టాలీవుడ్‌కు జులై నెల బాగా కలిసొస్తోంది. ‘సామజవరగమన’, ‘బేబీ’ లాంటి చిన్న చిత్రాలు ఈ నెలలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. బాక్సాఫీస్‌ను ఈ రెండు సినిమాలు షేక్ చేశాయి. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ‘సామజవరగమన’ హీరో శ్రీవిష్ణు కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. విడుదలకు ముందే మంచి హైప్ తెచ్చుకున్న ‘బేబీ’ మూవీ సక్సెస్ఫుల్ రన్‌ను కొనసాగిస్తోంది. ఈ చిత్రం రూ.50 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. జోరు వానల్లోనూ ‘బేబీ’ని చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు వస్తుండటం విశేషం. ఈ నెలాఖర్లో మరో సినిమా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఆ మూవీనే ‘బ్రో’.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలసి యాక్ట్ చేస్తున్న చిత్రమే ‘బ్రో’. ప్రముఖ దర్శక, నటుడు సముద్రఖని తెరకెక్కించిన ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ సినిమా జులై 28న రిలీజ్ కానుంది. పవర్ స్టార్ మూవీ వస్తుండటంతో ఆయనకు పోటీగా ఒకే ఒక చిన్న చిత్రం తప్ప మరే సినిమా రావడం లేదు. అయితే ఓటీటీ ఆడియెన్స్‌కు మాత్రం ఈ వారమంతా పండగేనని చెప్పాలి. ప్రేక్షకులను మరింతగా అలరించేందుకు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు రెడీ అవుతున్నాయి. వాటిల్లో తమిళ చిత్రం ‘మామన్నన్’ మాత్రం కాస్త స్పెషల్ అనే చెప్పాలి. విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా మంచి అప్లాజ్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలో ఏ స్థాయిలో వ్యూస్ తెచ్చుకుంటుందో చూడాలి. ఈ సినిమాతో పాటు ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
ఆషికానా సీజన్ 4 (హిందీ వెబ్ సిరీస్) – జులై 24
డ్రీమ్ (కొరియన్ మూవీ) – జులై 25
ది విచర్ సీజన్ 3 – జులై 26
మామన్నన్ (తమిళం/తెలుగు) – జులై 27
హిడెన్ స్ట్రైక్ (ఇంగ్లీష్ మూవీ) – జులై 27
హ్యాపీనెస్ ఫర్ బిగినర్స్ (ఇంగ్లీష్ మూవీ) – జులై 27
పారడైజ్ (ఇంగ్లీష్ మూవీ) – జులై 27
హౌ టు బికమ్ ఏ కల్ట్ లీడర్ – జులై 28
ది ట్రైలర్ సీజన్ 2 (టర్కిష్ చిత్రం) – జులై 28
ట్విస్టెడ్ మెటల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – జులై 28
గుడ్ ఒమెన్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ మూవీ) – జులై 28
లయనెస్ (ఇంగ్లీష్ మూవీ) – జులై 23
కాల్‌కూట్ (హిందీ చిత్రం) – జులై 27
జస్టిస్ లీగ్: వార్ వరల్డ్ (యానిమేషన్ చిత్రం) – జులై 23
ట్రాన్స్ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ (ఇంగ్లీష్ మూవీ) – జులై 26
ది ఫ్లాష్ ( ఇంగ్లీష్ మూవీ) – జులై 27
కొళ్ల (మలయాళ చిత్రం) – జులై 27