iDreamPost
android-app
ios-app

బాలయ్య, ప్రభాస్ మీద పెట్టుబడి పనికొచ్చింది

  • Published Jan 01, 2024 | 12:18 PM Updated Updated Jan 02, 2024 | 12:30 PM

ఎప్పుడోకప్పుడు నలుగురికి కాస్తంత సాయం చేస్తే.. ఆ పుణ్యం ఊరికే పోదు. ఏదో ఒక రూపంలో తిరిగి వచ్చి.. మనకు మంచే చేస్తుంది అని నిరూపించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీ విషయంలో ఇదే జరుగుతుంది. ఈ మూవీని సంక్రాంతి బరిలో పెద్ద సినిమాల మధ్య విడుదల చేస్తున్నాడు దర్శకుడు. ఈ సందర్భంగా ప్రమోషన్లను షురు చేశాడు.

ఎప్పుడోకప్పుడు నలుగురికి కాస్తంత సాయం చేస్తే.. ఆ పుణ్యం ఊరికే పోదు. ఏదో ఒక రూపంలో తిరిగి వచ్చి.. మనకు మంచే చేస్తుంది అని నిరూపించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీ విషయంలో ఇదే జరుగుతుంది. ఈ మూవీని సంక్రాంతి బరిలో పెద్ద సినిమాల మధ్య విడుదల చేస్తున్నాడు దర్శకుడు. ఈ సందర్భంగా ప్రమోషన్లను షురు చేశాడు.

  • Published Jan 01, 2024 | 12:18 PMUpdated Jan 02, 2024 | 12:30 PM
బాలయ్య, ప్రభాస్ మీద పెట్టుబడి పనికొచ్చింది

కొన్ని సందర్భాల్లో సినీ పరిశ్రమలోనే కాదు, బయట ప్రపంచంలో కూడా మనుషుల పట్ల మనం చేసే సేవలు, పనులు తర్వాతి రోజులలో చక్కటి ఫలితాలనిచ్చి, ఊహించని పర్యవసానాలకు సోపానాలను నిర్మిస్తాయి. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మేనని చెప్పడానికి ఏ మాత్రం సందేహించనక్కర్లేదు. ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబోలో సూపర్ మేన్ కాన్సెప్ట్ తో రూపొందిన హనుమాన్ సినిమా రేపటి సంక్రాంతి బరిలో దిగి, 14వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు భారీ స్థాయిలో రాబోతోంది. మిగిలిన పెద్ద సినిమాల ఒత్తిడిలో హనుమాన్ నలిగిపోయి, విడుదల తేదీ విషయంలో రాజీ పడాల్సి వస్తుందేమోనన్న అనుమానాలు ఒక టైంలో అందరికీ వచ్చాయి గానీ, మొత్తానికి హనుమంతుడి దీవెనలు గట్టిగానే పనిచేశాయి.

రామమందిరం జనవరి 22 వతేదీన ప్రారంభం కాబోతుండగా, రామభక్తుడి చరితార్ధతను సాధించి, పుణ్యచరితుడిగా, సచ్చరిత్రుడిగా పురాణేతిహాసాల్లో సమున్నత స్థానాన్ని పొందిన శ్రీమద్ ఆంజనేయ స్వామి పేరిట తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న హనుమాన్ చిత్రానికి అన్నీ మంచి శకునాలే ఎదురవుతున్నాయి. ట్రైలర్ రిలీజ్ కాకముందే ఒక రేంజ్ లో ఉన్న హనుమాన్ పైన అంచనాలు, ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆకాశాన్ని అంటుకున్నాయి. ఇప్పుడు మరో వార్త హనుమాన్ చిత్రం విడుదలకు ముందు సంచలనం రేపుతోంది. అదే యువరత్న బాలక్రిష్ణ, ఆలిండియా రెబల్ స్టార్ బాహుబలి ప్రభాస్.. ఇద్దరూ హనుమాన్ ప్రమోషన్లకు రాబోతున్నారన్న వార్త మామూలు లుక్ తీసుకురాలేదు హనుమాన్ సినిమాకి.

అయితే ఇందులో ప్రశాంత్ వర్మ లోగడ చేసిన మంచి పనులిప్పుడు అతనికి మంచి లాభం తీసుకొచ్చింది. బాలయ్య అన్ స్టాపబుల్ ప్రోగ్రాంకి సెట్ వర్క్ డిజైన్ చేయడమే కాదు, ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రశాంత్ తనవైన సేవలనందించడం కూడా ప్రశాంత్ కిప్పుడు బ్రహ్మాండంగా పనికొచ్చింది. ప్రభాస్, బాలయ్య ఇద్దరూ హనుమాన్ ప్రమోషన్లను భుజాలకెత్తుకోబోతున్నారు. ప్రస్తుతం ఉన్న రిపోర్టుల ప్రకారం జనవరి 3న గానీ, 7న గానీ తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రశాంత్ వర్మ ప్రణాళిక చేస్తున్న హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఈ ఇద్దరు మల్టీ స్టార్స్ వస్తే హనుమాన్ ప్రీ రిలీజ్ బజ్ ఏ రేంజ్లో దద్దరిల్లిపోతుందో ఊహించండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom