iDreamPost
android-app
ios-app

రెబల్ స్టార్ కు కొత్త తంటాలు.. అంతా దాని కోసమేనా?

  • Published Sep 26, 2024 | 3:53 PM Updated Updated Sep 26, 2024 | 3:53 PM

Prabas: ఇండియాలో నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ పరిస్థితి చూస్తే.. పాపం అనేలా అనిపిస్తుంది. అదేంటి.. డార్లింగ్ కు పాపం అనేంత పెద్ద కష్టం ఏమి వచ్చింది కెరీర్ లో టాప్ పొజిషన్ లో ఉన్నాడు కదా అని ఆశ్చర్యపోతున్నారా..? మరి ప్రభాస్ కు వచ్చిన ఆ కష్టం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Prabas: ఇండియాలో నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ పరిస్థితి చూస్తే.. పాపం అనేలా అనిపిస్తుంది. అదేంటి.. డార్లింగ్ కు పాపం అనేంత పెద్ద కష్టం ఏమి వచ్చింది కెరీర్ లో టాప్ పొజిషన్ లో ఉన్నాడు కదా అని ఆశ్చర్యపోతున్నారా..? మరి ప్రభాస్ కు వచ్చిన ఆ కష్టం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Sep 26, 2024 | 3:53 PMUpdated Sep 26, 2024 | 3:53 PM
రెబల్ స్టార్ కు కొత్త తంటాలు.. అంతా దాని కోసమేనా?

రెబల్ స్టార్ ‘ప్రభాస్’.. ఈ పేరుకే కాదు.. ఈయన సినిమాలకు కూడా ఫుల్ క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే ప్రభాస్ దగ్గర నుంచి సినిమా వస్తుందంటే చాలు.. ఫ్యాన్స్ థియేటర్స్ కు భారీ సంఖ్యలో బారులు తీస్తుంటారు. ఇక అందుకు నిదర్శనం ఇటీవలే ప్రభాస్ కల్కి మూవీ అని చెప్పవచ్చు. ఈ సినిమాతో ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడమే కాకుండా.. రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీతో తర్వాత.. ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్ మూవీలో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వకుండనే మరోవైపు ప్రభాస్ హను రాఘువపూడి ప్రాజెక్ట్ లో కూడా చేస్తున్నాడు. దీని తర్వాత.. సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇన్ని బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ కు.. ఆ విషయంలో మాత్రం చాలా తంటాలు పడుతున్నాడట. ముఖ్యంగా ఆ డైరెక్టర్ చేస్తున్న సినిమాలో ప్రభాస్ ఎలాగైన రాజీ పడాల్సిందే అంటూ టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏం జరిగింది ఆ వివరాలేంటో చూద్దాం.

ఇండియాలో నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ పరిస్థితి చూస్తే.. పాపం అనేలా అనిపిస్తుంది. అదేంటి.. డార్లింగ్ కు పాపం అనేంత పెద్ద కష్టం ఏమి వచ్చింది కెరీర్ లో టాప్ పొజిషన్ లో ఉన్నాడు కదా అని ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుతం ప్రభాస్ పరిస్థితి అలానే ఉంది. ఎందుకంటే.. ఏ ముహర్తనా పాన్ ఇండియా స్టార్ అయ్యేడో తెలియదు కానీ, అప్పటి నుంచి గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు ప్రభాస్. అదేంటి వరుస సినిమాలతో ప్రబాస్ బిజీ అయితే దీనికి పాపం అంటున్నారు అనుకుంటే పొరపాడినట్లే. అసలు కష్టం ఇది కాదు. ఇంతకీ అదేంటంటే.. సినిమా సినిమాకు ప్రభాస్ అవుతున్ మేకోవర్ పైనే ఈ చర్చ. నిజానికి బాహుబలి సినిమా నుంచి మొదలుపడితే.. ప్రతి డైరెక్టర్ కూడా ప్రభాస్ ను కొత్తగానే చూపించాలని తహాతపడుతున్నారు. ముఖ్యంగా డార్లింగ్ ను మన టాలీవుడ్ డైరెక్టర్స్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ లో చూస్తున్నారు. అందుకే ప్రభాస్ లుక్ కూడా అలానే ఉండాలని అనుకుంటన్నారు.

ఇక డైరక్టర్స్ కోసం సినిమా సినిమాకు కొత్త గెటప్ లో మారుపోతున్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనే.. బహుబలి, సాహో, రాధే శ్యామ్, సలార్, కల్కి ఇలా ఏ సినిమాకు అదే డిఫరెంట్ లుక్ లో కనిపించారు ప్రభాస్. తాజాగా నటిస్తున్న రాజా సాబ్ లో కూడా ప్రభాస్ వింటెజ్ లుక్ లో కనిపిస్తున్నాడు. అలాగే హను రాఘువపూడి సినిమాలో క్లిన్ సేవ్ తో మిర్చి మూవీ లుక్ లో మారిపోయారు. ఇక కరైకుడిలో జరుగుతున్న షూటింగ్ లో కూడా ఇదే లుక్ లో కనిపించారు ప్రభాస్. అయితే ఈ సినిమా తర్వా ప్రభాస్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడే ప్రభాస్ కు అసలు సమస్య వచ్చి పడింది. ఎందుకంటే.. సందీప్ రెడ్డి వంగా తన సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తాడు.

ఒక రకంగా చెప్పాలంటే.. తాను తెరకెక్కించిన సినిమాలో ఎంత కష్టమైనా ఏ సీన్స్ పెట్టాలన్నా, యాక్టర్స్ ఎలాంటి మేకర్స్ లో కనిపించాలనే కాన్సెప్ట్ పై సందీప్ పట్టు విడువని విక్రమార్కుడిలా అనుకున్నది సాధించికుంటాడు. ఇందుకోసం ఎంత సమయమైనా తీసుకుంటాడు. ఈ క్రమంలోనే.. ఇప్పుడు స్పీరిట్ మూవీ విషయంలో కూడా ప్రభాస్ లుక్ పై సందీప్ సరికొత్త మేకోవర్ తో చూపించాలని ఆలోచనలో ఉన్నాడని సమాచారం. ఒక వేళ అదే నిజమైతే సందీప్ అందులో ఏ మాత్రం రాజీ పడాడు. దీంతో ప్రభాసే స్పిరిట్ డిఫరెంట్ మేకోవర్ కోసం రాజీపడాల్సి వస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అందుకోసమే ఫౌజి తర్వాతనే స్పిరిట్ మూవీకి డేట్స్ ఇచ్చాడని టాక్ జోరుగా వినిపిస్తోంది. మరి, సందీప్ తో స్పిరిట్ మూవీ మేకేవర్ కు ప్రభాస్ వచ్చిన కష్టంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.