iDreamPost
android-app
ios-app

పుట్టిన రోజు ముందు అమ్మ కోరిక నెరవేర్చిన NTR.. భలే సర్​ప్రైజ్ ఇచ్చాడు!

  • Published Aug 31, 2024 | 5:01 PM Updated Updated Aug 31, 2024 | 5:01 PM

Jr NTR, Shalini Nandamuri: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ అభిమానులను సంతోష పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. బ్లాక్​బస్టర్ హిట్స్​ ఇస్తూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా చేసే తారక్.. ఇప్పుడు తన తల్లి కోసం ఓ అద్భుతమైన పని చేశాడు.

Jr NTR, Shalini Nandamuri: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ అభిమానులను సంతోష పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. బ్లాక్​బస్టర్ హిట్స్​ ఇస్తూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా చేసే తారక్.. ఇప్పుడు తన తల్లి కోసం ఓ అద్భుతమైన పని చేశాడు.

  • Published Aug 31, 2024 | 5:01 PMUpdated Aug 31, 2024 | 5:01 PM
పుట్టిన రోజు ముందు అమ్మ కోరిక నెరవేర్చిన NTR.. భలే సర్​ప్రైజ్ ఇచ్చాడు!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ అభిమానులను సంతోష పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. బ్లాక్​బస్టర్ హిట్స్​ ఇస్తూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా చేస్తుంటాడు తారక్. వైవిధ్యమైన చిత్రాలతో ఇటు అభిమానులతో పాటు అటు ఆడియెన్స్​ను కట్టిపడేసేందుకూ ట్రై చేస్తుంటాడు. ఇలా తనను ఇష్టపడే వారందరి కోసం ఇంతగా శ్రమించే తారక్.. ఇప్పుడు తన తల్లి షాలిని కోసం ఓ అద్భుతమైన పని చేశాడు. పుట్టిన రోజుకు ముందు అమ్మ చిరకాల కోరిక నెరవేర్చాడు. తన తల్లి ముఖంలో ఆనందం చూసేందుకు ఆయన పక్క రాష్ట్రానికి కదిలి వెళ్లాడు. ఆయన వెంట ఫ్యామిలీతో పాటు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి కూడా కదిలారు. తారక్ నెరవేర్చిన ఆ కోరిక ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎన్టీఆర్ తల్లి షాలిని సొంతూరు కర్ణాటకలోని కుందపుర. ఆ ఊరికి తారక్​ను తీసుకెళ్లాలనేది ఆమె కోరికట. అలాగే ఉడుపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణుడి ఆలయాన్ని తారక్​తో కలసి దర్శించుకోవాలని ఆమె ఎప్పుడూ అనుకునేవారట. కానీ ఎన్నిసార్లు అనుకున్నా ఇది కుదరలేదట. అయితే ఎట్టకేలకు ఆ టైమ్ వచ్చేసింది. ఇవాళ కుటుంబ సమేతంగా ఉడుపి కృష్ణుడ్ని దర్శించుకున్నాడు ఎన్టీఆర్. స్వామి వారిని దర్శించుకున్నాక తీర్థప్రసాదాలు తీసుకున్నాడు. ఆయన వెంట తల్లి షాలినీతో పాటు సతీమణి ప్రణతి ఉన్నారు. అలాగే తారక్​తో కొత్త చిత్రం తీస్తున్న క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, కన్నడ హీరో రిషబ్ శెట్టి కూడా వెంట వచ్చారు. ఆలయంలో వీళ్లంతా కలసి దిగిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఉడుపి శ్రీకృష్ణుడి ఆలయాన్ని సందర్శించడంపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు ఎన్టీఆర్. ‘తన సొంతూరైన కుందపురకు నన్ను తీసుకెళ్లాలనేది మా అమ్మ చిరకాల కోరిక. ఉడుపి శ్రీకృష్ణుడి ఆలయాన్ని నాతో కలసి దర్శించుకోవాలని ఆమె ఎప్పుడూ అనుకునేది. ఎట్టకేలకు అది నిజమైంది. ఆమె పుట్టిన రోజు సెప్టెంబర్ 2. బర్త్ డేకు ముందు ఆమె కోరికను నెరవేర్చినందుకు సంతోషంగా ఉంది. ఇదే ఆమెకు నేను ఇచ్చే బెస్ట్ గిఫ్ట్’ అని తారక్ ట్విట్టర్ పోస్ట్​లో రాసుకొచ్చారు. ఉడుపి సందర్శనకు సహకరించిన నిర్మాత విజయ్ కిర్గందూర్​తో పాటు ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టికి ఎన్టీఆర్ థ్యాంక్స్ చెప్పారు. ఈ క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్.. తారక్ సూపర్బ్ అని మెచ్చుకుంటున్నారు. ఇక, ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న ‘దేవర’ మూవీ సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానుంది. ‘వార్ 2’లో తారక్ పోర్షన్ షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చిందని సమాచారం.

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler