iDreamPost
android-app
ios-app

Nani: టైర్ 1, టైర్ 2 అంటూ రచ్చలోకి నన్ను లాగొద్దు: నాని

  • Published Aug 31, 2024 | 6:32 PM Updated Updated Aug 31, 2024 | 6:32 PM

Nani, Saripodhaa Sanivaaram Movie: న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రం బాక్సాఫీస్​ను షేక్ చేస్తోంది. గురువారం విడుదలైన ఈ సినిమా మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్​తో దూసుకెళ్తోంది.

Nani, Saripodhaa Sanivaaram Movie: న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రం బాక్సాఫీస్​ను షేక్ చేస్తోంది. గురువారం విడుదలైన ఈ సినిమా మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్​తో దూసుకెళ్తోంది.

  • Published Aug 31, 2024 | 6:32 PMUpdated Aug 31, 2024 | 6:32 PM
Nani: టైర్ 1, టైర్ 2 అంటూ రచ్చలోకి నన్ను లాగొద్దు: నాని

విభిన్నమైన చిత్రాలతో ఆడియెన్స్​ను థ్రిల్​కు గురిచేస్తుంటారు న్యాచురల్ స్టార్ నాని. వైవిధ్యమైన కథలకు ప్రాధాన్యత ఇస్తూ సినిమా సినిమాకు డిఫరెన్స్ ఉండేలా చూసుకుంటారు. ఏదో ఒక జోనర్​కు పరిమితమవకుండా డిఫరెంట్ మూవీస్ చేస్తూ అందర్నీ అలరిస్తుంటారు. ఆయన నటించిన కొత్త చిత్రం ‘సరిపోదా శనివారం’ గురువారం బిగ్​స్క్రీన్స్​లో రిలీజ్ అయింది. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్​తో దూసుకెళ్తోందీ ఫిల్మ్. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్​లో నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినిమాను ఇంతగా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులు, అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సందర్భంగా టైర్ 1, టైర్ 2 గురించి అడిగిన ఓ ప్రశ్నకు ఆయన రియాక్ట్ అయ్యారు. తనను ఆ రచ్చలోకి లాగొద్దని అన్నారు. నాని ఇంకా ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం..

‘సరిపోదా శనివారం’ సక్సెస్ ఈవెంట్​లో నానికి ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎదురైంది. ఈ చిత్రంతో మీరు టైర్ 1లోకి వచ్చేసినట్లేనని ఒక రిపోర్టర్ అడిగాడు. టైర్​ 1లోకి నాని వచ్చేశారని కన్ఫర్మ్ చేసిన ఆ రిపోర్టర్.. దీనిపై మీ ఫీలింగ్ ఏంటని అడగబోయాడు. దీని మీద స్పందించిన నాని.. టైర్ 1, టైర్ 2 గొడవలోకి తనను లాగొద్దన్నారు. దీంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. టైర్ 1, టైర్ 2 లాంటి పేర్లు పెట్టొద్దన్నారు. ఇలాంటివి ఎవరు, ఎందుకు మొదలుపెట్టారో తెలియదని.. దీంతో తనకు సంబంధం లేదన్నారు. సోషల్ మీడియాలో క్రియేట్ చేసిన వాటితో తనకు సంబంధం లేదన్న న్యాచురల్ స్టార్.. తనకు నచ్చిన సినిమాలను నచ్చినట్లు తీసుకుంటానని తెలిపారు. స్టెప్ బై స్టెప్ తన పరిధిని పెంచుకుంటూ పోతానని, ఇదే తనకు తెలుసునని స్పష్టం చేశారు.

టైర్ 1, టైర్ 2 అంటూ నానిని రిస్ట్రిక్ట్ చేసే బదులు వదిలేస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఆయన ఇంకా ముందుకు తీసుకెళ్తారని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ అన్నారు. ఇక, ‘సరిపోదా శనివారం’తో నాని టైర్ 1లోకి వెళ్తారా అంటూ ఈ మూవీ రిలీజ్​కు ముందు సోషల్ మీడియాలో బాగా చర్చ నడిచింది. రిలీజ్ అయ్యాక సినిమాకు భారీగా వసూళ్లు వస్తుండటంతో ఆయన ఆ ఫీట్​ను రీచ్ అయ్యారని కొందరు నెటిజన్స్ అంటున్నారు. ఇదే విషయంపై రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నాని, వివేక్ ఆత్రేయ పైవిధంగా రియాక్ట్ అయ్యారు. కాగా, బాక్సాఫీస్ వద్ద ‘సరిపోదా శనివారం’ దూకుడు మామూలుగా లేదు. ఈ మూవీ ఫస్ట్ డే సుమారు రూ.24 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. రెండో రోజు కూడా స్ట్రాంగ్ హోల్డ్​ను కనబర్చిందని సమాచారం. మొత్తం రెండ్రోజుల్లో కలిపి నాని ఫిల్మ్ రూ.34 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ అనలిస్టులు అంటున్నారు. మరో రూ.8 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ దాటేస్తుందని చెబుతున్నారు. మరి.. టైర్ 1, టైర్ 2 రచ్చలోకి తనను లాగొద్దంటూ నాని చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.