iDreamPost
android-app
ios-app

Devara Movie: ఆ విషయంలో NTR మల్టీటాలెంట్ ! అదే దేవరకు ప్లస్!

  • Published Sep 26, 2024 | 4:50 PM Updated Updated Sep 26, 2024 | 4:50 PM

Devara Movie: మరికొన్ని గంటల్లో దేవర సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో తారక్ కు సంబంధించిన ఓ విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Devara Movie: మరికొన్ని గంటల్లో దేవర సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో తారక్ కు సంబంధించిన ఓ విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Published Sep 26, 2024 | 4:50 PMUpdated Sep 26, 2024 | 4:50 PM
Devara Movie: ఆ విషయంలో NTR మల్టీటాలెంట్ ! అదే దేవరకు ప్లస్!

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీర్ మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనున్నాడు. వరల్డ్ వైడ్ గా దేవర గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. సోలో హీరోగా తారక్ ను స్ర్ర్కీన్ పై  చూసి దాదాపు ఆరేళ్లు అయింది. దీంతో  ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రియులు దేవర కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చివరగా అరవింద సమేత సినిమాలో తారక్ సోలో గా కనిపించాడు. ఆ తరువాత రాజమోళీ కస్టడీలోకి వెళ్లిపోయారు. దాదాపు మూడేళ్ల తరువాత ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తారక్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి తారక్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ట్రిపుల్ ఆర్ సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏకంగా ఆస్కార్ అవార్డునే టాలీవుడ్ కు అందించింది ఈ సినిమా. ఈ సినిమాతోనే తారక్ గ్లోబల్ స్టార్ గా మారారు. ఈ నేపథ్యంలోనే సోలో గా దేవర సినిమాతో ఎన్టీఆర్ ప్రేక్షుకల ముందుకు రానున్నారు. ఈ క్రమంలోనే తారక్ కు సంబంధించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ విషయంలో తారక్ మల్టీ టాలెంట్ అని, అదే దేవర సినిమాకు ప్లస్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. మరి.. ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

మరికొన్ని గంటల్లో దేవర సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అంతేకాక దేవర విడుదలకు ముందే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఘనవిజయం సాధించినా కూడా ఎన్టీఆర్ అభిమానులకు ఒకటే లోటు. ఎన్టీఆర్ సోలో హీరోగా ఆ రేంజ్ హిట్ అందుకోవాలని కోరుకున్నారు.  దేవర విజయం పక్కా అని తారక్ అభిమానులతో పాటు సినీ ప్రియులు అభిప్రాయ పడుతున్నారు. అందుకు తారక్ లోని ఓ టాలెంట్ ప్లస్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఎన్టీఆర్ నటించిన దేవర ఇండియా లో 5 భాషలలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఒక్క మలయాళంలో తప్ప..తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ వంటి నాలుగు భాషల్లో ఎన్టీఆర్ సొంతంగా డబ్బింగ్ చెప్పారు. ఎన్టీఆర్ లో వున్న ఈ మల్టీ టాలెంట్ చూసి ఆయన అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఫిదా అవుతున్నారు.  ఎన్టీఆర్ కి ప్రతి ఇండస్ట్రీ లో సెపెరేట్ ఫ్యాన్ బేస్ వుంది. అంతేకాక ఆయన సినిమాలని ఎంతో ఇష్టపడే ఫ్యాన్స్  అన్ని ఇండస్ట్రీల్లో వున్నారు. దీంతో తమ భాషల్లో ఎన్టీఆర్ వాయిస్ లో వచ్చే ఆ వైబ్రేషన్ ఫ్యాన్స్ కి మంచి కిక్కెంచడం పక్కా.

అలానే దేవర లో ఎన్టీఆర్ డైలాగ్స్, స్టెప్స్,యాక్టింగ్  అభిమానులకి పూనకాలు తెప్పిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. సాధారణంగా చాలా వరకు ఓ హీరో సినిమా మరో భాషలోకి డబ్ అవుతున్నప్పుడు వేరే వాళ్లులు వాయిస్ ఇస్తారు. చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే సొంతంగా డబ్బింగ్ చెప్తారు. ఒకవేళ చెప్పిన కూడా ఒకటి, రెండు భాషల్లో మాత్రమే చెప్పగలరు. కానీ తారక్ ఏకంగా నాలుగు భాషల్లో తన సొంత వాయిస్ ను దేవరకు అందించారు. దీంతో అన్ని భాషల్లో ఉండే  తారక్ ఫ్యాన్స్, మూవీ లవర్స్  కి ఇది కిక్ ఇస్తుంది.

దేవర సినిమాకు తారక్ లోని ఈ మల్టీ టాలెంటే ప్లస్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.  ఇక దేవర సినిమా గురించి మాట్లాడుకుంటే..విడుదలకు ముందే అనేక రికార్డులను కొల్లగొట్టింది. ఇక విడుదలై..మిగిలిన రికార్డులను బద్దలు కొట్టడమే మిగిలింది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని థియేటర్స్ లో ఆల్ టైమ్ రికార్డును, నార్త్ అమెరికాలోని ప్రీ సెల్స్ రికార్డును దేవర తన ఖాతలో వేసుకుంది. ఈ ఊపు చూస్తుంటే..థియేటర్లో దేవర ఊచకోత పక్కా అనిపిస్తుంది. మొత్తంగా ఎన్టీఆర్ లోని ఆ మల్టీ టాలెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibom