iDreamPost
android-app
ios-app

జెర్సీ మూవీ సీక్వెల్ పై ఫ్యాన్స్ రిక్వెస్ట్.. నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  • Published Apr 23, 2024 | 12:30 PMUpdated Apr 23, 2024 | 12:30 PM

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ అంతా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే స్టార్ హీరోలంతా తమ సీక్వెల్స్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా నేచురల్ స్టార్ నానికి కూడా తన కెరీర్ లోని బెస్ట్ మూవీని సీక్వెల్ చేయమని అభిమానులు కోరారు. అయితే ఈ విషయం స్పందించిన నాని చాలా ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన ఆ వ్యాఖ్యలు అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ అంతా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే స్టార్ హీరోలంతా తమ సీక్వెల్స్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా నేచురల్ స్టార్ నానికి కూడా తన కెరీర్ లోని బెస్ట్ మూవీని సీక్వెల్ చేయమని అభిమానులు కోరారు. అయితే ఈ విషయం స్పందించిన నాని చాలా ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన ఆ వ్యాఖ్యలు అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  • Published Apr 23, 2024 | 12:30 PMUpdated Apr 23, 2024 | 12:30 PM
జెర్సీ మూవీ సీక్వెల్ పై ఫ్యాన్స్ రిక్వెస్ట్.. నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ అంతా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే స్టార్ హీరోలంతా తమ సీక్వెల్స్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పాన్ ఇండియా హీరోలైనా అల్లు అర్జున్, ‘పుష్ప 2’, తో ప్రభాస్ ‘సలార్ 2’ తో ఇలా చెప్పుకొంటూ పోతే చాలా చాలమంది హీరోల సినిమాలు లైన్ లో ఉన్నాయి. కాగా, ఇవి అన్నీ భారీ బడ్జెట్ సినిమాలు కావడం విశేషం. ఇక పెద్ద హీరోల భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా.. చిన్న హీరోల సినిమాలు కూడా సీక్వెల్స్ బరిలోకి సెట్స్ పైకి వెళ్తున్నాయి. ఇప్పటికే యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ తో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుని సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పడు, ‘మ్యాడ్ 2,’ ‘ప్రేమలు 2’ లాంటి సినిమాలు సీక్వెలస్స్ తో తెరకెక్కునున్నాయి. దీంతో ఇండస్ట్రీలో ఇప్పటి వరకు హిట్, బ్లాక్ బస్టర్ సినిమాలకు కూడా సీక్వెల్స్ కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నేచురల్ స్టార్ నానికి కూడా తన అభిమానులు ఓ స్పెషల్ రిక్వెస్ట్ ను కోరారు. ఇక ఫ్యాన్స్ అడిగిన కోరికకు నాని చాలా ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన ఆ వ్యాఖ్యలు అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నేచురల్ స్టార్ నాని..  ఇండస్ట్రీలో ఈయనకి ఉన్న ఫ్యాన్ పాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో నేచురల్ గా నటించి ప్రేక్షకులను తన నటనతో నవ్వించి, ఎమోషనల్ గా ఏడిపించేయడంలో.. ఈయనకు సాటి ఎవరు లేరు. ఇక నాని సినిమాలు విషయానికొస్తే.. ఇప్పటి వరకు ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే నాని కెరీర్ లో ది బెస్ట్ మూవీ ఏదీ అంటే.. అది ‘జెర్సీ‘ మూవీ అనే చెప్పవచ్చు. ఎందుకంటే.. క్రికెట్ బ్యాక్ డ్రాప్‌తో తీసిన ఈ చిత్రం ఎలాంటి కమర్షియల్ అంశాలు లేనప్పటికీ అద్భుతమైన హిట్‌గా నిలిచింది.  అంతేకాకుండా.. ఈ సినిమా థియేటర్లలో రీలిజ్ అయ్యి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చిత్రాన్ని రీసెంట్ గా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో రీ రిలీజ్ చేశారు. కాగా, ఈ సినిమా రీ రిలిజ్ అయినప్పుడు ప్రేక్షకుల్లో మంచి విశేష స్పందన వచ్చింది.

ఈ క్రమంలోనే.. ‘జెర్సీ‘ మూవీ రీ రిలిజ్ సమయంలో ఫ్యాన్స్ చూపించే అదరణ పై నాని ఇటీవలే సోషల్ మీడియాలో  ఎమోషనల్ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. తాజాగా నాని ‘ఆ ఒక్కటి అడక్కు’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆయనకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. కాగా, జెర్సీ మూవీకి సీక్వెల్ కావాలని నానికి అభిమానుల నుంచి స్పెషల్ రిక్వెస్ట్ వచ్చింది. ఇక ఈ విషయం పై స్పందించిన మాట్లాడిన నాని.. ‘నేను లేనుగా, ఎవరితో చేస్తారో చేసుకోండి’ అని నాని సమాధానమిచ్చాడు. ఇక నాని చెప్పిన దానిబట్టి చూస్తే ‘జెర్సీ’ సీక్వెల్ అనేది కష్టమే అని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే.. ఈ సినిమాలో నాని పాత్ర చనిపోతుంది. ఒకవేళ సీక్వెల్ తీయాలన్నా పాత్ర లేకుండా సాధ్యం అవుతుందా లేదా  అనే విషయం దర్శకుడికే తెలియాలని అంతా అనుకుంటున్నారు. మరి, జెర్సీ సీక్వెల్ పై నాని చేసిన ఆసక్తికర వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి