iDreamPost
android-app
ios-app

ఆటల్లోనూ అదరగొట్టిన స్టార్ హీరోయిన్! ఏకంగా కప్ గెలిచేసింది!

  • Published Jan 23, 2024 | 4:26 PM Updated Updated Jan 23, 2024 | 4:26 PM

హీరోయిన్స్ కేవలం షూటిింగ్స్, సినిమా ప్రమోషన్స్, యాడ్స్ అంటూ నటన రంగాన్నే బేస్ చేసుకుని లైఫ్ లీడ్ చేయడం లేదు. ఆ గీతను దాటి బిజినెస్ అంటూ ఆ వైపు పరుగుతు పెడుతున్నారు.. కానీ ఈ బ్యూటీ మాత్రం కాస్త భిన్నం.

హీరోయిన్స్ కేవలం షూటిింగ్స్, సినిమా ప్రమోషన్స్, యాడ్స్ అంటూ నటన రంగాన్నే బేస్ చేసుకుని లైఫ్ లీడ్ చేయడం లేదు. ఆ గీతను దాటి బిజినెస్ అంటూ ఆ వైపు పరుగుతు పెడుతున్నారు.. కానీ ఈ బ్యూటీ మాత్రం కాస్త భిన్నం.

  • Published Jan 23, 2024 | 4:26 PMUpdated Jan 23, 2024 | 4:26 PM
ఆటల్లోనూ అదరగొట్టిన స్టార్ హీరోయిన్! ఏకంగా కప్ గెలిచేసింది!

మన హీరోయిన్స్ మల్టీ టాలెంటర్స్. కేవలం సినిమాలు, షూటింగ్స్ అంటూ సరిపెట్టుకోవడం లేదు. బిజినెస్ చేస్తూ రెండు చేతుల సంపాదించడమే కాకుండా..తమకు నచ్చిన పనిని చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. యోగా, గార్డెనింగ్ అంటూ మరో వ్యాపకంపై దృష్టి సారిస్తున్నారు. మొన్నటికి మొన్న క్యారెక్టర్ నటి ప్రగతి.. ఎంతగా ఛేంజ్ అయ్యిందో అందరికీ తెలుసు. సినిమాలే కాదూ తనకంటూ ఓ ప్రపంచం ఉంది అని నిరూపిస్తోంది. వెయిట్ లిఫ్టింగ్‌‌లో ట్రైనింగ్ తీసుకుని ఇప్పుడు కాంపిటీషన్లలో పాల్గొంటూ.. పతకాలు కొల్లగొడుతుంది. తాజాగా సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్‌లో పాల్గొని సిల్వర్ మెడల్ గెలిచింది. ఇప్పుడు మరో బ్యూటీ కూడా ఇంటర్నేషనల్ ట్రోపీని గెలిచింది.

టాలీవుడ్ హీరోయిన్ నివేథా పేతురాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.అలా వైకుంఠపురంతో పాటు అనేక తెలుగు సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది ఈ మధురై కుట్టి.మెంటల్ మదిలో అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మాయి..చిత్రలహరిలో సీరియస్ క్యారెక్టర్‌లో కనిపిస్తుంది. బ్రోచేవారెవరురా, రెడ్, పాగల్, విరాటపర్వం, దాస్ కా ధమ్కీ, బూ వంటి పిక్చర్స్ చేసింది. నివేథాలో మంచి టాలెంట్ ఉంది. కొన్నాళ్ల ముందు కారు రేసింగ్ నేర్చుకున్న అమ్మడు.. అప్పట్లో రేసు ట్రాకు మీద రయ్ అంటూ పరుగులు కూడా పెట్టింది.

ఇప్పుడు మరో రంగంలోకి అడుగు పెట్టి.. ఏకంగా కప్ కొట్టేసింది ఈ బ్యూటీ. మొన్న రేసర్‌గా మారిపోయి.. ట్రాకులపై చెలరేగిన నివేథా పేతురాజ్.. ఇప్పుడు ప్లే గ్రౌండ్‌లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది. ఆమె ఇప్పుడు షట్లర్ అవతారం ఎత్తింది. మధురైలో జరిగిన బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలో మిక్స్‌డ్ డబుల్స్ కేటగిరిలో ఆడి కప్ కొట్టింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా వెల్లడించింది. గెలిచిన కప్ ముద్దుడుతూ.. గోల్డ్ మెడల్ పంటికి కరిచిన ఫోటోలను షేర్ చేసింది. దీనికి కాప్షన్ కింద వాట్ నెక్ట్స్ అంటూ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.కాగా, ఆమెకు చాలా మంది కంగ్రాట్స్ తెలుపుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కంగ్రాట్ చేసేయండిక

 

View this post on Instagram

 

A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss