iDreamPost
android-app
ios-app

ఉత్కంఠ రేపుతున్న ‘మంగళవారం’ ట్రైలర్.. బోల్డ్, ఇంటెన్స్ తో..

  • Author ajaykrishna Published - 02:38 PM, Sat - 21 October 23

హార్రర్ థ్రిల్లర్ జానర్ సినిమాలకు డిమాండ్ పెరిగిపోయింది. ఓవైపు కమర్షియల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతుండగా.. మరోవైపు హార్రర్ థ్రిల్లర్ మూవీస్ సత్తా చాటుతున్నాయి. ఇప్పుడదే థ్రిల్లర్ జానర్ లో వస్తున్న కొత్త సినిమా 'మంగళవారం'. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు.

ఇండస్ట్రీలో హార్రర్ థ్రిల్లర్ జానర్ సినిమాలకు డిమాండ్ పెరిగిపోయింది. ఓవైపు కమర్షియల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతుండగా.. మరోవైపు హార్రర్ థ్రిల్లర్ మూవీస్ సత్తా చాటుతున్నాయి. ఇప్పుడదే థ్రిల్లర్ జానర్ లో వస్తున్న కొత్త సినిమా ‘మంగళవారం’. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు. ఆర్ఎక్స్100 మూవీతో పాయల్ ని టాలీవుడ్ కి పరిచయం చేసిన అజయ్ భూపతి.. ఈసారి ఆమెతో ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. మంగళవారం అనే టైటిల్ తో ఆసక్తిరేపిన ఈ కాంబినేషన్.. ఇప్పటికే టీజర్ తో కాస్త బజ్ క్రియేట్ చేసింది.

ఇప్పుడు తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని.. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. అటు పాయల్ కి ల, ఇటు డైరెక్టర్ అజయ్ కి చాలా ఇంపార్టెంట్ మూవీ ఇది. ఇద్దరు కూడా తిరిగి సూపర్ హిట్ ట్రాక్ లో పడేందుకు.. ఇప్పుడీ మిస్టరీ థ్రిల్లర్ సబ్జెక్టుతో రెడీ అయిపోయారు. ఈ సినిమాకు కాంతార, విరూపాక్ష ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. హార్రర్ తో పాటు సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. మూడు నిముషాల నిడివి కలిగిన ట్రైలర్ లో.. ఆద్యంతం ఉత్కంఠ రేకేత్తిస్తూ.. వణుకు పుట్టించే సీన్స్ చాలా ఉన్నాయి.

ఓ ఊరిలో వింత సమస్య ఉన్నట్లు చూపిస్తూ.. చినప్రతాప రాజుకి, పక్కింటి మేరీకి మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని ఊరంతా అర్థం చేసుకోండి.. గోడలపై తెలియని వాళ్ళు రాస్తుంటారు. ఆ వ్యక్తి ఎవరు? అలాగే మంగళవారం రోజున వరుసగా జనాలు చనిపోతుంటారు.. అందుకు గల కారణాలు ఏంటనే లోపు.. ఊర్లోకి పాయల్ ఎంట్రీ.. ఆ తర్వాత పాయల్ రొమాన్స్ అన్ని కలిపి ఇంటెన్స్ సీన్స్ తో ట్రైలర్ ని ఇంటరెస్టింగ్ గా కట్ చేశారు. మొదట సింపుల్ గా కనిపించినా.. ఆ తర్వాత పాయల్ క్యారెక్టర్ చాలా బోల్డ్ గా మారుతుంది. మరి పాయల్ కి, ఊర్లో జరిగే సంఘటనలకు లింకేంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. దీనికి అజనీష్ మ్యూజిక్ సరిగ్గా సూట్ అయ్యింది. విరూపాక్ష తర్వాత అజనీష్ తెలుగులో చేస్తున్న సినిమా ఇది. అజయ్ భూపతి మార్క్ రొమాన్స్ చాలా ఉన్నట్లుంది. మరి మంగళవారం ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.