iDreamPost
android-app
ios-app

Niharika: నాకు పిల్లలు కావాలి.. రెండో పెళ్లి చేసుకుంటా : నిహారిక

  • Published Mar 15, 2024 | 12:52 PM Updated Updated Mar 15, 2024 | 12:52 PM

మెగా డాటర్ నిహారిక విషయంలో ఏం జరిగిందో ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో పోస్ట్స్ చూస్తూ వచ్చాము. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా నిహారిక తన రిలేషన్ షిప్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి నిహారికి పంచుకున్న విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

మెగా డాటర్ నిహారిక విషయంలో ఏం జరిగిందో ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో పోస్ట్స్ చూస్తూ వచ్చాము. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా నిహారిక తన రిలేషన్ షిప్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి నిహారికి పంచుకున్న విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

  • Published Mar 15, 2024 | 12:52 PMUpdated Mar 15, 2024 | 12:52 PM
Niharika: నాకు పిల్లలు కావాలి.. రెండో పెళ్లి చేసుకుంటా : నిహారిక

నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆమె గురించి.. ఆమె వివాహ బంధం గురించి మీడియా సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ , కామెంట్స్ ఇవన్నీ చూస్తూనే ఉన్నాము . ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్స్ అన్నిటికి కూడా చెక్ పెట్టె విధంగా మాట్లాడింది. “విడిపోతామని తెలిసి ఎవరూ పెళ్లి చేసుకోరు.. అది కూడా ఎంతో గ్రాండ్‌గా.. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి అసలే సెలబ్రేషన్స్‌ చేయరు”. అంటూ నిహారిక ఆ ఇంటర్వ్యూలో కాస్త ఎమోషనల్ అయింది. ఇక తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మరోసారి నిహారిక తనకు రిలేషన్ షిప్స్ మీద, రెండో పెళ్లి మీద .. తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఈ విషయాలు ఇలా ఉన్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక తనకు రెండవ పెళ్లి మీద ఉన్న అభిప్రాయాన్ని చెప్తూ.. “నాకు పిల్లలంటే ఇష్టం. పిల్లలు కావాలంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే! ప్రేమ మీద నెగెటివ్‌ ఇంప్రెషన్‌ అయితే లేదు. ఒక రిలేషన్‌షిప్‌ వర్కవుట్‌ కాలేదంటే ఎన్నో కారణాలుంటాయి. అలా పలు కారణాలతో నా పెళ్లి కూడా వర్కవుట్‌ కాలేదు. అలా అని మళ్లీ ఒకరిపై ప్రేమ పుట్టదు అనుకుంటే మూర్ఖత్వమే అవుతుంది. త్వరలో అని చెప్పలేను కానీ పెళ్లయితే చేసుకుంటాను” అంటూ నిహారిక.. రెండవ పెళ్లిపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. అలాగే రాడిసన్‌ బ్లూ పబ్‌ కేసులో నిహారికను అరెస్ట్ చేసిన విషయంపై కూడా ఈ సంధర్బంగా క్లారిటీ ఇచ్చింది నిహారిక.

రాడిసన్‌ బ్లూ పబ్‌ కేసు విషయమై నిహారిక మాట్లాడుతూ.. “రాడిసన్‌ బ్లూ పబ్‌ కేసులో నన్ను అన్యాయంగా ఇరికించారు. నేను పబ్బులకు, పార్టీలకు చాలా అరుదుగా వెళ్తుంటాను. ఆరోజు నేను అక్కడ మా స్కూల్‌ ఫ్రెండ్స్‌ను కలిశాను. ఆరు నెలల తర్వాత వారిని కలిసి కబుర్లు చెప్పుకున్నాం. అయితే ఆ సౌండ్‌ మాకు ఇబ్బందిగా ఉండటంతో ఇంటికి వెళ్లిపోదామనుకున్నాను. బిల్లు కట్టి బయటకు వచ్చే సమయానికి పోలీసులు వచ్చారు. మమ్మల్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు. నాకేం అర్థం కాలేదు. మీడియాలో ఎందుకింత రచ్చ చేశారో అస్సలు అర్థం కాలేదు. కానీ చాలా బాధేసింది. తర్వాత అక్కడెవరో డ్రగ్స్‌ తీసుకున్నారని తెలిసింది. నేను తప్పుడు ప్రదేశంలో ఉన్నానని ఆలస్యంగా తెలసుకున్నాను.” అంటూ నిహారిక చెప్పుకొచ్చింది. ఇక సినీ సెలెబ్రిటలంటే .. ఇలాంటి విషయాలలో ట్రోల్ అవ్వడం సహజం. మరి, నిహారిక కొణిదల తన వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్న తీరుపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet