iDreamPost
android-app
ios-app

Actor Nani: సరిపోదా శనివారంకి.. పవన్ తో తలపోటు! నాని ఇరుక్కుపోయాడు!

  • Published Aug 12, 2024 | 3:23 PM Updated Updated Aug 12, 2024 | 3:23 PM

సోలో రిలీజ్ డేట్ దక్కించుకున్న సంతోషంలో ఉన్న సరిపోదా శనివారం మూవీ టీమ్ కు పవన్ కళ్యాణ్ నుంచి ఊహించని విధంగా సమస్య ఎదురైంది. ప్రస్తుతం నానికి పవన్ తలపోటుగా మారాడు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

సోలో రిలీజ్ డేట్ దక్కించుకున్న సంతోషంలో ఉన్న సరిపోదా శనివారం మూవీ టీమ్ కు పవన్ కళ్యాణ్ నుంచి ఊహించని విధంగా సమస్య ఎదురైంది. ప్రస్తుతం నానికి పవన్ తలపోటుగా మారాడు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

  • Published Aug 12, 2024 | 3:23 PMUpdated Aug 12, 2024 | 3:23 PM
Actor Nani: సరిపోదా శనివారంకి.. పవన్ తో తలపోటు! నాని ఇరుక్కుపోయాడు!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, న్యాచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. నానికి పోటీగా పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో, సోలో రిలీజ్ డేట్ దక్కినందుకు ఇటు మేకర్స్, అటు ఫ్యాన్స్ సంతోషపడ్డారు. కానీ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ తో తలపోటు ఎదురైంది నానికి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

నాని నటించిన సరిపోదా శనివారం మూవీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్ట్ 29న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఇక ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా జోరుగా చేపట్టారు. సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తన స్టైల్ కు భిన్నంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు సోలో రిలీజ్ డేట్ దక్కడంతో ఫ్యాన్స్, మేకర్స్ భారీ ఓపెనింగ్స్ పై కన్నేశారు. కానీ అనుకోని విధంగా పవన్ కళ్యాణ్ నానికి సమస్యగా మారాడు. అసలు విషయం ఏంటేంటే?

సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 1 అర్ధరాత్రి నుంచి స్పెషల్ షోలు వేయనున్నారు. ఇది సరిపోదా శనివారం మూవీపై తీవ్ర ప్రభావం చూపించనుంది. నాని మూవీ విడుదలైన రెండు రోజుల గ్యాప్ లోనే గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కావడం నిజంగా నానికి పెద్ద దెబ్బే. పైగా ఈసారి పవన్ ఫ్యాన్స్ కలెక్షన్లు గట్టిగా కొట్టాలని డిసైడ్ అయ్యారు. అదీకాక తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు మురారి రీ రిలీజ్ లో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. దాంతో ఈ రికార్డ్స్ తో పాటుగా దళపతి విజయ్ ‘గిల్లీ'(ఒక్కడు రీమేక్) రికార్డును బద్దలు కొట్టాలని భావిస్తున్నారు.

విజయ్ నటించిన గిల్లీ మూవీ 2004లో విడుదలైంది. రిలీజ్ అయ్యి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తమిళనాడులో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో ఏకంగా దాదాపు రూ. 23 కోట్లు కొల్లగొట్టింది ఈ మూవీ. భారతదేశ సినిమా చరిత్రలో ఇలా రీ రిలీజ్ అయిన చిత్రాల్లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన సినిమాగా విజయ్ ‘గిల్లీ’ నిలిచింది. ఇప్పుడు ఈ రికార్డుపై కన్నేశారు పవన్ ఫ్యాన్స్. ఇది నానికి పెద్ద తలపోటుగా మారింది. గబ్బర్ సింగ్ మళ్లీ వస్తుండటంతో సరిపోదా శనివారంకు థియేటర్లు ఎంతో కొంత తగ్గిపోతాయి. ఈ ప్రభావం కలెక్షన్లపై పడుతుంది అనడంలో సందేహం లేదు. ఈ విషయం కాస్త సగటు సినీ ప్రేక్షకులకు తెలియడంతో.. పాపం నాని ఇరుక్కుపోయాడు అంటూ ఫీల్ అవుతున్నారు. మరి గబ్బర్ సింగ్ రీ రిలీజ్ నాని మూవీపై ఏ మేరకు ప్రభావం చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss