iDreamPost
android-app
ios-app

నేను బతికే ఉన్నా, అవకాశాలు ఇవ్వండి.. ఆశిష్ విద్యార్థి కామెంట్స్ వైరల్

  • Published Mar 26, 2024 | 6:41 PM Updated Updated Mar 26, 2024 | 6:41 PM

విలక్షణ నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్, మలయాళ, తమిళ ఇండస్ట్రీలో తన విలనీజంతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు ఆయన చేతిలో..

విలక్షణ నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్, మలయాళ, తమిళ ఇండస్ట్రీలో తన విలనీజంతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు ఆయన చేతిలో..

  • Published Mar 26, 2024 | 6:41 PMUpdated Mar 26, 2024 | 6:41 PM
నేను బతికే ఉన్నా, అవకాశాలు ఇవ్వండి.. ఆశిష్ విద్యార్థి కామెంట్స్ వైరల్

పోకిరీ సినిమాలో అతడి విలనిజం చూసి తిట్టుకోవడమే కాదూ.. భయపడ్డారు. ఇక అలా మొదలైంది మూవీలో కామెడీ విలన్‌గా మెప్పించి ప్రశంసలు పొందాడు విలక్షణ నటుడు ఆశిష్ విద్యార్థి. పాపే నా ప్రాణం చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఆశిష్..అనేక భాషల్లో నటించాడు. హిందీ, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్, మలయాళ, తమిళ ఇండస్ట్రీలో స్టార్ విలన్‌గా మారిపోయాడు. గుడుంబా శంకర్ సినిమాలో ఆశిష్ పండించిన నెగిటివ్ రోల్ ఆయనకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలను తెచ్చిపెట్టాయి. పోకిరీతో అతడి పేరు మార్మోగి పోయింది. చిరుత, అతిధి, తులసి, లక్ష్యం, కంత్రి, ఒంటరి, వరుడు, అదుర్స్, భాయ్, గ్రీకు వీరుడు, ఆటో నగర్ సూర్య, ఆగడు, కిక్ 2, నాన్నకు ప్రేమతో, ఆక్సిజన్, పంతం వంటి చిత్రాలు చేశాడు.

రైటర్ పద్మ భూషణ్ సినిమాలో హీరో తండ్రి పాత్రలో సరికొత్తగా కనిపించి మెప్పించాడు. 2023లో తన 56 ఏళ్ల వయస్సులో రూపాలి బరువా అనే మహిళను రెండో పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు ఆశిష్. అయితే ఒకప్పుడు అన్ని ఇండస్ట్రీలో వరుస పెట్టి సినిమాలు చేసిన ఈ వర్సటైల్ నటుడు.. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను బతికే ఉన్నాను. ఈ విషయాన్ని గుర్తించి నాకు కూడా అవకాశాలు ఇవ్వండి’ అంటూ కామెంట్స్ చేశాడు. ఎన్నో మంచి పాత్రలు చేసిన నటుడు ఇప్పుడు ఆపర్ల కోసం అడుక్కోవడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇంత మంచి నటుడ్ని ఇండస్ట్రీ మర్చిపోయిందా అంటూ మాట్లాడుకుంటున్నారు.

కాగా, ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆ వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు ఆశిష్. ‘నేను చాలా భాషలలో నటించాను. ఎన్నో సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. విలన్ రోల్స్‌లో మెప్పించాను. నన్ను ఇప్పటికీ అటువంటి పాత్రలే వరిస్తున్నాయి. నేను వేరే పాత్రలు కూడా చేయలగలను. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కొత్త రోల్స్ చేయగలను. ఈ కోణంలో కూడా నన్ను చూడాలనే అభిప్రాయంతో ఆ వ్యాఖ్యలు చేశాను’ అని అన్నారు ఆశిష్ విద్యార్థి. ప్రస్తుతం ఆయన ఫుడ్ వ్లాగ్స్, టూర్స్ వ్లాగ్స్ చేస్తూ యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేస్తున్నాడు. ఆయన చేతిలో ఆవేశం అనే మలయాళ ప్రాజెక్ట్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş