iDreamPost
android-app
ios-app

మహేశ్ పై రాజమౌళి డామినేషన్! ఊరుకోక తప్పదు మరి!

  • Published Feb 17, 2024 | 4:37 PM Updated Updated Feb 17, 2024 | 4:37 PM

దర్శకుడు రాజామౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో భారీ బడ్జెట్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో రెమ్యూనరేషన్ విషయంలో మహేశ్ కన్నా రాజమౌళి డామినేషన్ ఎక్కువగా ఉందనే టాక్ వినిపిస్తోంది.

దర్శకుడు రాజామౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో భారీ బడ్జెట్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో రెమ్యూనరేషన్ విషయంలో మహేశ్ కన్నా రాజమౌళి డామినేషన్ ఎక్కువగా ఉందనే టాక్ వినిపిస్తోంది.

  • Published Feb 17, 2024 | 4:37 PMUpdated Feb 17, 2024 | 4:37 PM
మహేశ్ పై  రాజమౌళి డామినేషన్! ఊరుకోక తప్పదు మరి!

మహేష్ బాబు – ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో భారీ సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తో రాజమౌళి స్టార్ డం ఇంటర్నేషనల్ లెవెల్ కు వెళ్ళిపోయింది. దాంతో ఇప్పుడు హీరోనే డామినేట్ చేసే స్థాయికి వెళ్లిపోయాడు మన జక్కన్న. తొంభై ఏళ్ళకి పైగా ఉన్న తెలుగు సినిమా ప్రయాణంలో చాలా వరకు దర్శకుల పైన హీరోలదే పై చేయిగా ఉంటూ వచ్చింది. అక్కడక్కడా దాసరి నారాయణరావు వంటి దిగ్గజ దర్శకులు పారితోషికం లేదా స్టార్ ఇమేజ్ విషయంలో హీరోలే దర్శకుల కంటే ముందు ఉన్నారు.

అయితే ఆ లెక్కను మార్చేసి రాజమౌళి దర్శకుడిగా సూపర్ స్టార్ మహేష్ కంటే అధిక పారితోషికం తీసుకోనున్నారని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందనున్న మహేష్ – రాజమౌళి సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకి మహేష్ 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారట. ఇక మహేష్ లెక్క ఇలా ఉంటే రాజమౌళి ఈ సినిమాకు రెమ్యూనరేషన్ తో పాటుగా లాభాల్లో వాటా కూడా తీసుకుంటారని తెలుస్తుంది. మొదట్లో ఈ సినిమాకి మహేష్ రాజమౌళి ఇద్దరు రెమ్యునరేషన్ లేకుండా పని చేసి బిజినెస్ లో వాటా మాత్రమే తీసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ కు 100 కోట్లు అందనుండగా… రాజమౌళి రెమ్యునరేషన్ 100 కోట్లకి పైగానే ఉంటుందని అంటున్నారు.

ఈ వార్త విన్న కొందరు సినీ ఔత్సాహికులు సూపర్ స్టార్ అయినా సరే మహేష్, ప్రస్తుతం రాజమౌళికి ఉన్న బిగ్ ఇమేజ్ దృష్ట్యా ఆయన డామినేషన్ ను ఒప్పుకోక తప్పదని అంటున్నారు. ఇక ఈ సినిమాకి సాంకేతిక విభాగంలో పని చేసేందుకు పీఎస్ వినోద్ (సినిమాటోగ్రాఫర్), ఆర్సీ కమలకన్నన్, (వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్), మోహన్ బింగి (ప్రొడక్షన్ డిజైనర్), తమ్మిరాజు (ఎడిటర్) వంటి సీనియర్ టెక్నిషియన్స్ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

అంతే కాక ఈ సినిమాలో హాలీవుడ్ నటులు కూడా నటిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. గతంలో దీని పై ఈ ప్రాజెక్ట్ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. కథ ప్రకారం ఈ సినిమా ఆఫ్రికా దేశంలో చిత్రీకరించాల్సి ఉంది కాబట్టి హాలీవుడ్ నటులు నటించే అవకాశం ఉందన్నారు. అయితే ఇంకా ఎవరినీ అధికారికంగా సంప్రదించలేదని కూడా చెప్పారు.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet