iDreamPost
android-app
ios-app

NTR30 జూనియర్ సినిమాల వరస మారింది

  • Published May 19, 2022 | 11:30 AM Updated Updated May 19, 2022 | 11:30 AM
  • Published May 19, 2022 | 11:30 AMUpdated May 19, 2022 | 11:30 AM
NTR30 జూనియర్ సినిమాల వరస మారింది

అరవింద సమేత వీర రాఘవ చేసిన తర్వాత మూడేళ్ళకు పైగా గ్యాప్ తో ఇచ్చిన ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ కావడం జూనియర్ ఎన్టీఆర్ కు బాక్సాఫీస్ పరంగా పెర్ఫార్మన్స్ పరంగా గొప్ప సంతృప్తి ఇచ్చింది. అయితే అది రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న మల్టీ స్టారర్ కావడంతో అభిమానులు తమ హీరోని సోలో సబ్జెక్టులో చూడాలని ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టే లైనప్ రెడీ అవుతోంది. రేపు తారక్ పుట్టినరోజు సందర్భంగా రెండు ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. మొదటిది కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే యాక్షన్ ఎంటర్ టైనర్. రెండోది ప్రకటనకే సెన్సేషన్ సృష్టించిన ప్రశాంత్ నీల్ టేకప్ చేయబోయే భారీ ప్యాన్ ఇండియా మూవీ.

నిజానికి కొరటాల తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో జూనియర్ సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది. పెద్ది టైటిల్ తో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో స్క్రిప్ట్ కూడా రెడీ గా ఉందన్నారు. కానీ ప్రస్తుతానికది హోల్డ్ లో పెట్టినట్టు సమాచారం. పైన రెండు అయ్యాక చేయాలంటే మాత్రం బుచ్చిబాబు హ్యాపీగా ఇంకో సినిమా చేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు ఖాళీగా ఉన్న స్టార్ హీరో అయితే ఎవరూ లేరు. మరి తను ఏం చేస్తాడన్నది ఆసక్తికరం. సలార్ పూర్తి చేయడానికి ప్రశాంత్ నీల్ ఎంత టైం తీసుకుంటాడో తెలియదు. తారక్ కొరటాలలు ఎంత లేదన్నా తమ ఆరు నెలలకు పైగానే తమ ప్రాజెక్టులో బిజీ అయిపోతారు. ఆలోగా సలార్ ఫినిష్ అవుతుంది.

మొత్తానికి అఫీషియల్ క్లారిటీ రేపు వచ్చేస్తుంది. గ్యాప్ ఎక్కువైపోవడంతో తారక్ ఇకపై వేగంగా సినిమాలు చేసే ప్రణాళికతో ఉన్నాడు. క్యాన్సిల్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా మళ్ళీ ఉంటుందో లేదో తెలియదు. ఇప్పుడీ ముగ్గురు దర్శకులతో కమిట్ మెంట్స్ పూర్తి చేసేలోగా 2024 వచ్చేస్తుంది. ఆలోగా ఎవరితో చేయాలనేది డిసైడ్ చేసుకోవచ్చు. రేపటి బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. దానికి తగ్గట్టే ఆర్ఆర్ఆర్ ఓటిటి వెర్షన్ రేపు జీ5 ద్వారా విడుదల కానుంది. దాంతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో తారక్ ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ ఆది స్పెషల్ షోలతో సంబరాలు ఓ రేంజ్ లో జరుపుకోనున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss