iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ నటితో ప్రియాంకచోప్రా సోదరుడి నిశ్చితార్థం! ఆమె ఎవరంటే?

  • Published Apr 03, 2024 | 5:18 PM Updated Updated Apr 03, 2024 | 5:18 PM

టాలీవుడ్ హీరోయిన్లు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. మొన్న రకుల్ ప్రీత్ సింగ్, నిన్న కృతి కర్భందా వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు మరో బ్యూటీ కూడా..

టాలీవుడ్ హీరోయిన్లు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. మొన్న రకుల్ ప్రీత్ సింగ్, నిన్న కృతి కర్భందా వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు మరో బ్యూటీ కూడా..

  • Published Apr 03, 2024 | 5:18 PMUpdated Apr 03, 2024 | 5:18 PM
టాలీవుడ్ నటితో  ప్రియాంకచోప్రా సోదరుడి నిశ్చితార్థం! ఆమె ఎవరంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీని గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి విదితమే. ఫిబ్రవరిలో వీరి వివాహం జరిగింది. ఇక మరో ముద్దుగుమ్మ, పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమాతో గిలిగింతలు పెట్టిన కృతి కర్భందా కూడా బాలీవుడ్ హీరో పులకిత్ సామ్రాట్‌తో గత నెలలో ఏడడగులు వేసింది. అలాగే తాప్సీ కూడా పెళ్లి చేసుకుందంటూ వార్తలు వచ్చాయి. ప్రముఖ టాలీవుడ్,బాలీవుడ్ హీరో హీరోయిన్లు సిద్దార్థ్, అదితి రావు హైదరి రహస్యంగా ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతి విదితమే. ఇప్పుడు మరో టాలీవుడ్ నటి పెళ్లి పీటలు ఎక్కబోతుంది.

ప్రముఖ బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ చోప్రాను మనువాడబోతుంది ఆ చిన్నది. ఇంతకు ఆ నటి ఎవరంటే.. నీలం ఉపాధ్యాయ. ముంబయిలో పుట్టిన పెరిగిన ఆమె..తొలి సినిమా ఇలా మొదలైందో లేదో అలా అటకెక్కింది. 2010లో ఓ తమిళ చిత్రానికి ఓకే చెప్పింది. కానీ అది షూటింగ్ దశలోనే ఆగిపోయింది. మిస్టర్ 7 అనే చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అల్లరి నరేష్ హీరోగా నటించిన యాక్షన్ 3డి చిత్రంతో పాటు తమాషా వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. వీటితో పాటు తమిళంలో కూడా రెండు సినిమాలు చేసిందీ బ్యూటీ. ఇప్పుడు సిద్దార్థ్ చోప్రాను మనువాడబోతుంది. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది నీలం.

Priyanka Chopra's brother's engagement with Tollywood actress!

ప్రస్తుతం రోకా జరిగినట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు ప్రముఖ నటి ప్రియాంక, ఆమె భర్త నిక్ జోనాస్ కూడా కనిపించారు. సిద్దార్థ్ ఫ్లోరల్ షూట్ ధరిస్తే.. నీలం సంపద్రాయ దుస్తుల్లో మెరిసిపోతుంది. ప్రియాంక కూడా తన ఇన్ స్టా స్టోరీలో సిద్దార్థ్, నీలం ఎంగేజ్ మెంట్ ఫోటోలను షేర్ చేసుకుంది. మరి కొన్నిరోజుల్లో వీరి పెళ్లి జరగబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, సిద్దార్థ్ కు ఇంతకు ముందు ఇషితా కుమార్ అనే యువతితో నిశ్చితార్థం జరిగింది. 2019లో వీరి నిశ్చితార్థం జరగ్గా.. అనూహ్యంగా ఈ వివాహం రద్దు అయ్యింది. ఆ తర్వాత నీలం ప్రేమలో పడినట్లు తెలుస్తోంది అలా వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడంతో ఇప్పడు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Neelam Upadhyaya (@neelamupadhyaya)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio