iDreamPost
android-app
ios-app

పోకిరీ సినిమాలోని లేడీ విలన్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

  • Published Apr 25, 2024 | 9:13 PM Updated Updated Apr 25, 2024 | 9:13 PM

2006లో మహేష్ బాబు-పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన పోకిరీ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడమే కాదు.. ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గ్యాంగ్ లో ఉండే బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

2006లో మహేష్ బాబు-పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన పోకిరీ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడమే కాదు.. ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గ్యాంగ్ లో ఉండే బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

  • Published Apr 25, 2024 | 9:13 PMUpdated Apr 25, 2024 | 9:13 PM
పోకిరీ సినిమాలోని లేడీ విలన్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

పూరి జగన్నాథ్.. కుర్రాళ్లకు ఆరాధ్య దర్శకుడు. పడే కొద్దీ బౌన్స్ బ్యాక్ అయ్యి రావడం అతడికి అలవాటు. మోటివేషనల్ స్పీకర్ కూడా. ఇప్పుడంటే.. సరైన హిట్స్ లేక చతికలపడ్డాడేమో కానీ..ఇండస్ట్రీకి హిట్స్ ఇవ్వడం.. రికార్డ్స్ బద్దలు కొట్టే మూవీస్ తెరకెక్కించడం అతడికేమీ కొత్తకాదు. బద్రీ నుండి లైగర్ మూవీ వరకు ఇదే రుజువు అయ్యింది. రవితేజ, మహేష్ బాబు, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, గోపిచంద్, రానా, పవన్ కళ్యాణ్, కళ్యాణ్ రామ్, వరుణ్ తేజ్, రామ్ పోతినేని, విజయ్ దేవర కొండ వంటి స్టార్స్ ఇతడితో వర్క్ చేసిన వారే. అతడి మూవీల్లో నటించాలని ప్రతి హీరో కోరుకున్నవాడే. రాజమౌళి, సుకుమార్ తర్వాత ఇండస్ట్రీలో వర్సటైల్ దర్శకుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

పూరీ, మహేష్ బాబు కాంబోలో వచ్చిన మూవీ పోకిరీ. అప్పట్లో రికార్డులు సృష్టించింది. మహేష్ బాబులో మరో కోణాన్ని వెలికి తీసిన సినిమా ఇది. 12 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. రూ. 70 కోట్లను వసూలు చేసింది. ఇక ఇందులో పాటలకు ఫిదా కానీ వారుండరు. మెలోడీ బ్రహ్మ.. మణి శర్మ అందించిన బాణీలకు మంత్ర ముగ్దులు కావాల్సిందే. ఇప్పటికి ఇవి చార్ట్ బస్టర్లే. 2006లో ఏప్రిల్ 27న రిలీజై.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇటీవల రీ రిలీజ్ చేస్తే రూ. 1.7 కోట్లు కొల్లగొట్టడం విశేషం. ఇక ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ . ప్రకాష్ రాజ్ విలన్. అతడి లవర్‌గా కనిపించిన నటి గుర్తుందా.. ఇప్పుడు ఆమె ఎంతలా మారిపోయిందో తెలుసా..?

ఈ సినిమాలో ఆమె ఉండేది కొద్ది సేపే అయినా.. ప్రేక్షకులకు మాత్రం బాగానే కనెక్ట్ అయ్యింది. ఇంతకు ఆమె ఎవరంటే.. జ్యోతి రానా. కానీ ఇప్పుడు శివ రానాగా చెలామణి అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత ఆమె రెండు, మూడు సినిమాల్లో అలరించింది., పూరీ చిత్రాలైన దేవుడు చేసిన మనుషులు, మోహబూబా సినిమాలతో పాటు సంపూర్ణేష్ హీరోగా తెరకెక్కిన దగఢ్ సాంబలో కనిపించింది. అలాగే హిందీలో కూడా నటించింది అమ్మడు. గండీ బాత్, షకీల వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సినిమాలు చేస్తున్నట్లు లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన ఫోటోలతో కుర్రకారు గుండెల్లో కాక రేపుతోంది జ్యోతి రానా. ఆమె ఫోటోలు చూస్తే మతి పోవడం ఖాయం.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet