iDreamPost
android-app
ios-app

జాతీయ అవార్డు సినిమా తీసిన నిర్మాతకు వేధింపులు.. ఏం జరిగిందంటే?

Producer Pushkar Mallikarjunayya Lodged A Complaint: ప్రముఖ నిర్మాత సీసీబీ పోలీసులను ఆశ్రయించారు. తనను వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Producer Pushkar Mallikarjunayya Lodged A Complaint: ప్రముఖ నిర్మాత సీసీబీ పోలీసులను ఆశ్రయించారు. తనను వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

జాతీయ అవార్డు సినిమా తీసిన నిర్మాతకు వేధింపులు.. ఏం జరిగిందంటే?

ఆయన ఒక సినిమా నిర్మాత. 20కి పైగా చిత్రాలు కూడా నిర్మించాడు. ఆయన నిర్మించిన చిత్రానికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. అలాంటి ప్రొడ్యూసర్ ఇప్పుడు తనను రక్షించాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. తనను ఎలాగైనా కాపాపండి అంటూ పోసీసు స్టేషన్ మెట్లు ఎ్కకాడు. తనను వడ్డీ వ్యాపారులు వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ నిర్మాత మరెవరో కాదు కన్నడ ఇండస్ట్రీకి చెందిన పుష్కర్ మల్లికార్జునయ్య. ఆయన తాజాగా సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కన్నడ ఇండస్ట్రీలో పుష్కర్ మల్లికార్జునయ్య ఫేమస్ ప్రొడ్యూసర్. ఆయన సినిమాకి నేషనల్ అవార్డు కూడా దక్కింది. 2021లో మలయాళంలో వచ్చి జాతీయ అవార్డు దక్కించుకున్న థింకలజచ్చా నిశ్చయం అనే సినిమాని నిర్మించింది ఈయనే. అలాగే రక్షిత్ శెట్టితో కలిసి.. సౌత్ లో సూపర్ హిట్టుగా నిలిచిన అతడే శ్రీమన్నారాయణ సినిమా నిర్మించింది ఈయనే. అలాగే రష్మిక మందన్న- రక్షిత్ శెట్టి కాంబోలో వచ్చిన కిరాక్ పార్టీకి కూడా ఆయన ఫైనాన్షియర్ గా ఉన్నాడు. అలాంటి నిర్మాత ఇప్పుడు పోలీసులను ఆశ్రయించారు. తనను వడ్డీ వ్యాపారులు వేధిస్తున్నారు అంటూ ఫిర్యాదు చేశారు.

అయితే ఆయనకు చిత్ర పరిశ్రమలో నష్టాలు మిగలడంతో ఆయనకు వడ్డీ వ్యాపారుల నుంచి వేధింపులు తప్పడం లేదు. వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిడి ఎక్కువైనట్లు తెలిపారు. నిర్మాత చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రొడ్యూసర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. తాను తీసిన కొన్ని చిత్రాలు ఆశించిన మేర ఆడకపోవడం.. నష్టాలు మిగలడంతో 2019 నుంచి 2023 మధ్యకాలంలో తన ఆదర్శ్ డీబీ అనే వ్యక్తి వద్ద విడతలవారీగా రూ.5 కోట్లు అప్పు చేశాడు. వాటికి నెలనెలా 5 శాతం వడ్డీ చొప్పు నగదు రూపంలో చెల్లించినట్లు తెలిపాడు. అలా అసలు రూ.5 కోట్లు.. వడ్డీ కలిపి ఏకంగా రూ.11 కోట్లు చెల్లించినట్లు వెల్లడించాడు. అయితే అతను మాత్రం తనకు ఇప్పటివరకు కట్టింది.. వడ్డీ, చక్రవడ్డీలకు సరిపోతుందని.. ఇంకా రూ.13 కోట్లు చెల్లించాలి అంటూ వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపించాడు. అలాగే తన ఇంటికి, కార్యాలయానికి మనుషులతో వచ్చి దుర్భాషలాడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరి. ప్రముఖ నిర్మాతకు వడ్డీ వ్యాపారులు వేధింపులకు గురి చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.