుధీర్ ను ఆదరించిన అదే ప్రేక్షకులు.. అతని సినిమాలను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు . ఇక సుధీర్ నటిస్తున్న సినిమా ఎప్పుడొస్తుందో చూడాలి. మరో వైపు ప్రభాస్ ఎవరికీ చిక్కకుండా హై స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రభాస్ సినిమాలు, రెమ్యునరేషన్ , క్రియేట్ చేయబోయే హిస్టరీలు , మిస్టరీలు.. దీని గురించే చర్చ నడుస్తుంది. ప్రభాస్ ఈ తారా స్థాయి అంచనాలను నిలబెడతాడా లేదా అనేది చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom