iDreamPost
android-app
ios-app

ప్రభాస్-అనుష్క కాంబోలో మరో మూవీ? స్టార్ డైరెక్టర్ అదిరిపోయే స్కెచ్!

  • Author singhj Published - 04:39 PM, Sat - 29 July 23
  • Author singhj Published - 04:39 PM, Sat - 29 July 23
ప్రభాస్-అనుష్క కాంబోలో మరో మూవీ? స్టార్ డైరెక్టర్ అదిరిపోయే స్కెచ్!

సినీ పరిశ్రమలో కొన్ని కాంబోలకు ఆడియెన్స్​లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఫలానా దర్శకుడు, ఫలానా హీరో కలసి సినిమా తీస్తే బాగుంటుంది లేదా ఫలానా హీరోలిద్దరూ కలసి నటిస్తే అదిరిపోతుందని ప్రేక్షకులు అనుకుంటారు. అలాగే ఫలానా హీరో, ఫలానా హీరోయిన్ కలసి నటిస్తే చూడాలని కోరుకునే ఫ్యాన్స్ ఎంతో మంది ఉంటారు. అలాంటి ఒక జంటే రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ అనుష్క. వీళ్లిద్దరిది హిట్ పెయిర్ అనే చెప్పొచ్చు. ‘మిర్చి’, ‘బిల్లా’, ‘బాహుబలి’ సిరీస్​తో వీళ్లిద్దరూ ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేశారు. అయితే ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా నుంచి హాలీవుడ్ రేంజ్​కు చేరుకున్నారు. కానీ అనుష్క మాత్రం ‘జీరో సైజ్’ సినిమా దెబ్బకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవడంతో పెద్దగా కనిపించడం లేదు.

‘భాగమతి’ సినిమాతో మంచి హిట్ అందుకున్నా.. ఆ తర్వాత చేసిన ‘నిశ్శబ్దం’ అనుష్కను తీవ్రంగా నిరాశపర్చింది. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలసి ఆమె చేస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా రిలీజ్ పోస్ట్​పోన్ అయింది. ఈ మూవీతో ఈ కన్నడ కస్తూరి తన సినీ కెరీర్​కు ఫుల్​స్టాప్ పెడతారనే వార్తలు వస్తున్నాయి. ఈ టైమ్​లో మరో అదిరిపోయే న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. స్టార్ కాంబోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్-అనుష్కలు కలసి త్వరలో ఒక సినిమా చేయబోతున్నారట. వీళ్లిద్దరి కాంబోలో మరో పీరియాడికల్ మూవీ తీసేందుకు స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఒక కథను రెడీ చేశారని టాక్. తాను సిద్ధం చేసుకున్న కథను ‘బాహుబలి’ ప్రొడ్యూసర్లు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనికి వినిపించారట క్రిష్.

క్రిష్ చెప్పిన స్టోరీ వారికి నచ్చడంతో ప్రాజెక్టును నిర్మించేందుకు ముందుకొచ్చినట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అటు ప్రభాస్, అనుష్క నుంచీ మూవీకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రభాస్-అనుష్క కాంబోను త్వరలో వెండితెరపై అభిమానులు చూడొచ్చు. కాగా, ప్రభాస్-మారుతి కలయికలో తెరకెక్కుతున్న ‘రాజా డీలక్స్’ చిత్రంలో అనుష్క నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఎంతో ప్రాధాన్యం ఉన్న ఓ పాత్రలో ఆమె యాక్ట్ చేస్తున్నారట. అయితే అటు క్రిష్ ప్రాజెక్టుతో పాటు ఇటు మారుతి మూవీలో అనుష్క నటించడం పైనా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం. మరి.. ప్రభాస్-అనుష్క మరోమారు కలసి నటిస్తే చూడాలని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş