iDreamPost
android-app
ios-app

Nikhil Siddhartha: త్వరలో తండ్రి కాబోతున్న హీరో నిఖిల్.. భార్యకు ఘనంగా సీమంతం!

  • Published Jan 31, 2024 | 9:51 PM Updated Updated Jan 31, 2024 | 9:51 PM

టాలీవుడ్ హీరో నిఖిల్ త్వరలో తండ్రి కాబోతున్నారు. ఆయన భార్యకు ఘనంగా సీమంతం చేశారు. దీనికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టాలీవుడ్ హీరో నిఖిల్ త్వరలో తండ్రి కాబోతున్నారు. ఆయన భార్యకు ఘనంగా సీమంతం చేశారు. దీనికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 31, 2024 | 9:51 PMUpdated Jan 31, 2024 | 9:51 PM
Nikhil Siddhartha: త్వరలో తండ్రి కాబోతున్న హీరో నిఖిల్.. భార్యకు ఘనంగా సీమంతం!

టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ సూపర్ ఫామ్​లో ఉన్నారు. హిట్స్, ఫ్లాప్స్​తో సంబంధం లేకుండా వరుసగా మూవీస్​ను లైన్​లో పెడుతున్నారు. ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఆ సినిమాతో సౌత్​తో పాటు నార్త్​లోనూ ఆయన ఇమేజ్​ అమాంతం పెరిగింది. ‘కార్తికేయ’ సీక్వెల్​ కంటే ముందు వచ్చిన ‘అర్జున్ సురవరం’ కూడా మంచి హిట్​గా నిలిచింది. అయితే ఆ తర్వాత వచ్చిన ‘18 పేజెస్’, ‘స్పై’ మూవీస్ మాత్రం ఊహించినంతగా ఆడలేదు. ముఖ్యంగా ‘స్పై’ బిగ్ ఎక్స్​పెక్టేషన్స్ మధ్య రిలీజై అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో తన తర్వాతి సినిమాతో మళ్లీ మెగా హిట్ కొట్టాలని చూస్తున్నారు. ‘స్వయంభూ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ ఓ టిపికల్ టాపిక్​తో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. నిఖిల్ అభిమానులకు గుడ్​న్యూస్. ఆయన త్వరలో తండ్రి కాబోతున్నారు. తాజాగా ఆయన భార్య పల్లవి వర్మకు ఘనంగా సీమంతం నిర్వహించారు.

కొంతమంది సన్నిహితులు, బంధువుల మధ్య పల్లవి వర్మ సీమంతం ఫంక్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్వయంగా నిఖిల్ ఈ ఫంక్షన్​కు సంబంధించిన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేశారు. త్వరలో తాను, భార్య పల్లవి తల్లిదండ్రులం కాబోతున్నామని.. అందరూ తమకు దీవెనలు అందించాలని నిఖిల్ కోరారు. ఈ వేడుకలో పల్లవి ఆరెంజ్ శారీలో మెరిశారు. నిఖిల్ సింపుల్​గా బ్లాక్ ప్యాంట్, వైట్ షర్ట్​తో కనిపించారు. ఇందులో ఆయన పొడవాటి జుట్టుతో ఉన్నారు. దీన్ని బట్టి నెక్స్ట్ సినిమాలో ఆయన లుక్ స్పెషల్​గా ఉండబోతుందని అర్థమవుతోంది. నిఖిల్ భార్య సీమంతం ఫొటోలు సోషల్ మీడియాలో వైర​ల్ అవుతున్నాయి.

నిఖిల్-పల్లవి దంపతులకు సోషల్ మీడియాలో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పండంటి బిడ్డ పుట్టాలని దీవిస్తున్నారు. ఈ ఫొటోలను నిఖిల్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. పండంటి బిడ్డ జీవితంలోకి రాబోతోంది కాబట్టి తమ హీరోకు ఈ ఏడాది తప్పక కలిసొస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, నిఖిల్-పల్లవి వర్మ జంట 2020, మే నెల 14వ తేదీన వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొన్నాళ్లు ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పండంటి బిడ్డ తమ జీవితంలోకి రానుండటంతో ఈ స్టార్ కపుల్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కెరీర్​లో ఫుల్ పీక్​లో ఉన్న నిఖిల్​కు ఇటు పర్సనల్ లైఫ్​లో కూడా బిడ్డ రానుండటంతో హ్యాపీనెస్ డబుల్ అయిందనే చెప్పాలి. మరి.. నిఖిల్ నెక్స్ట్ మూవీ కోసం మీరెంతగా ఎదురుచూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş