iDreamPost
android-app
ios-app

మొదట్లో ఫట్.. రీరిలీజ్​లో​ హిట్! ఇంత ప్రేమ అప్పుడు చూపించలేదే..?

  • Published Feb 16, 2024 | 3:36 PM Updated Updated Feb 16, 2024 | 3:36 PM

రీరిలీజ్ ట్రెండ్​ ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. అయితే అప్పట్లో ఫట్ అయిన మూవీస్ ఇప్పుడు హిట్ అవడం చర్చనీయాంశంగా మారింది.

రీరిలీజ్ ట్రెండ్​ ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. అయితే అప్పట్లో ఫట్ అయిన మూవీస్ ఇప్పుడు హిట్ అవడం చర్చనీయాంశంగా మారింది.

  • Published Feb 16, 2024 | 3:36 PMUpdated Feb 16, 2024 | 3:36 PM
మొదట్లో ఫట్.. రీరిలీజ్​లో​ హిట్! ఇంత ప్రేమ అప్పుడు చూపించలేదే..?

తెలుగు నాట ఇప్పుడు రీరిలీజ్​ల ట్రెండ్ నడుస్తోంది. గత ఏడాది కాలంలో చాలా పాత సినిమాలు మళ్లీ విడుదలయ్యాయి. ఎప్పుడో ఆగిపోయిన రీరిలీజ్ ట్రెండ్ మళ్లీ స్టార్ట్ అవడం మంచి విషయమే. ప్రేక్షకులు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి, కల్ట్ మూవీస్​ను బిగ్ స్క్రీన్​పై ఇంకోసారి ఎంజాయ్ చేయాలనుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. ఇవి ఆయా సినిమాల్లో నటించిన స్టార్ల అభిమానులతో పాటు మూవీ లవర్స్​కు కూడా నోస్టాల్జిక్​ మూమెంట్స్​ను అందిస్తాయి. అయితే రీరిలీజ్​ల్లో ఎక్కువ మటుకు గతంలో సూపర్ డూపర్ హిట్స్​గా నిలిచిన చిత్రాలే ఉన్నాయి. బ్లాక్​బస్టర్ అయిన సినిమాలనే మొదట్లో రీరిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు గతంలో ఫ్లాప్ అయిన ఫిల్మ్స్​ను కూడా తిరిగి విడుదల చేస్తున్నారు. ఆశ్చర్యకరంగా ఇవి రీరిలీజ్​లో బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను సాధిస్తున్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆరెంజ్’, స్టార్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తీసిన ‘ఈ నగరానికి ఏమైంది’తో పాటు సిద్ధార్థ్ ‘ఓయ్’ రీరిలీజ్​లో సంచలనాలు సృష్టించాయి. ముఖ్యంగా ‘ఈ నగరానికి ఏమైంది’ గురించి స్పెషల్​గా చెప్పుకోవాలి. ఐదేళ్ల కింద వచ్చిన ఈ ఫిల్మ్ అప్పట్లో యావరేజ్​గా నిలిచింది. కానీ రీరిలీజ్​లో మాత్రం మొదటి రిలీజ్​ కంటే భారీగా కలెక్ట్ చేసి లాభాల్లోకి దూసుకెళ్లింది. ఈ సినిమా రీరిలీజ్​కు అసలు టికెట్లే దొరకలేదు. ఆన్​లైన్​లో పెట్టగానే అన్నీ బుక్ అయిపోయాయి. ‘ఆరెంజ్’ చిత్రాన్ని కూడా చరణ్​ ఫ్యాన్స్​తో పాటు యూత్ ఆడియెన్స్​ అంతా తెగ ఎంజాయ్ చేశారు. థియేటర్​లో కుర్చీలపై ఎక్కి ఈలలు వేస్తూ, గోలలు చేస్తూ తెగ సందడి చేశారు. ఇటీవల రీరిలీజైన ‘ఓయ్’కు కూడా ప్రేక్షకుల నుంచి ఇలాంటి రెస్పాన్సే వస్తోంది. ఈ మూవీ ప్రదర్శిస్తున్న ఓ థియేటర్​లో ఒకమ్మాయి చేసిన డ్యాన్స్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

‘ఆరెంజ్’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఓయ్’.. ఈ సినిమాలు మొదటిసారి రిలీజైన టైమ్​లో కమర్షియల్​గా అంత వర్కౌట్ కాలేదు. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నా, మంచి ప్రయత్నాలు అంటూ అప్లాజ్ తెచ్చుకున్నా మేకర్స్​కు నష్టాలు మిగిల్చాయి. కానీ రీరిలీజ్​లో మాత్రం ఫుల్ ప్రాఫిట్స్​ను అందించాయి. దీనికి ఈ మూడు సినిమాల్లోని పాటలు చార్ట్​ బస్టర్స్​గా నిలవడం, మంచి కామెడీ సీన్స్, యూత్​కు నచ్చే రొమాంటిక్ సీన్స్ ఉండటం ఒక కారణమని చెప్పొచ్చు. ఇవి రిలీజైన తర్వాత కాలంలో వీటిని టీవీల్లో చాలా మంది ఎంజాయ్ చేశారు.

ఏళ్లు గడిచే కొద్దీ వైన్​కు విలువ పెరిగినట్లే క్రమంగా ‘ఆరెంజ్’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఓయ్’ లాంటి సినిమాలకు కల్ట్ వ్యాల్యూ అంతకంత పెరుగుతూ పోయింది. అందుకే వీటి రిలీజ్​లు మిస్సయిన వారు, బిగ్ స్క్రీన్​లో మరోమారు ఎక్స్​పీరియెన్స్​ చేద్దామనుకున్న వారు థియేటర్లకు పోటెత్తారు. ఇదే ఆదరణ అప్పట్లో దక్కి ఉంటే ఆ చిత్రాలు, వాటిల్లో నటించిన వారి ఫేట్ వేరేలా ఉండేది. ముఖ్యంగా ‘ఓయ్’ హిట్ అయి ఉంటే సిద్ధార్థ్ మరికొంత కాలం నిలదొక్కుకునేవారు. పైసినిమాల్లో ఉన్న మ్యాజిక్, మ్యూజిక్, డైలాగ్స్, డాన్స్, కామెడీ.. ఇలా చాలా విషయాలు క్రమంగా కల్ట్​గా మారి ఆడియెన్స్​ను థియేటర్లకు రప్పిస్తున్నాయని చెప్పొచ్చు. మరి.. కొన్ని కల్ట్ మూవీస్ మొదట్లో ఫట్ అవడం, ఆ తర్వాత రీరిలీజ్​లో హిట్టవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Nellore Neeraja: ఎప్పుడూ నవ్వించే నెల్లూరు నీరజ తొలిసారి కన్నీరు! కారణం?