iDreamPost
android-app
ios-app

Jani మాస్టర్ కస్టడీ కోరుతూ కోర్టులో పిటీషన్ వేసిన పోలీసులు!

  • Published Sep 23, 2024 | 6:15 PM Updated Updated Sep 23, 2024 | 6:15 PM

Jani: పాన్ ఇండియా టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకరిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో జానీ మాస్టర్ ఒకరు. ఇటీవల ఆయన అసిస్టెంట్ తనని లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ ఆయన మీద కేసు పెట్టిన విషయం సంచలనం సృష్టించింది.

Jani: పాన్ ఇండియా టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకరిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో జానీ మాస్టర్ ఒకరు. ఇటీవల ఆయన అసిస్టెంట్ తనని లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ ఆయన మీద కేసు పెట్టిన విషయం సంచలనం సృష్టించింది.

Jani మాస్టర్ కస్టడీ కోరుతూ కోర్టులో పిటీషన్ వేసిన పోలీసులు!

పాన్ ఇండియా టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకరిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో జానీ మాస్టర్ ఒకరు. ఇటీవల ఆయన అసిస్టెంట్ తనని లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ ఆయన మీద కేసు పెట్టిన విషయం సంచలనం సృష్టించింది. ప్రస్తుతం జానీ మాస్టర్ రిమాండ్ మీద జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయం మీద జానీ భార్య ఆయేషా తన భర్తని అసిస్టెంట్ అమ్మాయి మోసం చేసిందని చెప్పుకొచ్చింది. జానీ మాస్టర్ ను ఇరికించాలని ఒక ప్రణాళిక వేసుకొని ఆయనను జైలకు పంపించారని మాట్లాడటం తెలిసిందే. ఈ కేసు వివాదం ఇంకా కొనసాగుతూ ఉంది.

జానీ మాస్టర్ పై ఫోక్సో కేసులు నమోదయ్యాయి. ఆయన సదరు అమ్మాయిని మైనర్ గా ఉన్నప్పుడే అత్యాచారం చేసారని వార్తలు వస్తున్నాయి. తాజాగా జానీ మాస్టర్ కస్టడీ కోరుతూ కోర్టులో పిటీషన్ వేశారు నార్సింగి పోలీసులు. రంగారెడ్డి జిల్లా ఫోక్సో కోర్టుకి బదిలీ చేసి ఈ పిటీషన్ వేశారు పోలీసులు. ఈ కేసులో ఆయన్ని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే అనేక కీలక విషయాలు తెలుస్తాయని అన్నారు. దీనిలో భాగంగా జానీ మాస్టర్ ను వారం రోజుల పాటు కస్టడీలోకి అప్పగించాల్సిందిగా నార్సంగి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు జానీ మాస్టర్ కూడా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరి చూడాలి ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో. ఇక జానీ మాస్టర్ కస్టడీ కోరుతూ నార్సంగీ పోలీసులు కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

marsbahis girişjojobet