iDreamPost
android-app
ios-app

రాజ్ తరుణ్ – లావణ్య గొడవలో కొత్త ట్విస్ట్! ప్రీతి వీడియోస్ లీక్! ఎవరీమె?

  • Published Aug 03, 2024 | 4:11 PM Updated Updated Aug 03, 2024 | 4:11 PM

Raj Tarun: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వివాదం గురించి అందరికి తెలిసింది. ఈ ఇష్యూలో రోజుకో కొత్త విషయంలో వెలుగులోకి వస్తుంది. తాజాగా వీరి వివాదంలో ప్రీతి అనే యువతి తెరపైకి వచ్చింది. అసలు ఈమె ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...

Raj Tarun: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వివాదం గురించి అందరికి తెలిసింది. ఈ ఇష్యూలో రోజుకో కొత్త విషయంలో వెలుగులోకి వస్తుంది. తాజాగా వీరి వివాదంలో ప్రీతి అనే యువతి తెరపైకి వచ్చింది. అసలు ఈమె ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...

  • Published Aug 03, 2024 | 4:11 PMUpdated Aug 03, 2024 | 4:11 PM
రాజ్ తరుణ్ – లావణ్య గొడవలో  కొత్త ట్విస్ట్! ప్రీతి వీడియోస్ లీక్! ఎవరీమె?

ప్రస్తుతం టాలీవుడ్ లో లావణ్య, హీరో రాజ్ తరుణ్ వివాదం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసింది. తనను  పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ లావణ్య..రాజ్ పై ఫిర్యాదు చేసింది. ఇక ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో రాజ్ తరుణ్ కూడా లావణ్యపై  పలు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఓ డిబెట్ లో రాజ్ తరుణ్  సన్నిహితుడైన ఆర్ జే  శేఖర్ బాషా.. అతడికి మద్దతుగా లావణ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఉదయ్, ప్రీతి అనే ఇద్దరి కొత్త వ్యక్తుల పేర్లు తెరపైకి వచ్చాయి. వారికి లావణ్యనే డ్రగ్స్  అలవాటు చేసిందంటూ.. శేఖర్ బాషా ఆరోపించాడు. ఈ క్రమంలోనే ఈ గొడవలోకి ప్రీతి కూడా ఎంటర్ అయింది. మరి.. అసలు ఈమె ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

గత కొంతకాలం నుంచి లావణ్య, రాజ్ తరుణ్ వివాదం నడుస్తున్నా సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే రాజ్ కి సన్నిహితుడైనా శేఖర్ బాషా.. లావణ్యపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమె ఆడపిల్లలకు డ్రగ్స్ అలవాటు చేసిందని, అంతేకాక వారికి సంబంధించిన వ్యక్తిగత వీడియోలను కూడా తీసిందని తెలిపాడు. ఎవరైనా తన గురించి మాట్లాడితే.. వారి వీడియోలను బయటపెడతానంటూ లావణ్య బ్లాక్ మెయిల్ చేసిందని శేఖర్ బాషా అన్నారు. అలా లావణ్య డ్రగ్స్ అలవాటు చేసిన బాధితుల్లో ప్రీతి, ఉదయ్ కూడా ఉన్నారని తెలిపాడు.

ఈక్రమంలోనే లావణ్య,…ప్రీతికి సంబంధించిన ఓ వీడియోను లీక్ చేసింది. అంతేకాక ప్రీతికి చాలా కాలం నుంచి డ్రగ్స్ అలవాటు ఉందని లావణ్య చెప్పుకొచ్చింది. ఇలా ప్రీతి అనే యువతి ఈ రాజ్ తరుణ్ వివాదంలోకి ఎంట్రీ అయింది. ఇక తనపై లావణ్య చేసిన వ్యాఖ్యలకు ప్రీతి కూడా రియాక్ట్ అయింది. ఏకంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో లావణ్యపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే  ఫిర్యాదులో అనేక ఆసక్తికర అంశాలను ప్రస్తావించింది. లావణ్యనే తనకు డ్రగ్స్ అలవాటు చేసిందటూ పోలీసులకు అందించిన ఫిర్యాదులో పేర్కొంది. లావణ్యతో తనకు మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడిందని, ఆ టైమ్ లోనే తనకు లావణ్యనే డ్రగ్స్ అలవాటు చేసిందని ప్రీతి తెలిపింది.

అంతేకాక లావణ్య ఫోన్ చేసి తనను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందంటూ నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది. తనకంటే ముందే లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉందని, అదే విషయాన్ని లావణ్యనే స్వయంగా ఒప్పుకుందని ప్రీతి  మీడియా ముందు ప్రస్తావించింది. లావణ్యకు తాను డ్రగ్స్ అలవాటు చేయడం కాదు..ఆమె తనకు, తనలాంటి చాలా మంది అమ్మాయిలకు డ్రగ్స్ అలవాటు చేసిందని ప్రీతి తెలిపింది. శుక్రవారం రాత్రి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ప్రీతి ఫిర్యాదు చేసింది. అలా లావణ్య, రాజ్ తరుణ్ వివాదంలోకి ప్రీతి ఎంట్రీ ఇచ్చింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet