iDreamPost
android-app
ios-app

టిల్లు సీక్వెల్ లో రాధిక అక్కను అందుకే తీసుకోలేదట!

  • Author ajaykrishna Published - 11:31 AM, Sun - 17 September 23
  • Author ajaykrishna Published - 11:31 AM, Sun - 17 September 23
టిల్లు సీక్వెల్ లో రాధిక అక్కను అందుకే తీసుకోలేదట!

ఒక్కోసారి సూపర్ హిట్ సినిమాలకు సంబంధించి సీక్వెల్స్ విషయంలో చాలా మార్పులు కనిపిస్తుంటాయి. అవన్నీ చూసి.. ఫస్ట్ పార్ట్ లో ఉన్నవాళ్లను సీక్వెల్ లో ఎందుకు తీసేశారని సందేహాలు మొదలవుతుంటాయి. మూవీ టీమ్ ఎప్పటికప్పుడు రియాక్ట్ అయితే బాగానే ఉంటుంది. కానీ.. మేకర్స్ నుండి క్లారిటీ రాకపోతే ఆ డౌట్ కాస్త ఇండస్ట్రీలో సెన్సేషనల్ అయిపోతుంది. గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ అయిన డీజే టిల్లు సినిమా సీక్వెల్ విషయంలో అదే జరిగింది. ఆ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సరసన హీరోయిన్ గా నేహా శెట్టి నటించింది. అందులో ఆమె పోషించిన రాధిక క్యారెక్టర్ కి మంచి గుర్తింపు లభించింది. కట్ చేస్తే.. సీక్వెల్ లో రాధిక క్యారెక్టర్ లేదు.

హీరో సిద్ధు జొన్నలగడ్డ సరసన హీరోయిన్ గా నేహా స్థానంలో అనుపమ పరమేశ్వరన్ ఎంటర్ అయ్యింది. మరోవైపు దర్శకుడు కూడా మారిపోయాడు. ప్రస్తుతం సినిమా కూడా రిలీజ్ కి దగ్గర పడింది. అయితే.. టిల్లు స్క్వేర్ అనౌన్స్ మెంట్ జరిగినప్పటి నుండి ఎందుకు నేహా శెట్టి లేదనే సందేహాలు ప్రేక్షకులలో కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఒక రకంగా టిల్లు ఫ్యాన్స్ రాధిక విషయంలో నిరాశకు గురయ్యారని చెప్పాలి. కాగా.. దీని గురించి హీరోతో పాటు ప్రొడ్యూసర్ కూడా ఇప్పటిదాకా స్పందించలేదు. కానీ.. తాజాగా నేహా శెట్టి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తనను టిల్లు స్క్వేర్ లో ఎందుకు తీసుకోలేదో కారణంతో సహా క్లియర్ గా చెప్పేసింది.

ప్రస్తుతం నేహా నటించిన రూల్స్ రంజన్ మూవీ ప్రమోషన్అ జరుపుకుంటుంది. ఈ సందర్బంగా టిల్లు స్క్వేర్ గురించి ప్రశ్న ఎదురైంది. నేహా మాట్లాడుతూ.. “టిల్లు మూవీలో రాధిక క్యారెక్టర్ తో నాకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే.. సీక్వెల్ విషయంలో ముందునుండి మేకర్స్ క్లారిటీగా ఉన్నారు. టిల్లు స్క్వేర్ అనేది మొదటి భాగానికి కొనసాగింపు కాదు. అది డిఫరెంట్ కథ. సో.. నన్ను అందుకే అందులో తీసుకోలేదు. కథకు లింక్ లేనప్పుడు క్యారెక్టర్స్ కంటిన్యూ అవ్వవు కదా! కానీ, ఈ విషయంలో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారని తెలిసింది.” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నేహా మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. సో.. టిల్లు స్క్వేర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisHoliganbetJojobet