iDreamPost
android-app
ios-app

అలాంటి పాత్ర పోషిస్తే తప్పేముంది? అంటూ నివేద థామస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  • Published Sep 01, 2024 | 6:37 PM Updated Updated Sep 01, 2024 | 6:37 PM

Nivetha thomas comments About Her Character In Film: నివేద థామస్ నుంచి చాలా కాలం తర్వాత ఓ ఇంట్రెస్టింగ్ మూవీ వస్తుంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ అయ్యి ఉండాలి కానీ.. కొన్ని కారణాల వలన పోస్టుపోన్ అయింది. ఈ క్రమంలో తాజాగా నటించిన సినిమా గురించి ముచ్చటిస్తూ.. తన క్యారెక్టర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Nivetha thomas comments About Her Character In Film: నివేద థామస్ నుంచి చాలా కాలం తర్వాత ఓ ఇంట్రెస్టింగ్ మూవీ వస్తుంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ అయ్యి ఉండాలి కానీ.. కొన్ని కారణాల వలన పోస్టుపోన్ అయింది. ఈ క్రమంలో తాజాగా నటించిన సినిమా గురించి ముచ్చటిస్తూ.. తన క్యారెక్టర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

  • Published Sep 01, 2024 | 6:37 PMUpdated Sep 01, 2024 | 6:37 PM
అలాంటి  పాత్ర పోషిస్తే తప్పేముంది? అంటూ నివేద థామస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అదేంటో తెలియదు కానీ కొంతమంది హీరోయిన్స్ కేవలం కొన్ని సినిమాలు తీసి.. కెరీర్ మంచిగా ఉందనుకునే సమయానికి కనుమరుగైపోతూ ఉంటారు. వీరిలో నివేద థామస్ కూడా ఒకరు. 2016 లో జెంటిల్మాన్ సినిమాతో అందరికి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ కు విపరీతమైన క్రేజ్ లభించింది. ఇక ఆ తర్వాత కొంతకాలం వరుస సినిమాలతో బిజీ అయిపొయింది ఈ అమ్మడు. కెరీర్ బాగానే నడుస్తుంది అనుకున్న సమయంలో సడెన్ గా మాయం అయిపొయింది. ఇక ఇప్పుడు సరికొత్త లుక్ లో .. ప్రేక్షకుల ముందుకు వచ్చి షాక్ ఇచ్చింది. నివేద థామస్ తాజాగా నటిస్తున్న సినిమా ’35 చిన్న కథ కాదు’ . తాజాగా ఈ సినిమా గురించి ముచ్చటిస్తూ.. అందులో తన క్యారెక్టర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

నివేద థామస్ , విశ్వదేవ్‌ ఆర్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రలలో నటించిన 35 చిన్న కథ కాదు.. సినిమా సెప్టెంబర్ 6 న తెలుగు, తమిళ్ తో పాటు మలయాళంలో కూడా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజులు సమయం మాత్రమే ఉండడంతో.. చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నివేదకు కొన్ని అనుకోని ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటిలో ముఖ్యంగా ‘చిన్న వయసులోనే తల్లి పాత్ర పోషించడంపై మీ అభిప్రాయం ఏమిటి?’ అని అడిగిన ప్రశ్నకు నివేద ఇచ్చిన సమాధానం అందరిని ఆశ్చర్య పరుస్తుంది. దానికి సమాధానంగా నివేద మాట్లాడుతూ.. ’20 సంవత్సరాలు వయసు దాటిన తర్వాత ఆడపిల్లలకు ఎదురయ్యే మొదటి ప్రశ్న పెళ్లెప్పుడు చేసుకుంటావు? అలాంటప్పుడు 20 ఏళ్లు దాటాక తల్లి పాత్ర పోషిస్తే తప్పేముంటుంది’ అంటూ నివేద సమాధానం ఇచ్చింది.

అయితే, మొదట్లో తల్లి పాత్ర ఇంత చిన్న వయస్సులో తల్లి పాత్ర పోషించడం తన నెక్స్ట్ సినిమాలపై ప్రభావం చూపిస్తుందని భావించిందట. కానీ తాను అన్ని రకాలా పాత్రలు పోషిస్తానని ప్రేక్షకులకు తెలియాలి అంటే.. ఇలాంటి పాత్రలు కూడా చేయాలనీ రెడీ అయిందట. ఏదేమైనా నివేద ఇప్పుడు స్క్రీన్ పై కనిపిస్తున్న తీరు.. తన లుక్ గురించి ఎంత మంది ఎన్ని రకాలుగా ప్రశ్నిస్తున్న తీరు.. సినిమాలో తన క్యారక్టర్ విషయంలో తీసుకున్న నిర్ణయం.. లాంటి విషయాలలో నివేద డేరింగ్ కు మెచ్చుకుని తీరాల్సిందే. మరి చాలా గ్యాప్ తర్వాత నివేద మూవీ వస్తుంది కాబట్టి.. కచ్చితంగా ఈ ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులను మెప్పించి తీరుతుందని భావిస్తున్నారు. మరి నివేద తాజాగా మూవీలో క్యారెక్టర్ పై చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio