iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: వాయిదాల్లేవ్.. చెప్పిన టైమ్ కే సలార్ రిలీజ్!

  • Author ajaykrishna Updated - 11:40 AM, Sat - 2 September 23
  • Author ajaykrishna Updated - 11:40 AM, Sat - 2 September 23
బ్రేకింగ్: వాయిదాల్లేవ్.. చెప్పిన టైమ్ కే సలార్ రిలీజ్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ రిలీజ్ విషయంలో ఫ్యాన్స్ ఎంతగానో కంగారు పడిపోతున్నారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ మూవీని.. కేజీఎఫ్, కాంతార ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించారు. కాగా.. సెప్టెంబర్ 28న సలార్ ని వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ వచ్చారు మేకర్స్. ఇక రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్ అప్డేట్స్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సలార్ నుండి ఇప్పటిదాకా పోస్టర్స్, టీజర్ తప్పితే ఒక్క సాంగ్ కూడా రిలీజ్ కాలేదు. సరే.. సాంగ్స్ రాకపోయినా పర్లేదు ట్రైలర్ వస్తే చాలు అని ఫ్యాన్స్ అంతా ఆశగా వెయిట్ చేస్తున్నారు.

ఇలాంటి తరుణంలో ట్రైలర్ గురించి కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. దీంతో రిలీజ్ కి ఇంకా నాలుగు వారాల టైమ్ మాత్రమే ఉంది. ఇంతలో సలార్ వాయిదా పడుతోంది అంటూ వార్తలు పుట్టుకొచ్చేశాయి. సోషల్ మీడియాలో నిన్నటి నుండి ఇదే రచ్చ. సలార్ వాయిదా పడుతోంది.. ఇంకా సీజీ వర్క్ పూర్తి కాలేదని కొందరు చెబుతుంటే.. రిలీజ్ వాయిదా వేద్దామనే మేకర్స్ ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదని ఇంకొందరు చెబుతున్నారు. బయట ప్రచారంతో పాటు మేకర్స్ కూడా కనీసం ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ లోను సందేహాలు మొదలైపోయాయి. సలార్ రిలీజ్ గురించి ఆల్రెడీ ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్స్ ఓ రేంజ్ లో నడుస్తున్నాయి.

ఒక్కసారిగా సలార్ వాయిదా అనేసరికి ఫ్యాన్స్ తో పాటు టికెట్స్ బుక్ చేసుకున్న ఆడియన్స్ కూడా షాక్ అయిపోయి.. నిరాశకు లోనయ్యారు. కానీ.. సలార్ గురించి జరుగుతుంది అంతా బయట ప్రచారమే గానీ.. మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఓపికగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అభిమానుల నిరీక్షణకు ఫలితంగా.. సలార్ ఫ్యాన్స్ కి పాజిటివ్ న్యూస్ వినిపిస్తోంది. సలార్ రిలీజ్ లో ఎలాంటి మార్పులు లేవని.. చెప్పినట్లుగానే సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతుందని ప్రొడ్యూసర్స్ చెప్పారని తెలుస్తోంది. అందుకు సంబంధించి విషయాన్నీ సోషల్ మీడియాలో ఫిల్మ్ క్రిటిక్ ట్వీట్ వేసి చెప్పారు. దీంతో సలార్ వాయిదా లేదని తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరి సలార్ రిలీజ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetMariobetMadridbetbetciomatbet girişjojobetpalazzobetgrandpashabetgrandpashabetJojobet Girişcasibom girişgrandpashabetbetasusCasibom GirişJojobetcasibomcasibomjojobetcasibom girişjojobet girişcasibomJojobetGrandpashabetGrandpashabet