iDreamPost
android-app
ios-app

సలార్ క్రేజీ అప్డేట్! ఈసారి విదేశీ ఆడియన్స్ కి సైతం పూనకాలే!

  • Author ajaykrishna Published - 04:08 PM, Thu - 3 August 23
  • Author ajaykrishna Published - 04:08 PM, Thu - 3 August 23
సలార్ క్రేజీ అప్డేట్! ఈసారి విదేశీ ఆడియన్స్ కి సైతం పూనకాలే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని హోంబలే ఫిలిమ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా.. సెప్టెంబర్ 28న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్స్, టీజర్ లతో మేకర్స్ సలార్ ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. ఆల్రెడీ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే.. ముందునుండి ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. అలాంటిది టీజర్ చూశాక సలార్ పై ఉన్న అంచనాలన్నీ రెట్టింపు అయిపోయాయని చెప్పాలి. టీజర్ బట్టి సలార్ మూవీ కేజీఎఫ్ సిరీస్ కి కొనసాగింపు అని భావిస్తున్నారు.

ఇక సలార్ రిలీజ్ డేట్ గతేడాది ప్రకటించిన మేకర్స్.. మళ్లీ మార్పులు చేయబోమని ముందే చెప్పారు. ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి సెప్టెంబర్ 28న.. తెలుగు, కన్నడ భాషలతో పాటు తమిళ, హిందీ, మలయాళం భాషలలో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. అయితే.. సలార్ ని ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు ఇంగ్లీష్ వెర్షన్ కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సలార్ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్. మీడియాలో, ఇండస్ట్రీ వర్గాలలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. సలార్ ని ఇండియన్ భాషలలో సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్న మేకర్స్.. ఇంగ్లీష్ వెర్షన్ ని రెండు వారాలు ఆలస్యంగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట.

తాజా సమాచారం ప్రకారం.. సలార్ పార్ట్ 1 ఇంగ్లీష్ వెర్షన్ ని.. అక్టోబర్ 13న రిలీజ్ చేసే ప్లాన్ జరుగుతుందని టాక్ గట్టిగా వినిపిస్తుంది. మరి ఎందుకు ఇలా వేర్వేరుగా రిలీజ్ చేయనున్నారో తెలియదు. కానీ.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం మేకర్స్ నుండి రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. సలార్ సినిమా పై డార్లింగ్ ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పటిదాకా చూసిన విజువల్స్ బట్టి.. సినిమా రికార్డులు తిరగరాస్తుందని అంచనా వేస్తున్నారు. అందులోనూ కేజీఎఫ్ కి లింక్ ఉందని తెలిసి మరింత ఎక్సయిట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. ఇక సలార్ లో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ నటించింది. మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషించాడు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సలార్ కి సంగీతం అందిస్తున్నాడు. మరి సలార్ పార్ట్ 1 గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommarsbahis girişrobinbetjojobet giriştürk pornoMariobetMadridbetmadridbetMadridbetjojobetgrandpashabet girişJojobetjojobetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabet