iDreamPost
android-app
ios-app

ముంబై మెట్రోలో హీరోయిన్ డ్యాన్స్.. వీడియో వైరల్‌

  • Published Mar 09, 2024 | 11:21 AMUpdated Mar 09, 2024 | 11:21 AM

Heroine Dance in Metro: ఇటీవల మెట్రోలో కొంతమంది ప్రయాణికులు రీల్స్ చేస్తూ నానా హంగామా సృష్టిస్తున్నారు. సామాన్యులే కాదు... అప్పుడప్పుడు మెట్రోలో సెలబ్రెటీలు కూడా సందడి చేస్తున్నారు.

Heroine Dance in Metro: ఇటీవల మెట్రోలో కొంతమంది ప్రయాణికులు రీల్స్ చేస్తూ నానా హంగామా సృష్టిస్తున్నారు. సామాన్యులే కాదు... అప్పుడప్పుడు మెట్రోలో సెలబ్రెటీలు కూడా సందడి చేస్తున్నారు.

  • Published Mar 09, 2024 | 11:21 AMUpdated Mar 09, 2024 | 11:21 AM
ముంబై మెట్రోలో హీరోయిన్ డ్యాన్స్..  వీడియో వైరల్‌

ఈ మద్య సినిమా ప్రమోషన్లు చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు. కొత్త సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ధియేటర్లో రిలీజ్ అయ్యే వరకు ఎదో ఒక రకంగా తమ సినిమాలు ప్రమోషన్ చేస్తూ ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ భారీ ఎత్తున జరుపుతున్నారు. తమ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి పెద్ద హీరోలను ఆహ్వానిస్తున్నారు. ఈవెంట్ కి వచ్చిన సీనియర్ హీరోలు కొత్త దర్శకులును, నటీనటులను ఎంకరేజ్ చేస్తూ వారికి మంచి భవిష్యత్ ఉండాలని దీవిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ లో కొత్త దర్శకులు, నటీనటుల హవా కొనసాగుతుంది. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి తన సహనటులతో మెట్రోలో డ్యాన్స్ తో దుమ్మురేపింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ అందాల తారా నోరా ఫతేహి, దివ్యేందు శర్మ కలిసి తమ చిత్రం ‘మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్’ను మెట్రోలో ప్రమోట్ చేసారు. ఈ మూవీతో కునాల్ కెమ్మూ నూతన దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఇటీవల ‘మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్’ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూసి కరీనా కపూర్ ఖాన్, విక్కీ కౌశల్, హన్సల్ మెహతా తదితరులు ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం నోరా ఫతేహి, దివ్యేందు శర్మ మరికొంత మంది కలిసి ఎప్పుడూ రద్దీగా ఉండే ముంబై మెట్రోలో ‘బేబీ బ్రింగ్ ఇట్ ఆన్’ పాటపై ఫ్యాన్స్ తో డ్యాన్స్ చేశారు. ‘బేబీ బ్రింగ్ ఇట్ ఆన్’ పాటను అజయ్-అతుల్ ద్వయం కంపోజ్ చేశారు.

మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్ కథ విషయానికి వస్తే.. చిన్నప్పటి నుంచి ఒక్కసారైనా గోవాలో ఎంజాయ్ చేయాలనే కలలు కనే ముగ్గురు యువకులు పెద్దైన తర్వాత మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్ లో గోవాకి వెళ్తుంటారు. ఆ సమయంలో ఆ యువకులు అనుకోకుండా కొన్ని చిక్కుల్లో పడతారు.. అందులో నుంచి ఎలా బయటపడ్డారు అన్నదే చిత్ర కథ. ఈ మూవీ ఆద్యంతం నవ్వులు పూయించే విధంగా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ‘మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్’ మార్చి 22న విడుదల కానుంది. ఈ మూవీ రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. ఇదిలా ఉంటే నోరా ఫతేహి ఇటీవల విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘క్రాక్-జీతేగా టు జియేగా’లో తన నటనకు అభిమానుల ప్రశంసలు పొందింది. ప్రస్తుతానికి నోరా ఫతేహి మెట్రోలో చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Sunny (@bollywood_2025)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి