P Krishna
Good bye to Movies: సినీ ఇండస్ట్రీలో నటీనటులుగా ఏలిన వారు తర్వాత కాలంలో రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. కొంతమంది సొంత పార్టీలు పెట్టుకొని రాజ్యమేలారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పలువురు తారలు ఘన విజయం సాధించారు.
Good bye to Movies: సినీ ఇండస్ట్రీలో నటీనటులుగా ఏలిన వారు తర్వాత కాలంలో రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. కొంతమంది సొంత పార్టీలు పెట్టుకొని రాజ్యమేలారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పలువురు తారలు ఘన విజయం సాధించారు.
P Krishna
చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది నటీనటులు కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎదో ఒక పదవిలో కొనసాగుతున్నారు. గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్, విజయ్ కాంత్, జయలలిత ఇలా ఎంతోమంది రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక పేరు ప్రతిష్టాలు సంపాదించుకున్నారు. తర్వాత కొంతమంది రాజకీయ పార్టీలు స్థాపించినా పెద్దగా రాణించలేకపోయారు. కొంతమంది అటు రాజకీయాల్లో.. ఇటు సినిమాల్లోనూ సత్తా చాటేవారు ఉన్నారు. తండ్రి రాజకీయాల్లో గొప్ప పొజీషన్లో ఉన్నాడు.. హీరోగా తన అదృష్టం పరీక్షించుకున్నాడు. కానీ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తండ్రి బాటలో నడవాలని నిశ్చించుకున్నాడు ఓ హీరో. ఇంతకీ ఆ హీరో ఎవరు అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమార స్వామి తనయుడు, మాజీ భారత ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్ కుమార్‌స్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను సినిమాల్లో నటించబోనని తేల్చి చెప్పాడు. తన తండ్రి బాటలో నడుస్తూ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2016 లో కన్నడ, తెలుగులో ‘జాగ్వార్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం జేడీఎస్ యువ విభాగం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు నిఖిల్ కుమార్‌స్వామి. తాజాగా మాండ్యలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇకపై సినిమాల్లో నటించబోను.. పూర్తిగా రాజకీయాల్లోనే ఉండాలని నిశ్చయించుకున్నా.. కుమార స్వామిపై మండ్య ప్రజలు చూపిన గౌరవం, ప్రేమాభిమానాలు కాపాడుకుంటా.. అభివృద్దికి జరిగేలా నా వంతు కృషి చేస్తా’ అని అన్నారు. రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేయాలన్నదే తమ పార్టీ లక్ష్యం అని అన్నారు.
కన్నడ రాజకీయాల్లో కుమార స్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ముఖ్యమంత్రిగా ఆయన పదవీలో కొనసాగినపుడు పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. యంగ్ ఏజ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్ కుమార్‌స్వామి. కానీ అనుకున్నసక్సెస్ మాత్రం కాలేకపోయాడు.. హీరోకి ఉండాల్సిన పర్సనాలిటీ ఉన్నా.. అదృష్టం మాత్రం కలిసి రాకపోవడంతో నటుడిగా రాణించలేకపోయాడు. హీరోగా సక్సెస్ కాకున్నా.. రాజకీయాల్లో అయినా రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.