iDreamPost
android-app
ios-app

Nani: గట్టిగానే ప్లాన్ చేస్తున్న నాని-శ్రీకాంత్ ఓదెల! ఇప్పుడిదే ట్రెండ్..

  • Published Aug 12, 2024 | 2:38 PM Updated Updated Aug 12, 2024 | 2:38 PM

నాని-శ్రీకాంత్ ఓదెల సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇది తెలిసి అభిమానులు నాని-శ్రీకాంత్ ఓదెల గట్టిగానే ప్లాన్ చేశారుగా.. అంటున్నారు. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే?

నాని-శ్రీకాంత్ ఓదెల సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇది తెలిసి అభిమానులు నాని-శ్రీకాంత్ ఓదెల గట్టిగానే ప్లాన్ చేశారుగా.. అంటున్నారు. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే?

  • Published Aug 12, 2024 | 2:38 PMUpdated Aug 12, 2024 | 2:38 PM
Nani: గట్టిగానే ప్లాన్ చేస్తున్న నాని-శ్రీకాంత్ ఓదెల! ఇప్పుడిదే ట్రెండ్..

న్యాచురల్ స్టార్ నాని, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే. దసరా బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబో రిపీట్ అవుతుండటంతో.. ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. పైగా రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. దాంతో ఇది నాని కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రంగా నిలవనుంది. ఇక ఈ మూవీ గురించి ఇప్పటికే పలు వార్తలు ఇండస్ట్రీని షేక్ చేయగా.. తాజాగా మరో క్రేజీ న్యూస్ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. నాని పాత్రకు సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది. ఇది తెలిసి అభిమానులు నాని-శ్రీకాంత్ ఓదెల గట్టిగానే ప్లాన్ చేశారుగా.. అంటున్నారు.

నాని-శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న మూవీని భారీగానే తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ నేపథ్యంలో 80వ దశకంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందబోతున్నట్లు ఇప్పటికే వార్తలు లీక్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన భారీ సెట్ వర్క్ ను డైరెక్టర్ దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడట. ఇక ఈ మూవీలో నాని పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. నాని ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నాడట. ఇందులో ఓ పాత్ర ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ఉంటుందట. కొత్త లుక్ లో కనిపించడానికి న్యూ మేకోవర్ ను ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో హీరో, డైరెక్టర్ గట్టిగానే ప్లాన్ చేశారు అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజమైన నాయకుడికి ఐడెంటిటి అవసరం లేదనే స్లోగన్ పై మేకర్స్  స్టోరీని బందోబస్తుగా ప్లాన్ చేశారట. కథలో ఊహించని వేరియేషన్స్ ఉన్నాయట, అందుకే నాని లుక్ కూడా డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు సమాచారం.

కాగా.. ప్రస్తుతం ఇండస్ట్రీలో డ్యూయెల్ రోల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే దేవర మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, గేమ్ ఛేంజర్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ద్విపాత్రాభినయాలు చేస్తున్న విషయం తెలియనిది కాదు. ఇక ఇప్పుడు న్యాచురల్ స్టార్ వంతు వచ్చింది. మరి డ్యూయెల్ రోల్ లో నాని ఏ మేరకు అదరగొడతాడో చూడాలంటే సినిమా వచ్చిందాక ఆగాల్సిందే. ప్రస్తుతం నాని నటించిన ‘సరిపోదా శనివారం’ ఆగస్ట్ 29న రిలీజ్ అవ్వబోతోంది. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. మరి న్యాచురల్ స్టార్ ద్విపాత్రాభినయం చేస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişajaxbet girişgrandpashabet